వారసత్వం

| సాహిత్యం | క‌విత్వం

వారసత్వం

- శేషు కొర్లపాటి | 22.09.2018 12:41:21pm

వాడు
వారసత్వం తీసుకున్నాడు

అందరి లాగా
అమ్మ నుండి సహనాన్నో
నాన్న నుండి ఆస్తినో కాదు

తాత కట్టించిన లోగిలి పెంకుటిల్లునో
నానమ్మ చేతి బంగారు మురుగునో కాదు

కులానికి పుట్టిన తోకనో
మతం మత్తునో కాదు

వాల్మీకి రామాయణాన్నో
ఠాగూర్ గీతాంజలినో కాదు

వ్యాసుడు రాసిన భారతాన్నో
వాస్త్యయునుడు కామశాస్త్రానన్నో కాదు
వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న వ్యర్ధాలనో కానే కాదు

వాడు ఆ తరం మనిషి కాదు
ఆలోచన లేని మనుషుల ఆఖరి ప్రతినిధి కాదు
వాడు ఈ తరం మనిషి
ఆ తరం భావాల్ని బద్దలు కొడుతున్న ఈ తరం మనిషి

వాడి వారసత్వం
మృతవీరుల కలలచివర స్వేచ్చా స్వప్నం
అమరుల చిందించిన రక్తప్రవాహం

మార్క్స్ క్యాపిటల్ ని
అంబెడ్కర్ కాస్ట్ లెస్ డ్రీమ్ ని

పెరియార్ ఎత్తిన నల్ల జండాని
సావిత్రి భాయి పట్టిన పుస్తకాన్ని

తెలంగాణా సాయుధ రైతాంగ స్ఫూర్తిని
శ్రీకాకుళం మట్టి వాసనని

ఆకలి చావులు పొరటాలని
అంటరానివసంతాలని

శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని
శివ సాగర విప్పపూలని

రక్తంలో తడిసిన మిత్రుడి డైరీని
ఎగురుతున్న ఎర్రని జండాని
వారసత్వంగా తీసుకున్నాడు





No. of visitors : 474
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కాలంతో న‌డుస్తున్న‌ కవిత్వం

శేషు కొర్ల‌పాటి | 16.09.2019 06:01:14pm

మనిషి పావురమై ఎంత ఎగరాలనుకున్న తన మెడకి ఎప్పుడూ ఓ తాడు కులం రూపంలో వెళ్ళాడుతూనే ఉంటుందని, సమాజం విధించిన‌ కట్టుబాట్లు దాటినప్పుడు అది ఉరితాడవుతుందని......
...ఇంకా చదవండి

వేటగాడి వల

శేషు కొర్లపాటి | 04.08.2019 12:08:27am

మిత్రమా ఒక్కరొక్కరిగా ఒరిగిపోదామా ఒక్కటై పోరాడదామా కొత్త వ్యూహం వెతుకుదామా వాడి వేటలో అమరులవుదామా!!...
...ఇంకా చదవండి

మనుషుల మాయమవుతారు

శేషు కొర్లపాటి | 16.04.2019 09:55:33am

గంటలు గడుస్తాయి రోజులు మారతాయి మనిషి మాయమైన గుర్తులు చెరిగిపోతాయి...
...ఇంకా చదవండి

పదునెక్కుతున్న కోరలు

శేషు కొర్లపాటి | 04.08.2019 12:00:46am

అన్యాయమన్న గొంతుకు టెర్రరిస్ట్ అనే బోర్డు వేల్లాడదియ్యడమే. బోర్డులు సిద్దమయ్యాయి మెడలు వొంచడం ఇక మిగిలింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •