నీడ ఒక అంతర్ మానవి !

| సాహిత్యం | క‌విత్వం

నీడ ఒక అంతర్ మానవి !

- గీతాంజలి | 03.08.2018 11:31:48am


నీడలు నిజాలే చెబుతాయి
నువ్వు నటిస్తే తప్ప!
నీడ ఎవరినీ వదలదు!
నువ్వేం చేస్తున్నావో ..
దాన్నే పట్టిస్తుంది!
నీడ తనకు తానుగా నీడ కాదు.
అది ఒక మనిషి
ఒక జంతువు
ఒక చెట్టు
ఒక ఇల్లు
ఒక అడవి !
వీటి లోంచి నీడ ఎన్నెన్ని భాషల్లో మాట్లాడుతుందో తెలుసా?
నీడ..
ఒక రచయిత.
ఒక చిత్ర కారిని.
నీడ ఒక అద్దం !
నువ్వు ఎన్ని వర్ణాలుగా
చీలినా ..
మారని నలుపు రంగు లోనే..
నువ్వు మరణించే దాకా
నీడ..
నీ దేహ చిత్రంగా నిలబడుతుంది.!
నీడకి ఎంత కృతజ్ఞతో?
నువ్వు కృంగి పోతే ..
అదీ ఒంగి పోతుంది
నీకు తోడుగా!
నువ్వు ఎప్పుడైనా నీలో దాగిన..
పయోముఖ మానవుడి జాడను పసిగట్టిన
నీ నీడను చూసావా?
అలా..
చీకటిలో నిలబడితే
నీ నీడ ఎలా తెలుస్తుంది చెప్పు?
ఇలా రా.. వెలుగులోకి!
చూడు నీ నీడ ఎలా వాలిందో భూమ్మీద నీతో సహా...?
మరి నీడ అంటే ఏమనుకున్నావూ?
నీడ మనిషితో చేసే ఒక అనాది సంభాషణ!
నీడ. .
నీలోని చూపుని
అలజడిని
మాలిన్యాలను
కుట్రలను
భయ క్రౌర్యాలను
చిత్రిక పట్టే ఒక ఆదిమ శిల్పి !
నిజాన్ని కప్పేసినట్లు నీడని తప్పించుకోలేవు సుమా !
నీడ నిత్యం నిన్ను గాఢంగా కౌగలించుకొని
నీలోనే ఉండే ఒక అంతర్ మానవి!
నీడ నిత్యం మాట్లాడే ఒక కంఠం !
నీడ నిత్యం రాసే ఒక కలం !
నీడ ఎప్పటికప్పుడు నిన్ను రికార్డు చేసే ఒక సజీవ వీడియో !
నీడలతో ఏం చేస్తాంలే అనుకోకు.!నటించే నీడలను వదిలి పెట్టు.
కొన్ని నీడలుంటాయి..
అమరత్వలోకి ఒరిగేటప్పుడు కూడా..
నినాదాలతో పిడి కిళ్లను
బిగించే ఉంచేవి...సరిగ్గా ఆ..
నీడలే యుద్ధాలను ప్రకటిస్తాయి !!
నీడల కు ఒక ప్రాంతం లేదు.
నీడ విశ్వ జనీనం!
నీడలు ఎన్ని వార్తలు చెబుతాయనీ ?
కొన్ని నీడలకు..
కులా లు ఉంటాయి
మతాలు ఉంటాయి.
కుల - మతాల నీడలు కూడా మాట్లాడు తాయి.
నీడలు నడుస్తాయి
పరిగ గె డతాయి..
పారిపోతాయి..
దాక్కుంటాయి..
గుండెలు బాదుకుంటూ
ఎక్కెక్కి ఏడుస్థాయి..
పగలబడి నవ్వు తాయి..
కొన్ని నీడలు గోడల చాటున పథక రచనలు
చేస్తాయి...
కొన్ని స్థిరంగా నిలబడతాయి..
చూపుడువేలితో ప్రశ్నిస్తా యి..
బెడిరిస్తాయి..
సాసిస్తాయి..
కొన్ని నీడలు కొందరు తలల మీద చేతులు పెట్టీ
పాతాళం లోకి అణ‌చి వేస్తాయి.
కొన్ని నీడలు చేయి ఆసరా ఇచ్చి లేపుతాయి..
నీడలు కొన్ని
కౌగిలిలో భద్రత

ఇస్తాయి...
నీడలు కొన్ని
వెంటాడతాయి..
కత్తులతో ,గొడ్డల్లతో
నరికేస్థాయి..
నీడలు మనిషి లోపల నుంచి ఊరీకనే బయటకు రావు!!
మనిషి లోపలో..బయట నో..
విశ్వాసాల,నమ్మకాల
విధ్వంసం జరిగినప్పుడు..
నీడలు మెల్లగా పాముల్లా గానో..
బుల్లెట్ల లాగా నో బయటకు వస్తాయి !

నువ్వు ఎప్పుడైనా..
గర్భగుడి గోడల మీద
మగ మృగాంగాల విచ్చు కత్తులు చీల్చిన
ఎనిమిదేళ్ళ పసి పాప దేహపు పెనుగులాటల
నీడల నృత్యం చూసావా?

నువ్వు ఎప్పుడైనా
గోవుల్ని రక్షించి,
రక్బార్ల తలలు నరికేసిన,
హంతకులకు సన్మానం చేసిన..
కరవాలాల భీభస్త నీడలను చూసావా?

నువ్వు ఎప్పుడైనా
నీ కడుపులోని మలాన్ని,
తన నెత్తి మీది వెదురు బుట్టలోంచి
ధారలు ధారలుగా
శరీరాన్ని తడుపు తుంటే..
గాజు కళ్ళతో మోసిన పాకీ తల్లుల నీడలను చూసావా?

నువ్వు ఎప్పుడైనా. .
కాషాయపు కండువా
ఉరివేసిన రోహితుల
దేహాలు హాస్టల్ గోడల మీద..
నీడలు నీడలుగా..
ఊయలలూగడం చూసావా ?

భూమిని మింగుతున్న రాక్షసుడికి ఎదురొడ్డి..
ఎప్పటిలాగే దిఖ్ఖారపు
డప్పు మోగించిన కంది కొట్ కూరు సాయన్నలను
ముక్కలు ముక్కలుగా నరికిన గొడ్డలి నీడలు
భూమ్మీద రుధిర స్నానం చేయడం చూసావా ?

పోనీ..
నువ్వు ఎప్పుడైనా...
నీడలు వినిపించే యుధ్ధ కవితలని విన్నావా?
సముద్రాలు ఉమ్మ నీరుగా మారి..
అలల మీదుగా కుప్పలు కుప్పలుగా.. రోహింగ్యా ల జీవశ్చవాలను
మోస్తున్న పడవల నీడలు దుఖిస్తూ..
తీరం దాటిన్చడం చూసావా?

మరి..
సిరియా యుధ్దం లో
పిల్లల ఆకలి తీర్చడానికి
బాంబుల్లాంటి మృగాళ్ల బాహువుల్లోకి లాగ బడ్డ
అమ్మీ జాన్ ల దేహాల నీడలు చూసావా ?

ఇంకా..
పాలస్తీనా యుధ్దంలో..
ఎడ బాసిన తల్లుల కోసం.. అల్లల్లాడుతూ పరిగెత్తే పిల్లల నీడలు చూసావా?
దండకారణ్యంలో క్షణానికొక ఆదివాసీ అడవీ రక్షకుడు
నేల కొరగడం చూసావా?

నీడలు... ఘర్ వాపసి హోమాల్లో
చెంచు పెంట లను తగ లెయ్యడం చూసావా?
అండా సెల్ గోడల మీది నీడలు ..
ప్రజల మనిషి వేళ్ల నించి లిఖించిన ఉత్తరాలు చెప్పే కబుర్లు
విన్నావా?

పోనీ...పోనీ..
నీడ పడ్డ గోడలను ఎప్పుడైనా చూసావా?
వీరుడితో పాటు తానూ
నినాదాలు రాస్తుంది !

అలాగే..
భూమిని చూడు ..
అమరత్వం పిడికిళ్ళ ను..గజ్జె కట్టి రంకెలు వేస్తూన్న పాదాలను ..
నీడలతో నృత్యం చేయిస్తుంది !
నీడ వరి పైరై మనోహరంగా ఊగడం..
నీడ భూమిని కోల్పోతున్న మనుషుల గుండెల్లో మోదుగ పూవై వికసించడం. .
నీడ నేల కొరిగే వీరుడి వేలి కోసలలో
తుపాకీ గుళ్ల భాషలో మాట్లాడ్డం...
నీడ అమరుల బంధు మిత్రుల...జ్ఞాపకాల
తలపోత కన్నీళ్ళల్లో చిత్తడి చిత్తడిగా తడిసి పోవడం..
నీడ వీరుడి చేతిలో జెండాగా రెప రెప లాడ్డం .
నీడ యోధుడి పాద ముద్రలలో నడవడం
చూసావా చూసావా?

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి..
ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా??
రా... నీడలు చెప్పిన రహస్యాలను ..

మనం చేయాల్సిన యుద్ధాలను.. అందుకొని
స్థూపాన్ని- భూమినీ- నీడనూ
కౌగలించుకొని ముధ్ధాడుదాం !!
నిజాలు చెప్పే నీడలకు
సామూహికంగా కృతజ్ఞత లు చెబుదాం !!

No. of visitors : 446
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి

వదిలి వెళ్లకు...!

గీతాంజలి | 21.12.2018 07:53:43pm

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి.. సముద్రం లేని భూమి మీదకి. వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు.. ఎలా ఉండాలి నీవు లేక... ఎలా చేరాలి నీ దాకా? నిన్ను చేరాలంటే.. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •