కుట్ర

| సాహిత్యం | క‌విత్వం

కుట్ర

- బండారు ప్రసాదమూర్తి | 06.09.2018 11:57:20pm

ఇప్పుడిక బతకడం కూడా కుట్రే
బతుకంటే ఊపిరి పీల్చడం..ఊహలు రాల్చడం
నడకలు సాగడం..నింగిని తాకడం
బతకడాన్ని బతుకులాగా బతకడమూ కుట్రే అయింది

అంతా కుట్రే
రెప్పల మీద కురిసే కలల చినుకులు..
గుండెలోంచి నిశ్శబ్దంగా బయటకు పొడుచుకొచ్చే పువ్వులు..
గొంతులో గలగలమనే సెలయేళ్ళు..
అన్నీ కుట్రే..అంతా కుట్రే.

ఇప్పుడు పిల్లల్ని ఎలా ఎత్తుకుని తిరగాలి?
వారికి కథలెలా చెప్పాలి?
వారికి పాటలెలా వినిపించాలి?
ఏ చెట్టుకింద వెన్నెల మూట విప్పి
ఏ చరిత్రలు నిర్భయంగా చదవాలి?

కుట్ర ఇప్పుడు దేశభక్తికి పర్యాయపదమైపోయింది కదా
ఉదయం సూర్యుడితో పాటు వాహ్యాళికి ఎలా పోవాలి?
పాదాలకు రోడ్డు వినిపించే ప్రాచీ సంగీతం ఎలా వినాలి?
ఎటు తిరిగితే ఏం తప్పో తెలియదు
ఏది నీడో ఏది కుట్రో పోల్చుకోలేం

కవిత్వం ఇక ఎంతమాత్రం పాట కాదు, యుద్ధమే
కవీ నీ తల మీద వెండిమబ్బుల ఆకాశం చూశాను
నీ కళ్ళ కొసల కదిలే కాంతుల్లో..నీ పెదాల చివర చిందే నవ్వుల్లో
నువ్వు బందూకుల మధ్య బందీగా కదులుతూ చూపిన పిడికిలిలో
మూడు పాతికల నీ నవయవ్వన అరుణోదయాలు చూశాను

అర్బన్ అడవి ఇప్పుడొక సరికొత్త కుట్ర కదా
నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న అడవులు నగరాలకు తప్ప ఎటు నడుస్తాయి?
కవీ ఈ భవనాలూ వాహనాలూ రోడ్లూ మనుషులూ
అన్నీ చెట్లులానే కనిపిస్తున్నాయి
కొమ్మ కొమ్మకీ ఇక్కడ గస్తీ వుంది
కొమ్మ కొమ్మకీ వేలాడే నీ అనల మనచ్ఛాయా గుచ్ఛమూ వుంది
నీ చుట్టూ కుట్ర..కుట్ర చుట్టూ నువ్వు
ఇన్ని కుట్రల మధ్య ఇంక కునుకెలా పడుతుంది?

మేలుకునే వుండాల్సి వచ్చినప్పుడు
మౌనాన్ని బద్దలుకొట్టడమే పెద్ద యుద్ధం
ఇంత బీభత్సంలో మౌనమే అసలు కుట్ర

No. of visitors : 319
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •