కులమా అగ్ర కులమా

| సాహిత్యం | క‌విత్వం

కులమా అగ్ర కులమా

- ఉప్పెన | 22.09.2018 12:24:58pm

కులమా అగ్ర కులమా అంతటి ఆహంకారమా
కులమా ఉగ్ర కులమా ప్రేమించుటె నేరమా
అంటరాని మంటల్లొ నిన్ను కాల్చి బూడిద చేస్తం
మనువాధా మూకలకు మరణ శాసనం రాస్తం

మమ్ముల తాకిన గాలిని పీల్చుతున్నవెందుకు
మేము తాకినా నీటిని తాగుతున్న వెందుకూ
మేము బతికె భూమి మీదె బతుకుతున్నవెందుకు
మేము పండించె తిండినె తింటున్నావెందుకూ

నాడు వేదాలు వింటె చెవ్వుల్లొ సీసం పోసినారు
మంత్రాలు చదివితే మా నాలుకలను కోసినారు
నేడు గడియారం పెట్టుకుంటె చేతులు నరుకుతున్న
తలపాగను చుట్టుకుంటే మాడు తోలు ఒలుస్తున్న

ప్రేమించితె నేరమా ద్వేశించితె నేరమా
ప్రశ్నించితె నేరమా ఎరించితె నేరమా
బెదరకుంటె నేరమా అదరకుంటె నేరమా
వంగకుంటె నేరమా లొంగకుంటె నేరమా

పరువు ప్రతిష్టల పేర సుపారిలు అందించి
డబ్బుల కట్టలను కిరాయి కత్తులుగా మార్చి
అగ్రవర్న అధికారం అధికారుల అండతోని
కుల పొగరు హత్యలకు పూనుకుంటున్నావూ

అవయవాల నుండి మనుషులెట్ల పుట్టుతారు
అమ్మ కడుపున పుట్టిన మేము అంటరాని వారమ
పుక్కిటి పురాణాల పుకిలించి ఉమ్ముకుంటు
మనువు చెప్పిన మాటలె మమ్ములను వినమంటవ

ప్రేమించుతె చంపుతవా పెండ్లాడితె చంపుతవా
పరువు హత్యలంటు పేరు నీవు పెట్టుతవా
చెల్లవులే చెల్ల వింక అగ్ర కుల కుట్రలింక
సాగవులే సాగవింక ఉగ్ర వర్న హత్యలింక





No. of visitors : 336
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •