ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు

| సాహిత్యం | వ్యాసాలు

ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు

- | 07.09.2018 12:24:47am

ఆగస్టు 28న దేశంలోని పలు నగరాలలో మహారాష్ట్ర పోలీసు బృందాలు అనాగరికంగా దాడులు చేసి వరవరరావు, సుధా భరద్వాజ, అరుణ్‌ ఫెరేరా, గౌతమ్‌ నవాల్క, వెర్నాన్‌ గొంజాల్వేస్‌లను అక్రమకేసులో అరెస్టు చేయడాన్ని దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, మేధావులు తీవ్రంగా ఖండించారు.

పార్ట్ -2

లోకాయుత, పూణే

ʹʹకేంద్ర ప్రభుత్వ విధానాలపట్ల విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న మేధావుల ఇళ్ళపై దాడులు చేసి వాళ్ళను నిర్బంధించడం మమ్మల్ని ద్రిగ్భమకు గురిచేసింది. 2019 ఎన్నికలలో తమకు అనుకూలంగా వుండేటట్లు ప్రజాసమీకరణ చేసుకోవడానికి భాజపా ఒక కృత్రిమ శత్రువును సృష్టించుకుంది. ఇప్పటికే దానికనుకూలంగా వుండే ప్రసార సాధనాలు మావోయిస్టు కుట్ర అనే తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నాయి. పట్టణ నక్సలైట్లు అనే పదాలని సృష్టిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో స్వామీ అగ్నివేష్‌, ఉమర్‌ ఖలీద్‌లపై జరిగిన దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులను మనం అర్థం చేసుకోవాలి. కర్ణాటకకు చెందిన ఒక బి.జె.పి శాసన సభ్యుడు ʹʹమేధావులనుʹʹ హత్య చేయాలని కూడా ప్రచారం చేస్తున్నాడు. సామాజిక న్యాయం కోసం పనిచేసే వ్యక్తులలో భయోత్పాతాన్ని సృష్టించడంకోసం చేసే ఈ చర్యలను మేం ఖండిస్తున్నాంʹʹ -

నీరజ్‌ జైన్‌.

సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా

ʹʹఅరెస్టు చేసిన మేధావులను, కార్యకర్తలను తక్షణమే బేషరతుగా విడుదలచేయాలని, సంభాజీ భిడేను తక్షణమే అరెస్టు చేయాలని, భీమా కోరెగావ్‌లో హింసను ప్రేరేపించిన వారందరినీ విచారించాలని మేం సోషలిస్టు పార్టీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాంʹʹ -

పన్నాలాల్‌ సురానా, సీనియర్‌ నాయకుడు సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా, డాక్టర్‌ ప్రేమ్‌సింగ్‌, హిందీశాఖ, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

జిగ్నేష్‌ మేవానీ (గుజరాత్‌ ఎమ్‌.ఎల్‌.ఎ)

ʹʹపాలకవర్గాల భావజాలాన్ని వ్యతిరేకించే ప్రతివ్యక్తిని, ప్రజల హక్కులకోసం పోరాడేవాళ్లందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు. దళిత ఉద్యమాన్ని, దళితులు హక్కులను కోరుకోవడాన్ని అప్రతిస్టపాలుచేస్తున్నారు. 2019 ఎన్నికలలో మోడీకి అనుకూలంగా సానుభూతిని సృష్టించడానికే ఆయనపై హత్యకు సంబంధించిన కుట్ర కథనాల్ని అల్లుతున్నారు. రైతుల ఆత్మహత్యలు, జి.యస్‌.టి. వంటి నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదొక ప్రయత్నం.ʹʹ

అరుణారాయ్‌ (మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన)

ʹʹభావవ్యక్తీకరణ స్వేచ్ఛ నానాటికీ కుంచించుకుపోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటిక.ʹʹ

బెజవాడ విల్సన్‌ (సఫాయి కర్మచారి ఆందోళన్‌)

ʹʹఇది మన ప్రాథమిక హక్కులపై దాడి. ఉత్సవాన్ని జరుపుకోవడానికి దళితులు భీమా కోరెగావ్‌లో సమావేశంకావడంలో తప్పేమిటి? మనం ఏది మాట్లాడాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. దేశాన్ని పరిపాలించే పద్ధతి ఇది కాదు.ʹʹ

స్టాన్‌ స్వామి (సామాజిక కార్యకర్త)

ʹʹసమాజంలో తమ గోడు వినిపించే గొంతులేని ప్రజలకు గళాలు అందిస్తున్నవారి నోళ్ళు నొక్కేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీళ్ళందరిమీద పెట్టిన తప్పుడు కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.ʹʹ

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

ʹʹభావప్రకటనా స్వేచ్ఛపె ౖదాడిచేసి ప్రజల్లో భయాన్ని కలిగించడానికే ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడిందని స్పష్టమవుతోంది.ʹʹ

హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌

ʹʹవిమర్శకులూ, కార్యకర్తలపై పోలీసులు పదేపదే టెర్రరిస్టు వ్యతిరేక చట్టాలను ప్రయోగిస్తున్నారు.ʹʹ

ప్రకాష్‌ కరత్‌ (ʹʹపీపుల్స్‌ డెమోక్రసీʹʹ సంపాదకుడు)

ʹʹఇప్పటిదాకా పోలీసులు కొద్దిపాటి సాక్ష్యాన్ని కూడా అందించలేకపోయారు. ఈద్‌గా ప్రదర్శనకు మావోయిస్టులతో సంబంధం వుందనడం పచ్చి అబద్ధం. ఆ రోజున నిజంగా ప్రజలను హింసకు రెచ్చగొట్టిన మిలింద్‌ ఎగ్బోటే, సంభాజీ భిడేలపై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యా తీసుకోలేదు. ప్రజాస్వామికవాదులపై జరిగే దాడులను సవాల్‌ చేయకుండా వదిలిపెట్టకూడదు.ʹʹ

ఇండియన్‌ కల్చరల్‌ ఫోరం

ʹʹఅనేకమంది మానవ హక్కుల కార్యకర్తలను కస్టడీలోకి తీసుకోవడం భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక ప్రమాదకరమైన చర్య. వాళ్ళు చేసిన నేరాలేమిటి? మానవ హక్కుల కోసం పట్టుబట్టడం. రచనలు చేయడం, విశ్లేషించడం, బోధించడం, అన్యాయానికి, అసమానత్వానికి నిరసన గళాలని అందించడం.
ఇది కూడా, గౌరీలంకేష్‌, కల్బుర్కీ, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల హత్యలకు సంబంధించిన విచారణలో నేరపూరిత కుట్రకు సంబంధించిన, ఆయుధ శిక్షణకు సంబంధించిన, ఆయుధాల గుట్టలకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడుతున్న సమయంలో జరిగింది. నిజమైన ఈ కుట్ర నుండి ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి తయారుచేసిన ఈ అబద్ధపు కుట్రను మేం ఖండిస్తున్నాం. అసమ్మతిని అణచివేయడాన్ని ఖండిస్తున్నాం. తోటి పౌరుల హక్కుల కోసం పనిచేస్తున్న వాళ్ళందరితో సంఘీభావం ప్రకటిస్తున్నాం.ʹʹ


1. నయనతార సెహగల్‌
2. ఓల్గా
3. కల్పనాస్వామినాధన్‌
4. రోమిలా థాపర్‌
5. శ్యామ్‌ మీనన్‌
6. లూర్డ్స్‌ యమ్‌. సుప్రియ
7. అరుంధతీ రాయ్‌
8. ఓం తన్వి
9. యోగశ్‌ యస్‌.
10. కె. సచ్చిదానందన్‌
11. ఇ.వి. రామక్రిష్ణన్‌
12. మంజరి ఇందూర్కర్‌
13. గీతా హరిహరన్‌
14. రీటా కొఠారి
15. మాలా దయాళ్‌
16. బెజవాడ విల్సన్‌
17. పుష్పమాల
18. యన్‌ అరుణ్‌ రాజేంద్రన్‌
19.దామోదర్‌ మౌజో
20. సుశీతారు
21. నబీనా దాస్‌
22.అశోక్‌ వాజ్‌పేయీ
23. గీతాంజలిశ్రీ
24. రీనా రోడ్రిక్స్‌
25. శశీ దేశ్‌పాండే
26. రీతూ మీనన్‌
27. ముఖర్జీ
28. గణేశ్‌దేవి
29. అచిన్‌ వనాయక్‌
30. రోహిత్‌
31. కేకీదారువాలా
32. పమేలా పిలిపోజ్‌
33. నందినీ ధర్‌
34. టి.యమ్‌.క్రిష్ణ
35. మధుశ్రీదత్తా
36. దుర్గాప్రసాద్‌ పాండా
37. మల్లికా సారాభాయ్‌
38. ప్రబీర్‌ పుర్‌కాయస్తా
39. శిఖా సక్లాని మాలవ్యా
40. కిరణ్‌ నగార్క్‌ర్‌
41. రామ్‌రహమాన్‌
42. సుప్రియా కౌల్‌ధలీవల్‌
43. అదిల్‌ జుసావాలా
44. రూబిన్‌ డి కృజ్‌
45. సుజాతా మత్తయా
46. కె.పి. రామనున్ని
47. గౌహార్‌ రాజా
48. శివకామి వెలియాంగ్రీ
49. పాల్‌ జకరియా
50. విజయ్‌ప్రసాద్‌
51. సుమన్‌రాయ్‌
52. వివాన్‌ సుందరం
53. అననయ్య వాజ్‌పేయీ
54. ఉల్తారన్‌ దాస్‌గుప్తా
55. అనూరాధా కపూర్‌
56. శ్రీదల స్వామి
57. సుజిత్‌ ప్రసాద్‌
58. యన్‌.యస్‌. మాధవన్‌
59. కె. శ్రీలత మైఖేల్‌ క్రైటన్‌
60. శాంతాగోఖలే
61. విద్యారావు
62. ఆదిత్య మణి ఝా హర్షమందర్‌
68. కె. శ్రీకుమార్‌
69. శాలిమ్‌ యమ్‌.హుస్సేన్‌
70. అపూర్వానంద్‌
71. కల్పనా కన్నాభిరన్‌
72. శేఖర్‌పథక్‌
73. మంగళేష్‌ దబ్రాయ్‌
74. సుస్మిత్‌ పాండా
75. మడివాలెప్ప ఒక్కుంద్‌
76. మేఘా పన్సారే
77. సౌరదీప్‌రాయ్‌
78. బద్రీ రైనా
79. రాజేష్‌ జోషి
80. స్నేహా చౌదరి
81. చందన్‌గౌడ
82. కల్పనా కరుణాకరన్‌
83. రహ్మత్‌ తరికెరే

ఇష్రాత్‌ సయ్యద్‌ కర్నాటకకు చెందిన ʹʹదక్షిణాయనʹʹ రచయితలు, కళాకారులు, కార్యకర్తలు.

No. of visitors : 369
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •