ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు

| సంభాషణ

ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు

- ఆనంద్‌ తేల్‌తుంబ్డే | 07.09.2018 12:06:09am


ఆగస్టు 28న గోవాలో ప్రొఫెసర్‌ ఆనంద్‌ తేల్‌తుంబ్డే తన నివాసంలో లేని సమయంలో పోలీసులు ఆయన ఇంటి తాళాలు బలవంతంగా పగలకొట్టించి సోదా నిర్వహించారు. మరుసటి రోజు బొంబాయిలో పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన ఇలా ప్రకటించారు.

ʹʹపట్టణ నక్సలైట్లు అంటే ఇలా వుంటారు. నా జీవితమంతా నేను ఒక కార్యకర్తను. కళాశాల విద్యార్ధిగా వున్న కాలంలో విద్యార్ధి సంఘ నాయకుణ్ణి. నేను ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంలో భాగస్వామిని. మా సంస్థ అయిన ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కమిటి(సి.పి.డి.ఆర్‌)కి చెందిన సోమాసేన్‌, అరుణ్‌ ఫెరీరాలను అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28)న జరిగిన దాడులు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ సమయంలో నేను అధికారిక బాధ్యతలమీద ముంబైలో వున్నాను. లేకపోతే ఇలా ఈ రోజు మీముందు వుండేవాడిని కాదు. అప్పటికప్పుడు అక్కడే నిర్బంధించి వుండేవారు.

మూడు వాహనాలలో వచ్చిన పోలీసులు, నేను పనిచేసే గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ గేట్లు బలవంతంగా తోసుకుని వచ్చి అక్కడి సెక్యూరిటీ గార్డుల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళలో ఒక గార్డును బెదిరించి నేనుండే ఇంటి తలుపులు బలవంతంగా తెరిపించారు. నా పక్క ఇంటిలో నివాసం వుండే ఒక సీనియర్‌ ప్రొఫెసర్‌ ఇదంతా చూసి, మా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అనుమతి తీసుకోమని పోలీసులతో చెప్పారు. మా డైరెక్టర్‌ అప్పటికే కాంపస్‌ చేరుకోవడానికి వస్తున్నారు. అయినా పోలీసులు ఆయనకోసం వేచి చూడలేదు. పైగా ఆ సీనియర్‌ ప్రొఫెసర్‌ను బెదిరించారు.

ఇది కేవలం కొద్దిమంది అరెస్టుకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇలాంటిది ఎవరికైనా ఎదురుకావచ్చును. రాజ్యం టెర్రరిస్టు పాత్ర పోషిస్తూంది. ఎవరిననుకుంటే వాళ్ళను లక్ష్యంగా చేస్తోంది. రాజ్యమే నైతిక నియమాలను వదులుకుంటే ప్రజలు ఏమి చేయగలరు? ఇది 1975 నాటి అత్యవసర పరిస్థితి కంటే దుర్మార్గమయింది. ఆనాటి అత్యవసర పరిస్థితి రాజ్యంగ ప్రకారం విధించబడింది. అది ఎలా తప్పో చర్చించగలం. కాని ఇప్పుడున్న స్థితికి ఎలాంటి న్యాయసమ్మతీ లేదు.

అనువాదం - సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌.





No. of visitors : 353
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •