శప్తభూమి పరిచయ సభ

| కార్య‌క్ర‌మాలు

శప్తభూమి పరిచయ సభ

- విర‌సం | 09.08.2018 10:45:34am

ఆధునిక రాయలసీమ జన జీవితాన్ని చిత్రించిన రచయితల్లో ఒకరైన స్వామి ఇటీవల శప్తభూమి అనే నవల రాశారు. ఇటీవల రాయలసీమ తన గొంతు సవరించుకొని సరికొత్త పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రచయిత తప్పక సామాజిక కార్యకర్త కావాల్సిందే అనే వైఖరితో సీమ ప్రాంతీయ ఉద్యమంతో స్వామి కలిసి నడుస్తున్నారు. సీమ తన చరిత్రలోకి తొంగి చూసుకుంటున్న సందర్భం ఇది. ఇలాంటి అన్వేషనకు ఉపయోగపడే కాల్పనిక రూపంగా స్వామి ఈ నవల రాశారు. 18వ శతాబ్దంలో రాయలసీమ ఎలా ఉన్నది? ఇక్కడి జనం ఎలా జీవించారు? ఎలాంటి పాలనా, రాజకీయార్థిక సాంస్కృతిక రూపాలు ఉండేవి? మొదలైన చారిత్రక, జీవన కోణాలను స్వామి ఈ నవలలో చిత్రించారు. చారిత్రక ఆధారాలు అతి తక్కువగా దొరికే 18వ శతాబ్దమే ఈ నవల ఇతివృత్తం. దీన్ని అబ్బురమనిపించే సృజనాత్మక పద్ధతిలో నవలగా మలిచారు.

సాహిత్యం మానవ అనుభవంలోంచి పుట్టి పాఠకుల జీవితానుభవంలో భాగమవుతుంది. తద్వారా వాళ్ల ఆలోచనా ప్రపంచాన్ని విశాలం చేస్తుంది. కొత్త అవగాహనలతో చైతన్యవంతం చేస్తుంది. జీవితంపట్ల సరైన దృక్పథం ఉన్న రచయితలు రాసే కథలు, నవలలు ఈ పని అద్భుతంగా చేస్తాయి. రాయలసీమ ఉద్యమ సందర్భంలో స్వామి రాసిన శప్తభూమి నవలకు అలాంటి ప్రాధాన్యత ఉంది. నిజానికి రాయలసీమనే కాదు, ఏ సమాజాన్ని అర్థం చేసుకోడానికైనా గత కాలపు జీవితాన్ని సాహిత్యంలో చదువుకోవాల్సిందే.

తెలుగు సమాజాలన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఏ ప్రాంత చరిత్రనైనా ఉన్నత వర్గాల నుంచి చూస్తామా? ఉత్పత్తిదాయకమైన ప్రజల వైపు నుంచి చూస్తామా? అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. స్వామి ఈ నవలను అనంతపురం బహుజన, దళిత కులాల వైపు నుంచి చిత్రించారు. ఆ రకంగా స్వామి అసలైన చరిత్రకు పాఠకులను దగ్గర చేశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా నమోదైన రాయలసీమ అధ్యయనానికి శప్తభూమి ఒక మంచి ఆధారం. చరిత్రను ఆ కాలపు జీవన సారంలోంచి తెలుసుకోవడం చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అందువల్ల సహజంగానే ఈ నవల చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. కనీసం నాలుగైదు కోణాల్లో అధ్యయనం చేయవలసిన విస్తృతిని సాధించింది. సమాజ-సాహిత్య సంబంధాల చర్చకు దోహదం చేసిన ఎన్నో ఉత్తమ నవలలు తెలుగులో ఉన్నాయి. వాటి సరసన రాయలసీమ నుంచి ఇప్పుడీ శప్తభూమి. దు:ఖం, కన్నీళ్లు, హింస, అణచివేత సీమ జన జీవితంలో ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసుకోడానికి సామాజిక, చారిత్రక మూలాలను ఈ నవలలో చదువుకుందాం. అదే సమయంలో పీడిత ప్రజల్లో ప్రేమ, ధిక్కారం, తెగువ ఎలా ఉంటాయో కూడా స్వామి చిత్రించారు. ఈ భూమి మీద ఏ ప్రాంత కష్టజీవుల్లోనైనా అద్భుతమైన సృజనాత్మకత, సాహసం నిండుగా ఉంటాయి. తరతరాలుగా రాయలసీమ ప్రజల్లో కూడా అలాంటి శక్తి ఉంది. ఒక ప్రాంతంగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోడానికి అది విడుదల కావాల్సి ఉంది. దాని కోసం జరగవలసిన ప్రజాస్వామిక సాంస్కృతిక పోరాటానికి శప్తభూమి దోహదపడుతుంది. ఈ నవలా పరిచయ సభకు తప్పక రండి.

12 ఆగస్టు ఆదివారం, ఉదయం 10.00 గంటలకు, k
తెలుగు తోట, మద్దూరు నగర్‌, కర్నూలు
అధ్యక్షత: సుబ్బరాయుడు
వక్తలు: జి. వెంకటకృష్ణ , పాణి, స్వామి(శప్తభూమి నవలా రచయిత)

విప్లవ రచయితల సంఘం
కర్నూలు యూనిట్‌





No. of visitors : 207
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - ఆగ‌స్టు 2018
    శప్తభూమి పరిచయ సభ
    రాపూరు దళితవాడపై పోలీసు దమనకాండను నిర‌సిద్దాం
    నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి
    ప్రజాపక్ష రచయిత, అనువాదకులు నిర్మలానందకు జోహార్లు
    Statement from the Indian Writersʹ Forum
    Dream to Dream
    ఊరుకుందామా?
    అమ్మ చెప్పింది
    మౌనం తెగేదెప్పుడు?
    మిగతా కథ
    బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •