ప్రజా గొంతుకలను నులిమేసే మోడీ కుట్రను ఖండిద్దాం.

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ప్రజా గొంతుకలను నులిమేసే మోడీ కుట్రను ఖండిద్దాం.

- విరసం | 28.08.2018 11:02:34pm

అదే కుట్ర... మరింత దుర్మార్గంగా, మరింత నిస్సిగ్గుగా
ప్రజా గొంతుకలను నులిమేసే మోడీ కుట్రను ఖండిద్దాం. దేశాన్ని ఫాసిజం బారినుండి రక్షించుకుందాం.

ఈరోజు ఉదయం విరసం వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ వరవరరావు, ఆయన కూతుర్లు అనల, పవన ఇళ్లపై, కార్యవర్గ సభ్యుడు, జర్నలిస్టు క్రాంతి ఇంటిపై మహారాష్ట్ర పోలీసులు సోదాల పేరుతో దాడిచేశారు. అనల సహచరుడు, విరసం సభ్యుడు, కథా రచయిత, జర్నలిస్టు కూర్మనాథ్ ను, పవన సహచరుడు, ఇఫ్లూ ప్రొఫెసర్, సామాజిక ఉద్యమకారుడు సత్యనారాయణను గంటల తరబడి వేధించారు. భీతావహ వాతావరణం సృష్టించి వారిని, వారి కుటుంబ సభ్యలను గృహనిర్బంధంలో ఉంచారు. వాళ్ళు అపురూపంగా దాచుకున్న సాహిత్యాన్ని, ల్యాప్ టాప్ లను, పెన్ డ్రైవ్ లను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.

నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన వారిలో వరవరరావు ఉన్నారని ఆరోపిస్తూ ఆయన్ని అరెస్టు చేసారు. క్రాంతి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ఎత్తుకుపోయారు. హార్ట్ పేషంట్ అయిన అతని తల్లితో చాలా అమానవీయంగా ప్రవర్తించారు. ఇదే తరహాలో బొంబాయిలో రచయిత వెర్నన్ గొంజాల్వెజ్, న్యాయవాది సుజాన్ అబ్రహం, ఇండియన్ అసోసిఏషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ నాయకుడు అరుణ్ ఫెరేరా, రాంచిలో సామాజిక కార్యకర్త 83ఏళ్ల స్టాన్ స్వామి, డిల్లీలో అడ్వకేట్ సుధా భరద్వాజ్, పౌరహక్కుల కార్యకర్త, పాత్రికేయుడు గౌతమ్ నవలాఖా, గోవాలో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే ఇళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. వెర్నన్ గొంజాల్వెజ్, సుజాన్ అబ్రహం, అరుణ్ ఫెరేరా, స్టాన్ స్వామిలను అరెస్టు చేసారు. గౌతమ్ నవలాఖా తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కలిస్తే అరెస్టుపై ఒక రోజు స్టే విధించింది. సరైన కారణము, వారెంట్ లేకుండా అడ్వకేట్ సుధా భరద్వాజ్ ను అక్రమంగా అరెస్టు చేయడానికి స్థానిక కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇక ఆ సమయంలో ఇంట్లో లేని ఆనంద్ తేల్తుంబ్డే పరారీలో ఉన్నాడని పోలీసులు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు.

1975 అనుభవం తర్వాత ప్రభుత్వాలు ఎమర్జెన్సీని ప్రకటించడం మానుకున్నాయి. ప్రకటించకుండానే పకడ్బందీగా అమలు చేయడంలో పాలకులు ఒకరికి మించి ఒకరు ఆరితేరుతున్నారు. ఇవాల తెల్లవారుఝాము నుండి దేశంలోని పలుప్రాంతాల్లో ప్రజాస్వామికవాదుల, సామాజిక కార్యకర్తల ఇళ్ళ పై పోలీసులు దాడులు చేసిన విధానం, వందల సంఖ్యలో బలగాలు ఇళ్ళను దిగ్బంధించడం, వారెంటు, ఆధారాలు లేకుండా చొరబడి, విచారణ పేరుతో భీభత్సం సృష్టించి అరెస్టులు చేయడం చూస్తే ఈ ప్రభుత్వం ఇంకెంత బరితెగించిందో అర్థమవుతున్నది.

జూన్ నెలలో భీమా కారేగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ డిల్లీ, పూనేలలో ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేసి విమర్శల పాలైన ప్రభుత్వం, పోలీసులు ఒక కుట్రకు తెరతీసారు. మావోయిస్టులు మోడీ హత్యకు కుట్ర పన్నారని, అందులో పలువురు ప్రజాసంఘాల బాధ్యుల పేర్లను ఇరికించి, వాటికి సంబంధించిన ఆధారాలంటూ మూడు లేఖలను బైటికి తీసారు. ఇవి పోలీసులు సృష్టించిన కాగితాలని వాటిల్లో ప్రతి వాక్యంలోని అసంబద్ధత రుజువు చేసాయి. అందులో వరవరరావు, తదితరుల పేరు ప్రస్తావించడం భారీ కుట్రలో భాగమని ఆనాడే దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఖండించారు. దిగజారిన మోడీ ప్రతిష్టని తిరిగి నిలబెట్టడానికి వీటిని సృష్టించారని ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడాయి. ఇవాల మళ్ళీ దాన్ని బైటికి తీసి, అరెస్టులు, సోదాలతో ఉద్రిక్తతలు సృష్టించి తమ పెంపుడు మీడియా చానళ్ళతో గోబెల్స్ ప్రభారం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం దీనికి పూర్తి సహకారం అందిస్తూ వందలాదిగా పోలీసులను వరవరరావు, క్రాంతిల ఇళ్ళ చుట్టూ మోహరించింది.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నాలుగు వందల దాకా పట్టపగలు హత్యలు జరిగాయి. అన్నీ హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో. ఒకటి రెండు మినహాయిస్తే కనీసం వీటిపై దర్యాప్తు కూడా లేదు. హంతకులకు సన్మానాలు జరుగుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో పన్నెండేళ్ళ, పదమూడేళ్ళ పిల్లలతో సహా మావోయిస్టులని పేరుపెట్టి వందల సంఖ్యలో జనాన్ని కాల్చివేస్తున్నారు. ఈ హత్యలకు రివార్డులు దక్కుతున్నాయి. మహిళలు, దళితులు, ముస్లింలు, ఆదివాసులు ఎవరికీ దేశంలో రక్షణ లేదు. చట్టం, న్యాయవ్యవస్థ ఎన్నడూ లేనంతగా బోనులో నిలబడ్డాయి. ప్రజల్ని కొత్తకొత్త పన్నులతో చావబాదుతున్నారు. అధికారంలోకి వచ్చేముందు చేసిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఏ మాత్రం నైతికత ఉన్నా అధికారంలో ఉండడానికి పాలకులు సిగ్గుపడాలి.

కానీ అణచివేత తప్ప ఏ నీతీ లేని ప్రభుత్వం తన అనైతికతను కప్పి పుచ్చుకొనేందుకు, ప్రశ్నలను, నిరసనలకు అణిచేయడానికి కుట్ర పన్నింది. అత్యంత నిస్సిగ్గుగా ఒక అసంబద్ధమైన ఆరోపణను చేసి, కుట్రపూరితంగా ప్రజల పక్షాన నిలిచిన రచయితలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నది. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళితులు సంఘటితమవుతున్నారు. భీమా కారేగావ్ ప్రతిఘటన అందులో భాగం. ఓర్వలేక సంఘపరివార్ శక్తులు దాడి చేశాయి. నిరసనలకు ఉలిక్కిపడిన ఆరెస్సెస్, బిజెపి ప్రభుత్వం నిజమైన నేరస్తులను కాపాడటానికి, ప్రజల దృష్టి మళ్ళించడానికే ఈ కుట్ర పన్నింది. పనిలోపనిగా ప్రధాన మంత్రి ప్రాణాలకు ప్రమాదం దాపురించినదని గగ్గోలు పెడుతూ సానుభూతి మైలేజ్ సంపాదించాలని చూస్తున్నది. మేం ముందే చెప్పినట్లు నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది. విరసంపైనా, కామ్రేడ్ వరవరరావుపైనా కుట్ర కేసులు కొత్త కాదు. గతంలో అనేక అప్రజాస్వామిక చట్టాల కింద నిర్బంధించినట్లు ఇప్పడు మరింత దుర్మార్గమైన ఊపా చట్టం వివి పై మోపారు. ఈసారి మరింత నిస్సిగ్గుగా ఈ కుట్ర జరిగింది, జరుగుతున్నది.

బిజెపి, సంఘపరివార్ కుట్రలను తిప్పికొడదాం. అక్రమంగా అరెస్టు చేసిన ప్రజాసంఘాల బాధ్యులందరినీ విడుదల చేయాలని, కుట్ర కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రచయితలూ అందరూ కలిసి రండి.

-పాణి (కార్యదర్శి),
కాశీం, వరలక్ష్మి, రాంకీ, గీతాంజలి, జగన్, బాసిత్, అరసవిల్లి కృష్ణ, కిరణ్ (కార్యవర్గ సభ్యులు)
కళ్యాణ్ రావు (సీనియర్ సభ్యులు)

No. of visitors : 1269
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •