మావోలు - మీవోళ్ళు

| సాహిత్యం | క‌థ‌లు

మావోలు - మీవోళ్ళు

- బమ్మిడి జగదీశ్వరరావు | 06.09.2018 10:03:52pm

• గల్పిక

ʹమావోలుకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు..ʹ
ʹమీవోళ్ళే గదా రాజ్యాంగాన్ని తగలబెట్టింది.. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలన్నది..ʹ

ʹమావోలు ఆయుధాలు పట్టుకు పోరాడుతున్నారు..ʹ
ʹమీవోళ్ళు ఆయుధాలు పట్టుకు పాలిస్తున్నప్పుడు మావోలు ఆయుధాలు పట్టుకు పోరాడుతున్నారు..ʹ

ʹమావోలు చంపడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలకు ఆధారం వుంది, అందులో వరవరరావు పేరుంది..ʹ
ʹమీవోళ్ళు యేకంగా యెప్పుడో చనిపోయిన మహాత్మాగాంధీజీని కూడా అప్పుడు పుట్టుంటే నేనే చంపేదాన్నని పూజా శకున్ పాండే పబ్లిగ్గా చెపుతున్నారు..ʹ

ʹమావోలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు..ʹ
ʹమీవోళ్ళు చట్టాన్నే కాదు, యేకంగా నాయస్థానాల్నే చేతుల్లోకి తీసుకుంటున్నారు.. ఐదు హిందూ నాయస్థానాల్ని ప్రకటించి, వొక న్యాయస్థానానికి గాంధీని చంపుతానని, గాడ్సే హీరో అని చెప్పిన పాండేని న్యాయమూర్తిగా కూడా నియమించారు..ʹ

ʹమావోలు అమాయకుల్ని రిక్రూట్ చేసుకొని ఆయుధ శిక్షణనిస్తున్నారు..ʹ
ʹమీవోళ్ళు అందర్నీ దేశభక్తులు కండి అని కర్రసాము నుండి కత్తిసాము దాక నిరంతర శిక్షణా కేంద్రాలే నడుపుతున్నారు..ʹ

ʹమావోలు ప్రత్యేక విద్యా ప్రవేటు సైన్యం పేరుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు నడుపుతున్నారు..ʹ
ʹమీవోళ్ళు మతరక్షణ గోరక్షణ పేరుతో మూక దాడులు జరుపుతూ ఏం తినాలో ఏం తాగాలో చెప్పి హత్యలు చేస్తూ ప్రభుత్వమూ మీరై ప్రత్యామ్నాయమూ మీరై నడుస్తున్నారు..ʹ

ʹమావోలు ఆచరణ సాధ్యంకాని సమ సమాజం కోసం కలలుగంటున్నారు..ʹ
ʹమీవోళ్ళు లౌకిక రాజ్యాన్ని కాదని హిందూ సమాజం కోసం కలలుగంటున్నారు..ʹ





No. of visitors : 442
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అగ్ర వుగ్రవాదం!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:00:48pm

ఉగ్రవాదులంతా వొకటి కాదు!ʹ ʹఐఎస్ఐ వాళ్ళు చంపితే?ʹ ʹఅది తీవ్రవాదం!ʹ ʹఆరెస్సెస్ వాళ్ళు చంపితే?ʹ ʹదేశభక్తి!ʹ* .. ...
...ఇంకా చదవండి

దేశద్రోహ నేరం!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:03:54pm

మనమిలా మాట్లాడితే ప్రభుత్వమే మనమీద కుట్ర కేసు పెడుతుందేమో?ʹ ʹఅందుకే తాగుబోతులు.. త్యాగ మూర్తులని నినదిద్దాం!ʹ ʹఅయితే ముప్పై లక్షల అమరులకు మన ఘన నివాళి చెబ.....
...ఇంకా చదవండి

ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 01:56:17pm

మోడీగారికి సొంత కారు కూడా లేదు, తెలుసా?ʹ ʹకారు లేకపోతే యేo?, కోట్ల విలువ చేసే కోట్లు వేసుకోగలడుʹ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?

    సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి
    అరుణతార అక్టోబర్ -2108
    సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు
    సాహిత్య వర్గ పోరాటవాది
    హింస - ( ప్రతి )హింస
    టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు
    సాహిత్య విమర్శ చచ్చిన వేళ
    అరుణతార
    అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని
    విప్లవ బాటసారి త్రిపురనేని

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •