యుద్ధానంతర యుద్ధగీతం

| సాహిత్యం | క‌విత్వం

యుద్ధానంతర యుద్ధగీతం

- అరుణాంక్ | 06.09.2018 11:50:31pm


1
రాయాలి
వాక్యానంతర వాక్యాల్లాగే
యుద్ధానంతర యుద్ధాల్ని రాయాలి
కేసులనంతర అరెస్టులనీ
అరెస్టులనంతర శిక్షలనీ
న్యాయపీఠం మీద అన్యాయపు తీర్పులనీ రాయాలి
డెమోక్రసిని అణచే డెమనోక్రసి దాడులనే రాయాలి
ఎంతకాలం మాబోక్రసి అని
నాట్ ఇన్ మై నేమ్ అని
తప్పించుకునే వాక్యాలు రాస్తారు
గళాన్ని కలానికి
కలాన్ని గళానికి ముడిపెట్టి
గొంతు మీద కత్తి వేలాడుతున్నా
మను వ్యతిరేక గీతమే పాడాలి
ముంజేతి మీద గొడ్డలి పెట్టినా అదే రాయాలి

కళ్లముందు కాలువలై పారుతున్న నెత్తురు
రాజులు అంతరించిన ʹరిపబ్లిక్ʹలో రాజద్రోహం
నగరం విస్తరించి ఊరిని కబలించడం
రాజ్యం విస్తరిస్తూ అడవిని ధ్వంసించడం
ఇంకా మనల్ని మనమే బంధీంచుకొని
గిరిగీసుకొని
తలుపులు వేసుకొని
చీకటిలో బాసింపట్టు వేసుకొని ఎట్లా కూర్చుంటాం
కాసింత వెలుగును పంచె ఒక్కటంటే ఒక్క వాక్యం రాద్దాం
సమూహంగా కూడుకోని పేరాలుగా ప్రవహిద్దాం

2
ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే
ఓ నా తెలంగాణ నేల
నీకు గుర్తుందా!
నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు
ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది
కాకపోతే రూరల్ పేద నక్సలైటు నుండి
అర్బన్ ఇంటలెక్చువల్ నక్సలైటుగా మారింది అంతే

ఇప్పుడు కవిత్వం అంటే ఏమిటి!?
అని తక్కడెలో తూచే వాళ్ళు అనేకానేకులు తయారయ్యారు
ʹసారథులʹ పాటలు కవిత్వమో కాదో
తెలియదు గానీ
బిగిసిన పిడికిళ్ళు మాత్రం కవిత్వమే
గొంతును పెటిల్మని చీల్చుకువచ్చిన నినాదం ఖచ్చితంగా కవిత్వమే
సోదాల ఇనుపబూట్ల చప్పుడును దాటిన ప్రతిమాట
బందీఖాన జాలి ములాఖత్ లో వినివినపడని ముచ్చట
వీపున లాఠీ చేసిన నృత్యపు తాలూకు గాయం
అంతా అంతా కవిత్వమే

No. of visitors : 641
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి

ఆలోచన ఒక మహారణ్యం

అరుణాంక్‌ | 17.04.2018 12:31:36am

మరణించేది వ్యక్తులే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మహారణ్యం వారి ఆశయం వారి ఆలోచనలు...
...ఇంకా చదవండి

Dream to Dream

అరుణాంక్‌ | 22.07.2018 01:05:48am

కలిసి కట్టుకున్న కలల సౌధం మిసైల్ పడ్డట్టు నిట్టనిలువునా కుప్పకూలిపోయింది కలిసి కన్న కల వేటగాడ్ని చూసిన పావురాల గుంపులా చెదిరిపోయింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •