అల్లరి విద్యార్థులు

| సాహిత్యం | క‌విత్వం

అల్లరి విద్యార్థులు

- ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am


నా క్లాసురూములొ
చెట్టుమీది పక్షుల్లాగ
వివిధ రకాల విద్యార్థులు
భిన్నరీతులు ,విభిన్న మనస్తత్వాలు
అదుపుజేయడం తలనొప్బిగమారింది

ఓ వైపు షేక్ ష్పియర్ ..
మాట్లాడితె కవిత్వమే
కంటినిండా నిగూఢ కాంతులే
అడిగిన ప్రశ్నలకల్లా
పొడుపు కథల్తొ సామెతల్తొ
మహాద్భుత ఉపమానాల్తొ జవాబులిస్తాడు

ముందు సీట్లొ రొనాల్డొ
కుదురుగ కూచోడు మరి
డస్టర్ నూ చాక్ పీస్ నూ తన్నేస్తూ
క్లాసు రూమంతా గొడవ గొడవ

గెలీలియో కైతె
ప్రేరణే అవసరంలేదు
వెనక బెంచీలొ డిటాచ్ డుగ కూచొని
చుక్కల గురించి కలల గంటుంటాడు

మెకలాంజిలో ను
సంతోషపెట్టాల్సిన అవసరమే లేదు
ఆయన లోకం ఆయనది
అందరూ రాతలొ నిమగ్నమైతె
అతనో మూల బొమ్మలు గీస్తుంటాడు

సోక్రటీసైతె.. నాకెప్పుడూ, ఓ పజిల్
పరీక్ష పెడితె చాలు
జవాబు దొరకని ప్రశ్నల్తొ
వరదలా ముంచెత్తుతాడు

ఓఫ్రా విన్ ఫ్రే
నాకు నిద్ర లేనిరాత్రుల ప్రసాదిస్తుంది
ఏ పని మొదలెట్టినా
నాటకీయత ఆమె ప్రత్యేకత

కార్ల్ మార్క్స్ ..
ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు
విరామమెరుగని కాలంమీద
ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు

మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న
టైము దొర్కితెచాలు
ప్రార్థనలూ ,ధ్యానాలె ఆమెలోకం

కానీ ,
ఒక్కవిద్యార్థి గురించి చెప్పికోవాలి
చెదిరిన జుట్టుతొ చిరిగినబట్టల్తొ
అతని కళ్ళల్లొ వేలాదిగ ప్రశ్నలు
చిన్న చిన్నలెక్కలుతేలడానికి
క్యాలికులేటర్ వెతుకుతూ
స్కూలంతా కలెదిరుగుతుంటాడు
అశాంతివనంలొ రగిలె
నిప్పుకణంలా ఉంటాడతను

ఇదీ, మా తరగతి గది
విద్యార్థుల అసహనపు శిలువమీద
ఇట్లా, నావృత్తి కాలపు జీవితాన్ని
త్యాగం చేస్తుంటాను

నోట్ - రొనాల్డొ (రష్యా ఫుట్ బాల్ కోచ్)
MARX poetry- PRODIGAL PUPILS IN MY CLASS కు స్వేచ్ఛానువాదం

No. of visitors : 395
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

సుకన్య శాంత | 19.05.2018 09:39:48am

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర.....
...ఇంకా చదవండి

భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి

ఆ...ఏడురోజులు

ఉదయమిత్ర | 21.12.2018 02:10:52am

బూటుపాదంకింద నలిగిన అక్షరం ఆర్తనాదమై చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •