అమరత్వం వెలుగులో

| సంభాషణ

అమరత్వం వెలుగులో

- అశోక్ కుంబ‌ము | 16.08.2018 12:01:14am

ఆమె పన్నెండేళ్ళ దళిత బిడ్డ. తండ్రిని కోల్పోయింది. తల్లికి దూరమయ్యింది. వున్నదల్లా రెక్కల కష్టం తప్ప ఏ అధారం లేని అరవైఏండ్ల ఒంటరి నాయనమ్మ. తండ్రిని కోల్పోయిందంటె అతనిదేమి సహజ మరణం కాదు. అతను ప్రజల కోసం పనిచేస్తున్నందుకు, విప్లవోద్యమ నాయకుడు అయినందుకు అతన్ని రాజ్యం బూటకపు ఎదురుకాల్పుల్లో హత్యచేసింది. అతను అమరుడయ్యాడు. విప్లవాభిమానులు అతని త్యాగాన్ని, అమరత్వాన్ని ఎత్తిపట్టారు. గుండెలకు హత్తుకున్నారు. మరి ఏ రాజకీయాలు లేని అతని తల్లి, బిడ్డఆ అమరత్వాన్నిఎట్లా చూస్తున్నారో తెలుసుకోవాలని ముందుగా ఆ అమరుడి తల్లితో మాట్లాడి అతని విప్లవ ప్రస్థానం గురించి అడిగి తెలుసుకున్న. అతని గురుంచి ఆతల్లి నోట విన్నాక విప్లవం సామాన్యులను అసామాన్యుల చేస్తుందని చెప్పడానికి ఆ అమరుడు ఒక ఉదాహరణ అనిపించింది.

ఒక మారుమూల తెలంగాణ పల్లెలో దళిత కుటుంబంలో పుట్టి పెరిగి, అచలంచెలుగా ఎదిగి దండకారణ్య పరిధిలోని విప్లవోద్యమానికి నాయకుడయ్యాడు. ఆతల్లి తన కొడుకు గురుంచి ఎంతగా చెప్పిందో, రాజ్యం తన కుటుంబముపై కొనసాగించిన పాశవిక దాడి గురుంచి అంత కంటె ఎక్కువే చెప్పింది. నేను ఆ తల్లితో మాట్లాడుతుంటె ఆ అమరుడి బిడ్డ పక్కనే కూర్చొని అన్నీవింటూ వుంది. చిన్నఅమ్మాయి కదా తన తండ్రి రాజకీయాల గురుంచి ఏమి తెలిసుంటదిలే అని మనసులో అనుకుంటూనే
"మీ నాయన గురుంచి నీకు తెలిసిన విషయాలు ఏమైనాచెప్పగలవా?" అని అడిగిన.

తను వెంటనే "మా నాయన ఒక నక్సలైట్. ఒకవిప్లవకారుడు. ఇదినాకు ఒకటో తరగతిలో వున్నప్పుడే తెలిసింది"అని తనకంతా తెలుసన్నట్లుగా గట్టిగా చెప్పింది. ఒకటో తరగతి అని అనగానే ఆశ్చ్యర్యం వేసి "అంత చిన్నప్పుడే ఎట్ల తెలిసింది" అని అడిగిన.

"ఎట్లంటే పోలీసోళ్ళు, ఇంకా వేరే ఆఫీసర్లు వచ్చి మీటింగులకు పిలిచి మాట్లాడమని చెప్పెటోళ్ళు. మా నాయన ఒక నక్సలైట్అ ని, ఆయన మమ్ముల వదిలిపోవడం వళ్ళనే మాకు ఇన్ని కష్టాలు వచ్చినయని పోలీసోళ్ళు అప్పటినుండె బాగా చెప్పెటోళ్ళు. అప్పటి నుండె అనిపించేది ఆయన తల్లితండ్రుల, కుటుంబాన్ని వదిలి ఎందుకు పోయిండు అని. అందరి తండ్రులు పిల్లల చూసుకుంటుండ్రు, మరి నాయన ఎందుకు ఇట్ల చేసిండు అని బాధపడేదాన్ని. ఒక్కదాన్నేఏడ్చేదాన్ని. అమ్మ నాయన బతికుండి కూడలే కుండచేసిండు. నన్ను చిన్నతనంలనే ఇన్నికష్టాల పాలు చేసిండు ఆయన ఒక వేస్ట్మనిషి అనుకునేదాన్ని. అసహించుకునేదాన్ని. ఆయనకు వ్యతిరేఖంగ మాట్లాడేదాన్ని. నాఫ్రండ్స్ ʹమీనాయన పెద్దనక్సలై ట్అంటకదా ʹఅంటెʹ అయితేంది, ఆయన మాకు చేసింది ఏముందిʹ అనేదాన్ని.ʹసొంతపిల్లల, తల్లితండ్రుల వదిలిపెట్టి పోయి ఏంచేస్తె ఏంలాభంʹ అనేదాన్ని. ఎందుకంటె మాకు ఎవ్వరు లేరు. ఏమిలేదు. రెండేళ్ళ కిందనే మాతాత కూడ చచ్చిపోయిండు. నాయనమ్మే కూలి చేసి బతికిస్తుంది. బడికిపంపిస్తుంది. ఇన్ని బాధలల్ల ఉంటె ఎవ్వరైన నాలాగనే ఆలోచిస్తరు కదా సార్, ʹఅనినా సమాధానం కోసం ఎదురుచూడకుండ మాట్లాడుతూ పోయింది.

ʹకాని మానాయన చనిపోయినంక కానిఆయన అంటే ఏమిటో అర్థంకాలేదు. ఆయన తన కోసం, తన వాళ్ళ కోసం కాకుండ ప్రజల కోసం బ్రతికిన మనిషి. ఏ స్వార్థం లేకుండ ప్రజల తరుపున పోరాటంచేసిండని అర్థమయ్యింది. ఇప్పుడు ఆయన గురుంచి గొప్పగాచెప్పుకుటున్న.ʹ

"మరి ఇప్పుడు నీ ఫ్రండ్స్ ఏమంటుండ్రు" అని అడిగిన.

తను వెంటనే "వాళ్ళకు నక్సలైట్ల గురుంచి పెద్దగా తెలియదు. వాళ్ళకు చెప్పాను ʹఇప్పుడు మన పుస్తకాలలో ఉన్న ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ మాదిరిగానేప్రజలు స్వేచ్చగా, సమానత్వంతో బతకాలని కొట్లాడుతున్నోళ్ళని. వాళ్ళకి ఒక పార్టీ ఉంది. అందులో మా నాయన ఒక నాయకుడిగా ఎదిగాడని చెప్పిన."

"నీవు చెప్పింది వాళ్ళకు అర్థమయిందని అనిపించిందా నీకు?" అని అడిగిన.

"అర్థమయ్యిందో లేదో నాకు తెలియదు. కాని ʹనిన్ను మీనాయన అలా వదిలేసి పోవద్దుకదనేʹ అన్నారు.ʹనిజమే అది చాలాచేదువిషయమే. కాని ఆయన తన స్వార్థం కోసం పోలేదు కదాʹ అని బదులిచ్చిన్న. వాళ్ళ అమ్మానాయనల కంటె మా నాయాన చాలా గొప్ప వ్యక్తని చెప్పిన. వాళ్ళ అమ్మానాయన్లు వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం బతుకుతుండ్రు. కాని మానాయన మనందరి కోసం బతికిండు. తాను ఏది మంచి మార్గం అనుకుండో ఆదారిలోనే పోయిండు. ఆ దారిలనే బతకాలనుకుండు. ఎందరో పార్టీలోచేయలేక సరెండర్ అయ్యి వస్తుండ్రు. కాని మానాయన ఎన్ని కష్టాలొచ్చినా చివరిక్షణంవరకు ప్రజల కోసమే పనిచేయాలనుకుండు. మాలాంటోళ్ళందరు వెలుగులోకి రావాలని, వాళ్ళ హక్కులు దక్కించుకోవాలని పోరాడిండు.ʹ

ʹఅయినా మా నాయనను ఒక్కసారి చూస్తె బాగుండు అనుకునేదాన్ని. ఆయనను ఎప్పుడు చూడలేదు. ఎట్లుంటడో కూడ తెలియదు. మా నాయన ఎప్పుడైన నా కోసం వస్తడు అని దైర్యంగా బతికేదాని. కాని ఆయన చనిపోయిండు అంటే అస్సలు నమ్మలే. దేవుడు మా నాయనను అట్ల చెయ్యడనుకున్న. రేపు మానాయన వయసుమల్లినంక ఇప్పుడు చేస్తున్న పని చేయలేడు కదా, అప్పుడైనా నా దగ్గరకు వస్తడనుకున్న. అప్పుడు మా నాయన మొఖాన్ని కళ్ళ నిండ చూసుకోవచ్చు. నా చేత అన్నం తినబెట్టోచ్చు. అవన్ని కలలు కనేదాన్ని. కాని చివరికి ఆయన శవం ఇంటికి తేగానే చాలా బాధనిపించింది.ʹ (ఆబిడ్డబిగ్గరగఏడుస్తూచెప్తూనేవుంది…)

ʹగుండె ఆగిపోయినట్లు అయ్యింది. మొత్తం ఒళ్లంతా వనుకుడు. పిచ్చి లేసింది. నెల రోజులదాక ముద్ద నోట్లకు పోలె. కాని తర్వాత అనుకున్న, మా నాయన పోయిండు. కాని ఆయన నడిచిన దారిల ఆయన వెనకాల ఇంకా ఎంతో మంది వీరులున్నరు. వాళ్ళతో కలిసి మనమందరం పోరాటం చేయాలి. మన స్వార్థం చూసుకోకుండ పనిచేయాలి. నా ఫ్రండ్స్ కు కూడా చెప్పిన ʹమా నాయాన చనిపోలేదు. అమరడయ్యాడని. ఆయన ఇక్కడ లేడు. కాని నీను వున్నాను కదా.
ఇంకా ఎంతో మంది వీరులు వున్నారుకదా. ఆ దారి ఆగిపోదు.ʹ

అంత చిన్న వయసులులో అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తుంటె పడకకుర్చి మేధావులు, పాలక వర్గ భజన పరులు పదేపదే చెప్తున్నఒక బ్రమను ఆమె ముందు పెట్టాను."నువ్వేమో పోరాటం చెయ్యాలని అంటున్నావు. కాని, కొందరు మేధావులనుకునేవాళ్ళు మరియు ప్రభుత్వాలు ఇక అంతా అయిపోయింది. ఇది విప్లవాల కాలం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా వృధా అంటున్నారు. మరివాళ్ళను ఎట్లా అర్థం చేసుకుంటవు. నీ దృష్టిలో అసలు విప్లవం అంటె ఏంటి" అని అడిగిన.

"స్వార్థంతో చెప్పేవాళ్ళు అలాగే చెప్తరు. మాలాంటి జీవితం వాళ్ళకు ఉంటె అలా అనరు. మాకు భూమి లేదు. మా ముసల్ది కూలి చేస్తెనే తిండి. వానొస్తె ఇంట్లకన్ని నీల్లె. గట్టిగ గాడ్పొస్తె ఇంటి పైకప్పు లేసిపోతది. ఇట్లాంటి బతుకున్నోళ్ళ కోసమేకదా విప్లవం. నా దృష్టిలో విప్లవం అంటే ఒక మంచి పని చేయడం. అదీ ఎలాంటి స్వార్థం లేకుండ సమాజంలో అందరికి పనికొచ్చే పనిచేయడం. మొత్తం సమాజాన్ని మన కుటుంబం అనుకుంటె అందులో కొందరు మన అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెల్లు చీకట్లో ఉండిపోతె వాళ్ళను వెలుగులోకి తేసుకురావలి కదా.అదే కదా మంచితనం.మానవత్వంʹ అనిచెప్పింది.

అంతచిన్నవయసులోఆబిడ్డకు ఎంతగొప్పఆలోచనలువున్నాయనిపించింది. ఆమె "మొత్తం సమాజాన్నిమనకుటుంబం" అనుకోవాలి అని అనగానే ఆపసిహృదయానికి మనసులోనె సల్యూట్చేసిన. పాలకవర్గ పల్లకి మోసే మేధావి వర్గానికి, గందరగోళంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్నసమూహాలకు ఆబిడ్డతో తన జీవితపాఠం చెప్పిస్తె ఎంతబాగుండు అనిపించింది. తనతండ్రి అమరత్వంవెలుగులో విముక్తిమార్గాన్నివిడమరిచి చెప్పేది.


No. of visitors : 1168
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మద గజాన్ని నిలువరిస్తున్న గడ్డిపోచలు

అశోక్ కుంబము | 07.12.2016 11:22:16am

అంతరించి పోతుందనుకున్న జాతి చూపుతున్న తెగువ పోరాడె శక్తులన్నింటికి సంక్షోభ సందర్భంలో ప్రాణవాయువుగ మారనుంది. గెలుపు, ఓటమిల అంచనాలు ఏవైనా, రాజ్యం అండతో తెగబలి...
...ఇంకా చదవండి

సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?

అశోక్ కుంబము | 17.06.2020 10:36:11pm

ʹహిమాలయ కవలలు" అని పిలువబడే ఇండియా, చైనాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే వుంది. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •