బొమ్మల చొక్కా

| సాహిత్యం | క‌విత్వం

బొమ్మల చొక్కా

- అరసవిల్లి కృష్ణ‌ | 03.08.2018 12:13:41pm

అనేక నెల వంకలలో
ఒక పసితనపు వెలుగును చూసాను
నల్లని వెన్నెలలో
చిరుజల్లు సితారను చూసాను

మధ్యాహ్నవేళ
అంతా అన్నాలు తింటున్నప్పుడు
కదలాడిన ఆకలిపేగు శబ్దం ఆలకించాను
స్వప్నం చివరాఖరిలో

ఉలిక్కిపడిన హృదయ ప్రవాహపు లయను విన్నాను
ఆకాశం ఉరిమిన ప్రతిసారి
బిడ్డలవంక చూసిన
మాతృ ప్రేమల మూగభాషను విన్నాను

విశాల మైదానాలలో
నడుస్తున్న చిరుపాదాల
రక్తచిగుర్లును చూసాను

నాలుగ్గోడల మధ్య
చలికి వణుకుతున్న కంఠస్వరాన్ని
ఉలితో చెక్కుతున్న శరీర మూలుగును విన్నాను

దేశమంటే నుదుటున ధరించే
సింధూరం కావొచ్చు
శరీరాన్ని కప్పుకున్న కాషాయ వస్త్రం కావొచ్చు

బతుకు భయం వెంటాడుతున్నవేళ
సముద్రం లో మునిగిన నెలవంక ఎవరిది

పసివాడని పాలబుగ్గపై
మెరిసిన రక్తపుచుక్క ఎవరిది
దోసిలిలో కురిసిన రక్తపు చారఎవరిది
కరవాలం దొలిచిన
మాంసపు ముక్క ఎవరిది

అన్ని దారుల నుండి అల్లుతున్న
మాటల ఉరితాళ్ళ మధ్య
తెల్లవారు జామున వినబడే
అజా పిలుపు అతని కోసం వేచి వుంటుందా

ఏమని వాగ్ధానం చేయను
ఆకాశపు వీధులలో ఎగురుతున్న కాకి కంటికి
దేశం తొడుక్కున్న
బమ్మల చొక్కాను చూపెడుతున్నాను


ఆకుపచ్చని వెన్నెలా
మొక్కలా విస్తరిస్తున్న చందమామా
ఆఖరి సారి చెబుతున్నా
పురాణ పాత్రలు మరణించి నట్లే
హిందుత్వం మరణ శయ్యపై వేలాడుతుంది.

No. of visitors : 470
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నా మిత్రుని ఇల్లు ఎక్కడ...

అరసవిల్లికృష్ణ | 02.08.2017 01:26:52pm

ఆ దార౦బట నడిచి కొన్ని మ౦దారపూలను జేబులో దాచుకొని కిటికీ చువ్వల ను౦డి రాలి పడుతున్న మ౦చుబి౦దువుల...
...ఇంకా చదవండి

జ‌నం నెత్తిన రాజ‌ధాని గుదిబండ : అర‌స‌విల్లి కృష్ణ

| 17.08.2016 12:05:45am

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ట్ర మ‌హాస‌భల్లో భాగంగా బ‌హిరంగ స‌భ‌లో అర‌స‌విల్లి కృష్ణ ఉప‌న్యాసం........
...ఇంకా చదవండి

సరళరేఖ

అరసవిల్లికృష్ణ | 06.04.2017 12:05:11am

వేయి ముఖాలు లేని వాళ్ళు కనుపాపలవెనుక కాగడాలతో నిలబడినవాళ్ళు అగ్నిశిఖలు ఎడారిలో మ౦చుబి౦దువులు గాయపడిన పాటను మొలిపి౦చినవాళ్ళు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •