ఇప్పటికైనా అర్ధమయిందా....?

| సాహిత్యం | క‌విత్వం

ఇప్పటికైనా అర్ధమయిందా....?

- విజయ్ సాధు | 06.09.2018 11:53:14pm

ఇప్పటికైనా అర్ధమయిందా....?
ఓ వేకువన నీ వాకిట్లో ఖాకీలు కవాతులు చేస్తాయని,
మాటు వేసిన మృగాలు ఒక్కసారిగా దాడి చేస్తాయని,
ఊరంతా ఊరుకున్న పాపానికి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని,

ఈనాటికైనా అవగతమయిందా...?
నువ్వు ఊహించని క్షణాన ఉత్పాతమై వస్తారని,
మరణధూపాలు వేసేందుకు మత్తడిలా దుంకుతారని,
విదిలించ వీలు లేని విచ్చుకున్న పిడికిళ్లతో బంధిస్తారని,

మౌనంగా ఉన్నది అందుకేనని వాదిస్తావా..?
కాలు కదపకుండా కూర్చుంది ఇందుకేనంటావా..?
అయితే బదులిస్తున్నాను చెవులురిక్కించి విను

రంగులు పూసుకున్నా అసలు రంగు బయటపడేదే
సంకెళ్లెన్ని వేసినా సూర్యోదయం జరిగి తీరేదే
ఈ అత్యవసరస్ధితికి కారణం నువ్వే
ఈ అప్రకటిత నిషేధానికి కారకం నీ మౌనమే

ఇప్పటికైనా గడ్డకట్టిన గొంతుకు నినాదాలివ్వు
సత్తువ లేని నరాలకు నెత్తుటి ప్రవాహాలివ్వు
కొడిగట్టిపోతున్న ఊపిరికి పోరాటపటిమనివ్వు

ఇంకా భయపడుతూనే ఉన్నావా...?
అయితే అదిగో ..... అతడి వైపు చూడు
శత్రువుకు నిద్రపట్టనివ్వని ఆ నవ్వును చూడు
రాజ్యదాహం మధ్యన తలెత్తుకున్న తెగువను చూడు

నన్ను బంధించగలవేమో కానీ .... ఆలోచనలను కాదు
నన్ను ఆపగలవేమో కానీ .... విప్లవాన్ని కాదనే వి.విని చూడు
మౌనమనే యుద్ధనేరాన్ని చేయని వీరుడిని చూడు.....

No. of visitors : 320
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నువ్వే నా "హీరో"

విజయ్‌ సాధు | 17.06.2016 10:45:13am

మరి నువ్వెవరివి...? నన్ను ఇంతగా కుదిపేస్తున్న నువ్వెవరివి...? నిరాశా నిస్పృహలు ఆవరించినప్పుడు నాకు ఊపిరిపోస్తున్న నువ్వెవరివి..?.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •