ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు

| సాహిత్యం | వ్యాసాలు

ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు

- | 07.09.2018 12:13:25am

ఆగస్టు 28న దేశంలోని పలు నగరాలలో మహారాష్ట్ర పోలీసు బృందాలు అనాగరికంగా దాడులు చేసి వరవరరావు, సుధా భరద్వాజ, అరుణ్‌ ఫెరేరా, గౌతమ్‌ నవాల్క, వెర్నాన్‌ గొంజాల్వేస్‌లను అక్రమకేసులో అరెస్టు చేయడాన్ని దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, మేధావులు తీవ్రంగా ఖండించారు.

పార్ట్ -1

అరుంధతీ రాయ్‌

ʹʹప్రజాస్వామ్యాన్ని వదిలించుకుని ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే ఆలోచనలో భాగంగానే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇది అత్యవసర పరిస్థితికంటే మరింత ప్రమాదకరమైనది. ఇప్పుడు రాజ్యం తనంతట తానే మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లిములు, వామపక్షవాదులు, తనతో విభేదించే ఎవరిపైనైనా దాడులుచేస్తూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. ఇందులో రాజ్యానికి ప్రసార మాధ్యమాల్లో దానికనుకూలంగా వుండే శక్తులు, హంతక స్వభావంగల కార్యకర్తలు సహాయం చేస్తున్నారు. ఒక నిశ్చితమైన భావజాలాన్ని అంగీకరించని ప్రతివాళ్ళపైనా క్రిమినల్‌ దాడులు, హత్యలకు మితవాద హంతకులు పాల్పడుతున్నారు.
న్యాయవాదుల్ని, మేధావుల్ని, దళిత కార్యకర్తల్ని అరెస్టు చేస్తూ, ప్రజలపై హత్యాకాండకు పాల్పడుతున్న, విద్వేషాన్ని రెచ్చగొడుతున్న నేరస్థుల్ని అరెస్టు చేయకపోవడం భారత రాజ్యాంగ మౌలికత్వంపై భావజాలపరమైన దాడిచేయటమే. ఒకవైపు అధికార పీఠాల్లో వున్నవారు హంతకుల్ని పూలమాలలతో సత్కరిస్తూ కాపాడుతుంటే, మరోపక్క న్యాయం కోసం, హిందూ మెజారిటీవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్ళని నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి, అది విశ్వసించే స్వేచ్ఛకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నించటమే.ʹʹ

సీతారామ్‌ ఏచూరి (సి.పి.యమ్‌.)

ʹʹఅన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పే ఎవరినైనా పట్టణ ప్రాంతపు మావోయిస్టులుగా ముద్రవేసే మితవాద శక్తుల ధోరణికి కొనసాగింపే ఈ అరెస్టులు. ఎవరైతే నిజంగా దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టి, దళితులకు మద్ధతుగా నిలబడ్డ కార్యకర్తలపైనా, న్యాయవాదులపైనా ఆ శక్తులు దాడులు చేస్తున్నాయి.ʹʹ

డి. రాజా (సి.పి.ఐ.)

ʹʹప్రభుత్వం పట్ల నిరసనను వ్యక్తం చేయడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని అణచివేయాలనే ద్రోహ చింతనకు నిదర్శనమే ఈ అరెస్టులు.ʹʹ

కవితా కిృష్ణన్‌ (భా.క.పా మా-లె)

ʹʹఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి. ఉమర్‌ ఖలీద్‌పై హత్యా ప్రయత్నం జరిగిన వెంటనే ఈ అరెస్టులు జరగడాన్ని గమనించాలి.ʹʹ

రామచంద్ర గుహ (చరిత్రకారుడు, రచయిత)

ʹʹఒకవేళ మహాత్మాగాంధీ బతికే వుంటే, ఆయన న్యాయవాది దుస్తులు ధరించి సుధా భరద్వాజ్‌ను రక్షించడానికి కోర్టులో వాదించి వుండేవారు. మోడీ సర్కారు గాంధీని కూడా అరెస్టు చేయకుండా వుండి వుంటే ఇలా జరిగుండేది.ʹʹ

స్వామి అగ్నివేష్‌, షబ్నమ్‌ హష్మీ, తీస్తా శెతల్‌వాడ్‌, నివేదిత మీనన్‌

ʹʹఅభివృద్ధి ఫలితాలకు ఆమడ దూరంలో వుంచబడ్డ ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయ జరగడం కోసం పోరాడుతున్న వాళ్ళల్లో భయోత్పాతాన్ని కలిగించడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడింది.ʹʹ

నీరా ఛందోక్‌ (ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర పూర్వ ఆచార్యులు)

ʹʹప్రజాస్వామ్యంలో వ్యక్తి పాలితుడుగా వుండే స్థాయినుంచి పౌరుడిగా పరిణామం చెందుతాడు. రాజ్యం అలాంటి పౌరులలో భయోత్పాతాన్ని సృష్టించాలని నిర్ణయించుకుంటే, ప్రజాస్వామికంగా ఆలోచించేవాళ్ళని హత్యచేయాలని నిర్ణయించుకుంటే, హక్కులు కాపాడుకోవాలనుకునే పౌరులు నిస్సహాయలుగా మారిపోతారు. మన కాలంలో రాజ్యం తరవాత మరొక ఆధిపత్య వ్యవస్థ అయిన మార్కెట్‌ పూర్తి అనైతికంగా మారిపోయింది. దానికి మనుషుల క్షోభ గురించి పట్టింపే లేదు.

ప్రపంచంలో ప్రతి రాజకీయ విప్లవం ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కులతోనే ప్రారంభమయ్యాయి. మిగిలిన హక్కులన్నిటికి ఈ రెండు హక్కులే కేంద్రం.

ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం నీతి నియమాల్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. పౌరసమాజం అవసరాన్ని నిర్లక్ష్యం చేసే నాయకులు మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సైద్ధాంతిక వెన్ను దన్నుగా వున్న ఆర్‌.యస్‌.యస్‌. కార్యకర్తలు దేశంలో వ్యక్తికి, మార్కెట్‌కు, రాజ్యానికి మధ్య వున్న జాగాను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు.ʹʹ

ప్రభాత్‌ పట్నాయక్‌ (ఆర్థిక శాస్త్రవేత్త)

ʹʹఅత్యవసర పరిస్థితి కాలంలో కేవలం అరెస్టులు మాత్రమే జరిగాయి. ఇప్పుడు రాజ్యం చేస్తున్న అరెస్టులతో పాటు, మూకలు తమకిష్టంలేని వారిపై భౌతికదాడులు చేయటం కూడా మనం చూస్తున్నాం. కోల్పోతున్న తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఒక శత్రువును సృష్టించుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. ఏ రకమైనా నిరసననైనా, అసమ్మతినైనా జాతి వ్యతిరేకమైనదిగా, టెర్రరిస్టు చర్యగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. పట్టణ టెర్రరిజం ఇప్పుడు కొత్తగా వాడుతున్న పదం. వామపక్షవాదులు, వామపక్ష ఉదారవాదులు, మైనారిటీలు దళితులు, అణచివేయబడ్డ ప్రజలు, మేధావులు, రచయితలు సాంస్కృతిక కార్యకర్తలతో కూడిన ఐక్య సంఘటన సాధ్యమైనంత విస్తృత ప్రాతిపదికన రూపొందాలి.ʹʹ

జస్టిస్‌ పి.బి. సావంత్‌ (సుప్రీమ్‌కోర్టు మాజీ న్యాయమూర్తి)

ʹʹఇప్పుడు అరెస్టు చేయబడినవాళ్ళెవరికీ డిసెంబర్‌ 31, 2017న జరిగిన ఎల్‌గార్‌ పరిషత్‌తో ఎటువంటి సంబంధమూ లేదు. వాళ్ళు దాని నిర్వాహకులు కూడా కారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నేనూ, జస్టిస్‌ కోల్సే పాటిల్‌ బాధ్యులం. ఇప్పుడు నిర్బంధించబడిన వాళ్ళెవరితోనూ మాకు వ్యక్తిగతంగాగాని, ఫోనుద్వారాగాని సంబంధం లేదు.
2015 అక్టోబరు 4న అదే స్థలంలో అలాంటి బహిరంగసభే మరొకటి జరిగింది. అది జరిగిన నాలుగైదు నెలలకి పోలీసులు దళిత కార్యకర్తల సంస్థ అయిన కబీర్‌ కళామంచ్‌ బాధ్యుల్ని నిర్బంధించారు. ఆ సమావేశాన్ని నిర్వహించడంలో వాళ్ళు మాకు సహకరించారు. వాళ్లకు నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో వాళ్ళని అరెస్టు చేశారు. అయితే ఆ తరువాత పోలీసులే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో, తాము ఆ కార్యకర్తల ఇళ్లమీద దాడులు చేశామని, కాని నక్సలైట్లతో వాళ్ళకు సంబంధాలున్నాయని చెప్పటానికి అవసరమైన సాక్ష్యాలేవీ తమకు దొరకలేదని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఊపా చట్టం కింద అరెస్టు చేసిన వ్యక్తులకు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని చెప్పడానికి పోలీసుల వద్ద ఏ ఆధారాలున్నాయో మాకు తెలియదు.
ఊపా చట్టం కింద అరెస్టయితే బెయిలు పొందడం చాలా కష్టం కాబట్టే దాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. నక్సలైట్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నందుకు సురేంద్ర గాడ్లింగ్‌ అనే న్యాయవాదిని ఈ చట్టం కిందే అరెస్టు చేశారు. ఇది చట్ట ఉల్లంఘనకు పరాకాష్ట. ప్రస్తుత పాలకులను విమర్శించే వాళ్ళందరినీ భయోత్పాతానికి గురిచేయాలనే పధకం ప్రకారమే ఈ అరెస్టులు జరిగాయని మేమనుకుంటున్నాం. ఇది రాజ్య టెర్రరిజం తప్ప మరొకటి కాదు. మరో పక్క హిందూత్వ సంస్థలయిన ఆర్‌.యస్‌.యస్‌., భజరంగదళ్‌, సనాతన్‌ సంస్థ వంటి సంఘాలకు వాళ్ళనుకున్నది చేయడానికి పూర్తి స్వేచ్ఛ వుంది.ʹʹ

జస్టిస్‌ కోల్సే పాటిల్‌ (సుప్రీమ్‌కోర్టు మాజీ న్యాయమూర్తి)

ʹʹఆర్‌.యస్‌.యస్‌. నుండి విముక్తి చెందిన భారతదేశం కావాలని మేం అక్టోబర్‌ 4, 2015న డిమాండ్‌ చేశాం. దీనిని పాలకులు సహించలేదు. మాకు గుణపాఠం నేర్పాలని వాళ్ళనుకుంటున్నారు.ʹʹ

ప్రశాంత్‌ భూషణ్‌ (సుప్రీమ్‌కోర్టు న్యాయవాది)

ʹʹఫాసిస్ట్‌ కోరలు నగ్నంగా కాటేయడానికి సిద్ధంగా వున్నాయని ఈ అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి.ʹʹ

No. of visitors : 338
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •