అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!

| కార్య‌క్ర‌మాలు

అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!

- విరసం | 07.09.2018 12:00:32am

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం ఫాసిజంవైపు వడివడిగా ప్రయాణం సాగిస్తున్నదనడానికి చాలా ఉదాహరణలున్నాయి. బి.జె.పి అధికారంలో కొచ్చిన ఈ నాలుగేళ్ళ పైగా కాలంలో నిన్నటి పౌరప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులు, సోదాల దగ్గర నుండి కల్బుర్గి, గౌరీలంకేష్‌ల హత్యల వరకు ఎన్నో సంఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. నిన్నటి అరెస్టుల పర్వమంతా చట్టవ్యతిరేకంగా, నియమనిబంధనలు, విధి విధానాలు ఏవీ పాటించకుండా సాగిస్తే, గతంలో జరిగిన హేతువాదులు, ప్రజాస్వామికవాదుల హత్యలు, దళితులు, ముస్లిం మైనారిటీల పై జరిగిన మూక దాడులన్నీ కేంద్రప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ పరంపరను, ఫాసిస్టు ప్రమాదాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు అడ్డుకోవలసిన అవసరముంది.

హైదరాబాద్‌లో వరవరరావు, ఢిల్లీలో గౌతమ్‌నవలఖాలతో పాటు ఐదుగురిని అక్రమ అరెస్టు చేయగా, మరో ఏడుగురు పౌరప్రజాసామ్యహక్కుల కార్యకర్తల ఇళ్ళలో సోదాలు నిర్వహించి భయభ్రాంతులకు గురిచేశారు. అరెస్టు చేసినవారిపై ఐపిసి సెక్షన్లు 153ఎ, 505, 117, 120బి ఉపా సెక్షన్లు 13, 16, 17, 18, 18బి, 20, 38, 39, 40 క్రింద కేసులు నమోదు చేశారు. నిజానికి ఉపా చట్టం అనేది రాజ్యాంగంలోని అధికరణం 19(1) మేరకు లభించిన ప్రాధమిక హక్కులకు తగిన పరిమితులు విధించే ఉద్దేశంతో 1967లో రూపొందించారు. కానీ దీనికి 2004 నుండి అనేక సవరణలు చేసి కఠినతరం చేశారు. గతంలో తీసుకువచ్చి ఉపసంహరించిన టాడా, పోటాల స్థానంలో దీనిని మరింత పదునెక్కించారు. దీనితో న్యాయస్థానంలో విచారణతో సంబధం లేకుండా నిరవధికంగా, అక్రమంగా నిర్బంధించవచ్చు. దర్యాప్తులో క్రూరమైన విధానాలు అనుసరించవచ్చు. అందువల్లనే పౌరప్రజాస్వామిక కార్యకర్తల మీద ఉపా చట్టాన్ని, బ్రిటిషుకాలం నాటి రాజద్రోహ నేరాన్ని మోపుతున్నారు. గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబాను, మొన్న జూన్‌లో సురేంద్రగాడ్లింగ్‌, సోమాసేన్‌, సుధీర్‌ ధావ్లే, రోన విల్సన్‌, మహేష్‌ రావత్‌లను ఇలాగే అరెస్టు చేశారు. సురేంద్రగాడ్లింగ్‌ తదితరులను బీమా కోరేగావ్‌ అల్లర్లను సాకుగా చూపి ఆ కేసుల్లో ఇరికించారు. తప్పుడు ఉత్తరాలు సృష్టించి భీమా కోరేగావ్‌ కార్యక్రమం నిర్వహించిన ఎల్గార్‌ పరిషత్‌కు మావోయిస్టులు నిధులు సమకూర్చారనీ, నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనీ ఆరోపించి, అరెస్టులు చేశారు. పీడితప్రజల హక్కులకోసం పనిచేస్తున్న కార్యకర్తలను అర్బన్‌ నక్సల్స్‌గా ముద్రించి కుట్రకేసులు బనాయించి హింసిస్తున్నారు. కొంతమంది బి.జె.పి నాయకులు ఆర్‌.ఎస్‌.ఎస్‌ మతతత్వ మూకలు, దాని వందిమాగధ మీడియా దీనికి వంతపాడుతున్నారు.

ప్రొ. సాయిబాబా కేసు విచారణను మూడేళ్ళలో ముగించి జీవిత ఖైదు విధించారు, మరోవైపు 2002లో గుజరాత్‌ అల్లర్లలో ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో సెషన్స్‌ కోర్టు మాయా కొదనాని అనే బి.జె.పి శాసనసభ్యురాలికి జీవితఖైదు విధిస్తే హైకోర్టు కొట్టేసింది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో, కృష్ణజింకల వేట కేసులో సుదీర్ఘ విచారణనంతరం నిర్దొషిగా విడుదల చేశారు. అలాగే నటుడు సంజయ్‌దత్‌ను ముంబయి అల్లర్లలో ఉపయోగించిన ఆయుధాన్ని కలిగి ఉన్న కేసులో ఐదు సంవత్సరాలు శిక్ష విధించి సకల సౌకర్యాలతో మూడు సంవత్సరాలకే విడుదల చేశారు. కానీ సాయిబాబాను మాత్రం కనీసమైన వైద్య సౌకర్యాలను కూడా కల్పించకుండా హింసించి చంపే కుట్ర చేస్తున్నారు.

మోడీ అధికారంలో కొచ్చిన తర్వాత దళితులు, ముస్లిం మైనారిటీల పై దాడులు మున్నెన్నడు లేనంతగా పెరిగాయి. మున్నెన్నడూ లేనంతగా దేశంలో అసమానతలు పెరిగాయి. అంతేస్థాయిలో కార్పోరేట్‌ సంస్థల ఆస్తులు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆదివాసులు, రైతులు, దళితుల భూములను లాక్కొని కార్పోరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రక్రియ వేగవంతమయింది. నిరుద్యోగం, నిర్వాసిత్వం విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల ప్రజలలో వ్యతిరేకత కూడా సహజంగానే తీవ్రమైంది. కనుకనే ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రజల హక్కులకోసం నిలబడి పనిచేస్తున్న వారి నోళ్ళు మూయించేందుకు ఈ అరెస్టులు సాగిస్తున్నారు. ఈ అక్రమఅరెస్టులు, సోదాలన్నీ భీమాకోరేగావ్‌ అల్లర్లకు కుట్రపన్ని, అసలు కారకులైన నిందితులు మిళింద్‌ ఎగ్బోటీ, శంభాజీ బిడే తదితరులను రక్షించేందుకు కుట్ర జరుగుతున్నది.

కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ అప్రజాస్వామిక, ఫాసిస్టు చర్యలను వ్యతిరేకించి అడ్డుకోవాలని ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు విప్లవరచయితల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది. అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని, భీమాకోరేగావ్‌ అల్లర్లకు ప్రధాన కారకులైన మిళింద్‌ ఎగ్బోటీ, శంభాజీ బిడేలను అరెస్టు చేయాలని, ఉపా చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తున్నది.

బహిరంగసభ
సెప్టెంబరు 8 శనివారం ఉదయం 10:00 గంటలకు
వేదిక : పౌర గ్రంథాలయం, బివికె కాలేజి ఎదురుగా, ద్వారకా నగర్‌, విశాఖపట్నం.
అధ్యక్షత: ఎం. శ్రీనివాసరావు విరసం
వక్తలు: దుడ్డు ప్రభాకర్‌ కులనిర్మూలనా పోరాటసమితి,
పద్మ, మహిళా చేతన,
టి. శ్రీరామమూర్తి, పౌరహక్కుల సంఘం
అరసవిల్లి కృష్ణ, విరసం

-విప్లవ రచయితల సంఘం, విశాఖ యూనిట్‌.


No. of visitors : 937
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •