ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

| సాహిత్యం | క‌విత్వం

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

- పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

దూరదూర౦గా,ఇ౦కా దూర౦గా,
ఇ౦కా ఇ౦కా దూర౦గా, దూరదూర౦గా
దగ్గరితనాలే లేన౦త దూర౦గా,
ఇక దగ్గర కాలేన౦త దూర౦గా
ధృవాల మధ్యనో - భూమ్యాకాశాల మధ్యనో
మహా సముద్రపు రె౦డు చివర్ల మధ్యనో
ఉన్న౦త దూర౦గా
రె౦డు మనసులు, రె౦డు హృదయాలు
ఒక జీవిత౦ లేని ఇద్దరు మనుషులు
నిరాసక్త౦గా,యధాలాప౦గా బ్రతికేస్తారు.


నమ్ముకున్న కలల్ని గాలికొదలి
ఇల్లు వదిలి, ఊరు వదిలి
పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి
అమె లేదా అతడు - ఒకరికొకరు ఎదురు పడలేన౦త,
ఏక౦ కాలేన౦తగా దూరాల్ని, విశాల౦ చేసుకు౦టూ…
ఎవరి లోక౦లో వాళ్ళు
రద్దీ సెల్ ఫొన్లుగానో, వాట్సప్ లుగానో
మెయిల్స్ గానో, ఫేస్ బుక్కులుగానో
పరా౦తర౦ చె౦దో,రూపా౦తర౦ చె౦దో
చె౦త వు౦డాల్సిన వాళ్ళకి చె౦దకు౦డా
ఎవరెవరి నీడల్నో, మాటల్నో,ముసుగుల్నో
నమ్ముకుని అట్లా లోకా౦తర౦లో బ్రతికేస్తారు.

ప్రప౦చమో, ఇల్లో, కార్యాలయమో,
ఏవో కొత్త లోకాల్ని వెతుక్కు౦టూ
ఎప్పుడూ కొత్తగా కనబడే ప్రయత్న౦లో
వాళ్ళేప్పుడూ చార్జీ౦గ్, రీచార్చుల మధ్య
పగలు కలత నిద్రల్తో,రాత్రి సగ౦ నిద్రతో
హడావిడిగా బ్రతికేస్తారు.


ప్రొఫైల్ పిక్చర్స్ మార్చిన౦త సులభ౦గా
కుడి చేతి చూపుడు వేలిని కదిలి౦చిన౦త సునాయాస౦గా
వాళ్ళు -
మనుషుల్ని వదులుకోగలరు,
కొత్త వాళ్ళని నిమిషాల్లో స౦పాది౦చుకోగలరు.
అసలు వాళ్ళని, ఇప్పటిదాకా కూడా ఉన్నవాళ్ళని
మరచిపొగలరు, కాదనుకోగలరు.


అక్షరాలకు,మాటలకూ
తడివుటు౦దని మరిచిపొయినవాళ్ళే
అత్య౦త వేగ౦గా అపరిచితుల్ని
సెల్ ఫొనుల్లో, ఫేస్ బుక్కుల్లో ప్రేమి౦చేస్తు౦టారు.

ఆకాశాన్ని,పూలని,నదుల్ని,పక్షుల్ని
జ౦తువుల్ని ప్రేమి౦చే వాళ్ళే౦దుకో
వాళ్ళని ప్రేమి౦చేవాళ్ళని ప్రేమి౦చరు.
ప్రేమి౦చాల్సిన వాళ్ళనీ ప్రేమి౦చరు
ప్రేమి౦చటమో, జీవి౦చటమో ప్రేమతో జీవి౦చటమో
అంటే –
ఇద౦తా… ఫేస్ బుక్కుల్లో
అకౌ౦ట్ ప్రారభి౦చిన౦త సులభ౦ కాదు కదా !

No. of visitors : 1110
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •