జనగణమన లోగుట్టు

| సాహిత్యం | వ్యాసాలు

జనగణమన లోగుట్టు

- పి.ప్రసాద్ | 15.08.2018 11:57:40pm

కథనాలూ, కథలూ ఎప్పటికీ చరిత్ర కాజాలవు. అవాస్తవాలూ, అతిశయోక్తులూ, కల్పనలూ, వక్రీకరణలూ కథా రచనలో; కథనాల వ్యాప్తిలో అంటరానివి కాదు. కానీ చరిత్ర రచనకి మాత్రం అవి కచ్చితంగా అంటరానివే. ఆగస్టు 15... దాని నిజ రంగు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ దేశ ప్రజల లో ఎంత ఎక్కువ స్థాయిలో బట్ట బయలు అవుతుంటే, అంతే ఎక్కువ స్థాయిలో కృత్రిమ అందాలతో అది సింగారించబడుతుంది. 71 ఏళ్ళ కుహనా స్వాతంత్ర్యం నేడు మరింత బాహ్య సౌందర్యాలతో రకరకాలు గా అలంకరణలకు గురి చేయడం వెనక ఆంతర్యం ఇదే!

ఇది తెచ్చిపెట్టుకున్న కృత్రిమతనంతో ఉంటుంది. ఈ తరహా కృత్రిమతనంలో సహజత్వం సహజంగానే మసక బారుతుంది. ఇలా మసక బారించడం వెనక కూడా రహస్యాలు దాగి ఉంటాయి. చరిత్ర తన గర్భంలో దాచుకున్న కొన్ని నిప్పులాంటి నిజాలని బహిర్గత పరచనివ్వ కూడని రహస్య లక్ష్యం కూడా దాగి ఉంటుంది. అలాంటి "ఆబతనం" లేదా "కక్కుర్తి గుణం" తో కొన్ని కుహనా దేశభక్తియుత శక్తులు తెర వెనుక నుండి కొన్ని కట్టు కథలు వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా దేశ సహజ వనరులని, ప్రజలని విదేశాలకు ఎవరు తాకట్టు పెడతారో, అట్టి దేశ ద్రోహ శక్తులే ఈ తరహా కృత్రిమ మరియు కుహనా దేశభక్తి కథలని, కధనాలని తెగ సృష్టిస్తాయి. పాపం తెలిసో తెలియకో మధ్యతరగతి విద్యాధిక ప్రజలు ఈతరహా ప్రచారం పట్ల ఆకర్షణకు గురవుతాయి. ఫలితంగా ఆగస్టు 15న మన "మేడిపండు" స్వాతంత్య్రం పట్ల సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరగతుంది. ఈ సందర్బంగా ఇప్పటికే ప్రచారమవుతున్న రెండు కృత్రిమ కట్టుకథల వెనక నిప్పు లాంటి నిజాలను క్లుప్తంగానైనా వివరించాలి.

1) INDIAకి ఆ పేరులో ఓ భావార్ధం దాగి ఉందట. INDIA లో ఐదు అక్షరాలకు ఐదు అర్ధాలు ఉన్నాయట! "I" అంటే "Independent" అట!"N" అంటే "Nation" అట! "D" అంటే Declared అట! "I" అంటే "IN" అట! "A" అంటే "AUGUST" అట! ఆహా, ఎంత చక్కని కట్టుకధ! అంటే15-8-1947 న మాత్రమే మన దేశానికి తొలిసారి ఇండియా అనే నామకరణం జరిగినట్లు కదా! దీని ప్రకారం చరిత్రలో అంతకు ముందెన్నడూ ఇండియా అనే పేరు లేనట్లే కదా! ఇదో శుద్ధ అబద్ధం! ఇండియా అనే పేరు వెనక సుదీర్ఘ నేపధ్యచరిత్ర ఉంది. 1947 కంటే 89 ఏళ్ల కింద "government of India Act-1858" అను చట్టంతో బ్రిటీష్ ప్రభుత్వం లండన్ పార్లమెంటు ద్వారా మన పాలనా ప్రాంతాన్ని "బ్రిటిష్ ఇండియా" గా నామకరణం చేసింది. ఏడవ ఎడ్వర్డ్, పంచమ జార్జి చక్రవర్తి లని emperor of india అనిపిలిచే వారు. దానికంటే ఏడాది ముందు జరిగిన ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం ని బ్రిటీష్ వలస పాలకులు "ఇండియన్ సిపాయుల తిరుగుబాటు" (indian mutiny) గా పిలిచారు. 1857-58 లో "company rule in india" పేరుతో పాలించారు. అంతకంటే ముందు నూరేళ్లు అంటే 1757 నుండి 1857 వరకు దీన్ని "కంపెనీ ఇండియా" గా బ్రిటీష్ ప్రభుత్వ రికార్డులో పాలన సాగింది. 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా పూర్తి పాలన చేపట్టక ముందు కూడా ఇక్కడ వ్యాపారం చేసిన వాణిజ్య సంస్థ పేరు "East india company". ఇంగ్లీష్ వాళ్ళకంటే నూరేళ్ళ ముందే ఇక్కడ 1498లోనే అడుగు పెట్టిన పోర్చుగీస్ పాలకులు "porchugese state of india" గా తమ లిస్బన్ పార్లమెంటు లో ప్రస్తావించే వాళ్ళు. 1602 లో అడుగుపెట్టిన డచ్చి వ్యాపారులు కూడా ఇక్కడ తమ వ్యాపార సంస్థని "డచ్ ఇండియా"అన్నారు. 1664లో అడుగుపెట్టిన ఫ్రెంచ్ వాళ్ళు కూడా "ఫ్రెంచ్ ఇండియా" గా పిలిచారు. ఎక్కడ పాలించిన indian governor generals, british India viceroys పేర్లలో కూడా ఇండియా అను పదం ఉంది. 1885 లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఇంగ్లీష్ పేరు Indian national congress అని తెలిసిందే. 1935లో బ్రిటిష్ ఇండియాఆక్ట్ లో కూడా ఇండియా పేరు ఉంది. లార్డ్ మౌంట్ బాటన్ అవార్డు కి లోబడి కాంగ్రెస్, బ్రిటిష్ సర్కార్ల మధ్య ఒప్పందం ప్రకారం1947 ఆగస్టు 15న అధికార మార్పిడి జరిగింది. దీనికి సుమారు నెల ముందు 18-7-1947న లండన్ పార్లమెంటు ఆమోదించిన "Indian Indepandance Act" లో కూడా ఇండియా పెరు ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రాచీన కాలంలో ఈ భూ ఉప ఖండాన్ని జంబూ ద్వీపం గా పిలిచే వాళ్ళు. ఆరోజుల్లో మొదట అరబ్బు భాషీయులు సింధు నది పేరు ఆధారంగా సింధు ప్రాంతం గా పిలిచారు. బెంగాల్ భాషలో "వ" ని "బ" గా ఉచ్చరించినట్లే అరబ్బులు "స" ని "హ" గా పిలుస్తారు. కాలగమనంలో "సింధు" ని "ఇందు"గా; అదే "హిందు" గా మారింది. ఈ నామ పరిణామ క్రమం పై ప్రసిద్ద ప్రాచీన భారత చరిత్ర పరిశోధకుడు, పురాతన తాత్వికుడు రాహుల్ సాంకృత్యాయన్ వివరణ ఉండనే ఉంది. కానీ అదేదో 1947 ఆగస్టు 15 న కొత్తగా ఒక గొప్ప అర్ధవంతమైన స్పూర్తితో ఇండియాకి నామ కరణం జరిగినట్లు చక్కని కట్టు కదని ప్రచారంలో పెట్టారు.

మన కంప్యూటర్ యువతరాన్ని అద్భుత కైపు లో మైమరిపించి పర్వ దినంగా జరిపిస్తున్న తెర వెనుక కుట్రలని అర్ధం చేసుకుందాం. మనదేశ రైతు, కూలి, కార్మిక, ఉద్యోగుల్ని, ఇంకా వివిధ బాధిత సామాజిక వర్గాల ప్రజలని పచ్చి మోసం చేస్తున్న తమ విద్రోహకర విధానాలని కప్పిపెట్టుకునే కుట్రలున్నాయి. పాత చరిత్ర చదివే వీలు లేని మన కుర్రకారు సాఫ్టువేరు విద్యాధిక యువ తరాన్ని ఇలాంటి మాయ మాటల జిమ్మిక్కులతో మత్తెక్కించి బైకులకి త్రివర్ణ పతాకాలు కట్టించి, వారి జేబులకి అందమైన బ్యాడ్జీలు ధరింప జేయుంచి వీధుల్లో ఈ ఒక్క రోజు స్వాతంత్ర్య పర్వదిన వాతావరణాన్ని కల్పించే కుతంత్రాలు ఉన్నాయి.తద్వారా దేశ ప్రజలని వంచించే దేశద్రోహ శక్తుల వ్యూహాలు తెర వెనుక ఉన్నాయి.మన యువ తరం గూగుల్ విజ్ఞానంలో అద్భుత ప్రావీణ్యులే! కానీ వీరు వాస్తవ సామాజిక, చారిత్రిక పౌర విజ్ఞానాలకు మాత్రం పాలకులచేత దూరం చేయ బదుతున్నారు. ఇలాంటి మన యువతరం మీద దేశ ద్రోహ పాలకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కార్పొరేట్ మీడియా ద్వారా వారిని ప్రభావితం చేస్తున్నది. చరిత్ర సబ్జెక్టు కి దూరమైన, మన గూగుల్ యువతరం ప్రధానంగా రేపు ఆగస్టు 15కి చేసే సందడిని ఊహించ గలం. అట్టి మన మధ్య తరగతి, విద్యాధిక యువతరానికి కూడా వాస్తవాలు ఓపికగా బోధించే బాధ్యత ప్రగతిశీల శక్తులపై ఉంది.

2) ఇక రేపు మారు మోగనున్న "జనగణమన" గీతం వెనక దాగిన లోగుట్టు కూడా తెలుసుకుందాం. ఈ గీతం ప్రతి పదార్ధాలతో ఈమధ్య వాటుసాఫ్ లలో చక్కర్లు కొడుతోంది. అదో అద్భుత స్ఫూర్తిదాయక దేశభక్తి గీతంగా గొప్పగా ప్రచారం జరుగుతోంది. దాని వెనక మోసపూరిత విద్రోహ చరిత్ర తెలియని నేటి విద్యాధిక యువతరం అది వింటూ ఊగి పోతోంది. అందుకే క్లుప్తంగా దాన్నీ గూర్చి కూడా ప్రస్తావిద్దాం. 1858 నుండి బ్రిటీష్ ఇండియా కి కలకత్తా రాజధానిగా ఉంది.అదో విప్లవ సమర శీల స్వాతంత్ర్యోద్యమ కేంద్రంగా ఎదుగుతుంది. నేటి ప. బెంగాల్, నేటి బంగ్లా దేశ కలిసి వంగ(బంగ లేదా బెంగాల్) దేశంగా ఉండేది. అది యావత్తు బ్రిటిష్ ఇండియా కి విప్లవ పోరాట కేంద్రంగా ఎదుగుతుంది. అందుకే మత ప్రాతిపదిక పై కర్జన్ హయాంలో వంగ విభజన జరిగింది.(మత ప్రాతిపదికపై దేశ విభజనకి పునాది నిజానికి ఆనాడే పడ్డాయి) 1905 నుండి ఐదారేళ్ళ పాటు సమరశీల "వంగ విభజన" వ్యతిరేక ఉద్యమం సాగింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం రెండు చర్యలు చేపట్టింది. ఒకటి, కాంగ్రెస్ ని మరింత ప్రభుభక్తి సంస్థ గా మార్చుకుంటూ తమ వంగ విభజన చర్యని వెనక్కి తీసుకోవడం! రెండోది, మిలిటెంట్ పోరాట ప్రాంత0 కలకత్తకి దూరంగా సురక్షిత ఢిల్లీకి రాజధానిని మార్చడం! విక్టోరియా రాణి తర్వాత వచ్చిన ఎడ్వర్డ్-7 1910లో మృతి చెందాడు. దీనితో పంచమ జార్జ్ బ్రిటీష్ చక్రవర్తి అయ్యాడు. ఆయన ఇండియాకి వచ్చి రాజధాని ప్రారంభోత్సవం చేయాలి. 12-12-1911 తేదీ ఖరారు అయ్యుంది. మైకులు లేని ఆ రోజుల్లోనే రెండున్నర లక్షల మందిని ఆంగ్లేయులు సమీకరించి భారీ సభ జరిపారు. పంచమ జార్జి చక్రవర్తి పాదాలపై సాష్టాంగ పడ్డ ఆనాటి ఐదు వందలకు పైగా ఫ్యూడల్ సంస్థాన పాలకుల, కాంగ్రెస్ ప్రభు భక్తి పరాయణుల పాద సేవ అత్యంత అవమానకర మైనది. ఆ సభలో వంగ విభజన నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు చేసిన చక్రవర్తి ప్రకటనపై ఉబ్బి తబ్బిబ్బయి పోయారు. అంత వరకూ దానిపై పోరాడిన కాంగ్రెస్ నేతలు సైతం పొంగిపోయారు. ఈ సందర్భాన్ని పురస్కరించు కొని అదే డిసెంబర్ 26, 27, 28 లో కలకత్తాలో కాంగ్రెస్ సభ జరిగింది. ఆ సభలో తమ ఆందోళన పట్ల స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వాన్నీ, పంచమ జార్జి చక్రవర్తి ని కీర్తిస్త్తూ కొన్ని తీర్మానాలు చేయడం నాటి కాంగ్రెస్ సభ ప్రధాన ఎజెండా! ఆసభలో రెండో రోజు(27) పాడిన పాటయే "జనగణమన" గీతం! అందులోని "అధినాయక జయహే" అంటే "ఓ పంచమ జార్జి చక్రవర్తి,నీకు జయము కలుగుగాక" అని అర్ధం.

రవీంద్రనాధ్ టాగోర్ పట్ల చాలా గౌరవ భావం గల మన దేశ పౌరులకి, మర్యాదస్తులకి ఈ మాట మింగటం కష్టమే కావచ్చు. కానీ ఇది చరిత్ర! దాన్ని మనం మార్చలేము. దానికి ప్రతిఫల0గానే బ్రిటిష్ ప్రభుత్వ తెరవెనుక కృషితో ఆయన రాసిన గీతాంజలి కి నోబులు బహుమతి 1913 లో వచ్చిందన్న విమర్శ లేకపోలేదు. ప్రపంచంలో అది పొందిన మొదటి నాన్-యురోపియన్ ఠాగూర్! ఎందుకంత గొప్ప బహుమతి లభించిందో మరి! ఐతే మొత్తం ఠాగూర్ జీవితం ఇలాంటి చీకటి చరిత్ర కాదు. వెలుగుల చరిత్ర కూడా కాదు. అది వెలుగు నీడలసమాహారం. దానికి పునాది ఆనాటి చరిత్ర గమనంలో ఉంది. అది మరో కోణం! మరో సారి! మరో సందర్భం!

దీని నేపధ్య చరిత్ర పై 35 ఏళ్లక్రితం ప్రచురించిన "జాతీయత లేని జనగణమన గీతం" అను పుస్తకం తెలుగుసీమలో, (ప్రధానంగా విద్యార్థిలోకం లో) నాడు పెద్ద సంచలనం కలిగించింది. ఐతే నాటికి విద్యా సంస్థల్లో చరిత్ర, పొలిటికల్ సైన్స్, సివిక్స్ వంటి శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు అవి నిర్లక్ష్యం చేయ బడటం తెలిసిందే! ఇది గూగుల్ యుగంకదా! కావున అవి కనుమరుగు అయ్యాయి. విద్యార్థి లోకం క్లాసు రూములో సామాజిక, రాజకీయ జ్ఞానం నేర్చుకునే అవకాశం నేడు లేకుండా పోయింది. అది ఇక ముందు ప్రజాపోరాటాల నుండి అనగా తరగతి గదులకు బయట మాత్రమే నేర్చుకునే సబిజెక్టుగా ఉంటుంది. ఈ స్తితి నేటి ప్రపంచీకరణ పాలకులకి అనుకూలమైనది. అందుకే నేడు ప్రగతిశీల శక్తులపై చాలా బాధ్యత ఉంది. చరిత్ర పరిజ్ఞానంతో ప్రత్యక్ష సంబంధం లేని ఆధునిక విద్యాధిక, మధ్యతరగతి వర్గాలని కల్పితాలు, కట్టు కథలు, వక్రీకరణలూ, అసత్య ప్రచారాలతో సరళీకరణ పాలకులు కార్పొరేట్ మీడియా అండతో పెద్ద ఎత్తున తప్పు దారి పట్టించు గలుగుతున్నారు. వారు నేటి యువతరాన్నీ తమ రహస్య రాజకీయ ఎజెండా కి అనుగున్యంగా రెచ్చగొట్ట గలుగుతున్నారు. ప్రగతిశీల శక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారాలని తమకి వీలున్న మేరకు బహిర్గతపరిచి యువతరాన్ని చైతన్య పరచాల్సి ఉంది

పి.ప్రసాద్ (ఐ.ఎఫ్.టి.యూ)
14-8-2018

No. of visitors : 905
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సామ్రాజ్యవాదయుగంలో సాటిలేని హీరో ఉత్తర కొరియా !

పి. ప్రసాదు | 18.10.2017 03:15:47pm

నేటి సామ్రాజ్యవాద యుగంలో ఉత్తరకొరియా ఒక ప్రతిఘటనా ప్రతీకగా నిలుస్తుంది.ప్రతిఘటనా ప్రపంచానికి ఒక విప్లవ స్ఫూర్తి దాతగా నిలుస్తుంది.అగ్రరాజ్యల దురాక్రమణదారీ.....
...ఇంకా చదవండి

ఈ బాలుడి కనీటి ప్రశ్నకు న్యాయవ్యవస్థ జవాబు ఏమిటి

పి. ప్రసాదు | 06.04.2017 11:46:57am

దేశ సంపదలను పంది కొక్కుల్లా మెక్కేవారికే,దేశ సంపదలను సృష్టిస్తున్న శ్రమ జీవులకూ మధ్య యిదీ నేడు అమలు జరుగుతున్న వివక్షతా న్యాయం కార్పొరేటు మీడియాలో కార్మికుల...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •