పాల్తీన్ కవర్ లో
కట్టేసిన శవాల మూటను కదిలిస్తే
చీము, నెత్తురు కలిసి,
నీరు, కన్నీరు వరదలా
పారుతున్న భారతాన
శవాలను పైకి ఎత్తుతే
జారిపోతున్న పేగులను
తల్లిదండ్రులు మూటగట్టుకొని
తెచ్చుకుంటున్న దేశాన
పిడికిళ్ళు బిగియించి
తలెత్తుకొని పోరాడమని
ప్రజలను చైతన్యం చేస్తున్న
వాళ్ళ తలలను మాయం
చేస్తున్న రాజ్యాన...
ఓ నవభారత ముద్దు బిడ్డల్లారా
సోమరుల్లా చూస్తూ
కూర్చున్నారా...?
సచ్చుబడిన పీనుగల్లారా
ఏడవకండెడవకండి
చావండ్ర చావండి...
భారతం లాఠీ తూటల
రాజ్యమయింది,
రామరాజ్యం కాస్త దోపిడి
రాజ్యమయింది..
ఆగస్టు 15 ఎందరికో
అంటరానిదయ్యింది..
జనవరి 26 ఓ భూటక
నినాదమయ్యింది..
నవభారతం నపుంసక
భారతమయి వెలుగుతుంది
క్లబ్బుల్లో, పబ్బుల్లో
లేజర్ షోల వెలుగుల్లో
నగ్నంగా తిరుగుతూ
ఊరేగుతుంది...
మీ మతవున్మాద
రక్త పిశాచ దాహాన్ని,
మా విప్లవ రక్తంతో
అడ్డుపడి ఆపగలిగితే చాలు
విజయం మాదే
భారతం మాదే
విప్లవం మాదే..
ఏదోరోజు ఆ రోజొస్తుంది..
ఈ రోజు వీళ్ళు
అమరులైవుండొచ్చు
రేపే డప్పులై,
రగిలే నిప్పుకనికలై
తొలిపొద్దు అరుణారుణ రవి కిరణాలై
చీకటి కడుపును చీల్చుకొని
మళ్ళి ఉదయిస్తరు
మళ్ళి ఉద్యమిస్తరు,
విప్లవం అంటే మరణం కాదురా
అది ఓ రణం...
Type in English and Press Space to Convert in Telugu |
కొత్త చరిత్రపచ్చి నిజం చెప్పనా...
అన్యాయం, దౌర్జన్యం, దోపిడి, అవినీతి పురుడుపోసుకున్న చోటే
విప్లవ తిరుగుబాటు కూడా పుడుతుంది..
దెబ్బతిన్న చోటే
విప్లవం పంజా విసురుతుంది..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |