ఎగరాల్సింది ఒకే రంగు

| సాహిత్యం | క‌విత్వం

ఎగరాల్సింది ఒకే రంగు

- శేషు | 16.08.2018 12:57:24am

ఇది నువ్వు కలకన్న సమాజం కాదు
ఇది నువ్వు చూడాలనుకున్న సమాజం కాదు
ఆ సమాజం ఇంకా రాలేదు

దేశం కోసం అర్పించిన తలలమీద
ఎగిరిన ఆర్యుల జండా ఇంకా దిగలేదు
ఆ పోరాటం ఇంకా అగలేదు
ఇప్పట్లో ఆగే వీలు లేదు
రోజుకో కొత్త రూపం మార్చుకుంటుంది

ఇది స్వాతంత్య్ర దినం కాదు
సంతోషంగా ఉండడానికి
సంబరాలు చేసుకోవడానికి
ఇది పెరియార్ చెప్పిన సంతాప దినం

ఆకాశం ఏ రంగు లో ఉన్నా
ఎగరాల్సింది మూడు రంగులు ఒకే రంగు
నాకు స్వాతంత్య్రం రాలేదని చెప్పే రంగు
ఇక్కడ స్వేచ్ఛ లేదు అని చెప్పే రంగు

నిన్ను చిన్న చూపు చూడడానికి కారణమైన రంగు
నిన్ను నిన్నుగా చూపిన రంగు
రెయిన్బో లో లేని రంగు
నల్ల రంగు





No. of visitors : 503
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మౌనం తెగేదెప్పుడు?

శేషు | 21.07.2018 12:03:22pm

మతంలో మునుగుతున్న సమాజం మతంతో రమిస్తున్న సమాజం రమించి రమించి గో పుత్రులని కంటున్న సమాజం సమాజనికి జబ్బు చేసింది రక్తం రంగు మారింది శాంతి పేరుతో తెల్లబడింది ...
...ఇంకా చదవండి

వెలిసిన రంగులు

శేషు కొర్ల‌పాటి | 19.11.2018 04:05:19pm

ఎన్నికల వాసన గుప్పుమని కొట్టింది ఇప్పుడే కొన్ని పార్టీలు పుడతాయి పాత పార్టీల పక్కలో చేరడానికి కొత్త జండాలు కప్పుకుంటాయి రోడ్డుకు అడ్డంగా జెండా దిమ్మలు వెల...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
    బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య
    పంచాది నిర్మల
    గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి
    అరుణతార డిసెంబర్ - 2018
    ఎవరి గురించి మాట్లాడుకుందాం?
    వదిలి వెళ్లకు...!
    వెల్తుర్ధ్వని
    దిశంబర్ 6
    ఆ...ఏడురోజులు
    కాపాడుకుందాం
    నేను నగర మావోయిస్ట్

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •