మానవ హక్కుల కార్యకర్తలందరిని తక్షణం విడుదల చేయాలి

| సాహిత్యం | వ్యాసాలు

మానవ హక్కుల కార్యకర్తలందరిని తక్షణం విడుదల చేయాలి

- యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు | 22.09.2018 07:58:46pm

కార్యకర్తలను విడుదలచేసేంతవరకు భారతదేశంతో చేసుకున్న ఒప్పందాలన్నింటిని సస్పెండ్‌ చేయండి
యూరోపియన్‌ కమిషన్‌ను కోరిన యూరోపియన్‌ పార్లమెంటు సభ్యులు
15-9-2018
(తొమ్మిదిమంది యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు భారతదేశవ్యాప్తంగా ప్రజాస్వామిక కార్యకర్తలపై దాడులను, విచిక్షణారహిత అరెస్టులను విమర్శిస్తూ యూరోపియన్‌ యూనియన్‌లోని విదేశాంగ వ్యవహారాలు, రక్షణ విధానాల విభాగానికి ప్రతినిధి అయిన ఫెడరికా మొఘేరినీకి ఒక లేఖ పంపారు.)

ఆ లేఖ పూర్తిపాఠం :

భారతదేశవ్యాప్తంగా ఆగస్టు28, 2018న మానవహక్కుల కార్యకర్తల ఇళ్ళపై దాడులను, వారి విచక్షిణారహిత అరెస్టులను యూరోపియన్‌ పార్లమెంటు సభ్యులమైన మేము ఖండిస్తున్నాం.

ఆనంద్‌ తేల్‌తుంబ్డే, స్టాన్‌స్వామి, క్రాంతి టేకుల, ప్రొఫెసర్‌ కె. సత్యనారాయణల ఇళ్ళపై కూడా దాడులు జరిగాయి. అంతేగాక అరుణ్‌ ఫెరేరా, సుధా భరద్వాజ్, వరవరరావు, గౌతమ్‌ నవలఖా, వెర్నాన్‌ గొంజాల్వెజ్ ల ఇళ్ళపై కూడా దాడులు జరిగాయి. ఈ ఐదుగురు అత్యంత పాశవికమైన ఊపా చట్టం కింద ప్రస్తుతం నిర్బంధంలో వున్నారు.

ఇది వలసవాద పాలకుల నుండి అరువుతెచ్చుకున్న చేయబడిన అత్యంత అనాగరికమైన చట్టం. రాజ్యానికి వ్యతిరేకంగా ఒక నేరం చేస్తాడన్న అనుమానంతోనే ఏ పౌరుడినైనా కాల పరిమితి లేకుండా నిర్బంధించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

కొద్ది నెలల క్రితం జరిగిన సుధీర్‌ ధావ్లె, సురేంద్ర గాడ్లింగ్‌, ప్రొఫెసర్‌ షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా విల్సన్‌ల విచక్షిణారహిత అరెస్టులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు సాగాయి. న్యాయవాదులు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలయిన ఈ ఐదుగురిని ఈ సంవత్సరం ప్రారంభంలో భీమా కోరెగావ్‌లో హింసాత్మక చర్యలకు కారణమయ్యారన్న అబద్ధపు ఆరోపణలమీద అరెస్టు చేశారు.

భారతదేశంలో ప్రజాస్వామిక వాణిని, ఆశయాలను అణగదొక్కడానికి నిరంతరం భారతప్రభుత్వం చేస్తున్న అణచివేత చర్యల కొనసాగింపుగానే ఈ దాడులు, అరెస్టులు జరిగాయి. ఇప్పటికే కూలిపోతూవున్న భారత ప్రజాస్వామ్యంపై ఈ దాడులు తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి.

వాళ్ళ నిర్బంధం కొన్ని ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వాళ్ళ కార్యాచరణ కారణంగానే వాళ్ళను లక్ష్యంగా ఎంచుకున్నారా? తమకుండే భావప్రకటనా స్వేచ్ఛను చట్టబద్ధంగా ఉపయోగించుకున్నందుకు ఎవరిని నిర్బంధించినా వాళ్ళని తక్షణమే షరతులు లేకుండా విడుదల చేయాలి. ప్రస్తుత యూరోపియన్‌ పార్లమెంటులో రెండు భాధాకరమైన సంఘటనలను గురించి యూరోపియన్‌ కమీషన్‌ను ప్రశ్నలను అడగడం జరిగింది. అందులో ఒకటి, భారతదేశంలో అధ్యాపకుడైన జి.యన్‌. సాయిబాబా పరిస్థితి గురించి. ఆయన 90శాతం శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నవాడు. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన శరీరం నుంచి గాల్‌బ్లేడర్‌ను తొలగించాలని డాక్టర్లు సిఫారసు చేసారు.

ఆయనకు విధించబడిన యావజ్జీవ శిక్ష వాస్తవానికి ఆయన పాలిట మరణశిక్షే. ఆయన చేసిన నేరమల్లా ఆదివాసీలు, దళితుల హక్కులను కాపాడడం, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను వ్యతిరేకించడం. ఆరోగ్య కారణాలరీత్యా భారతప్రభుత్వం ఆయనను విడుదల చేయాలని, ఆయనకు తగిన చికిత్సను అందించాలని, పునరావాసాన్ని కల్పించాలని జూన్‌ 26న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు భారతప్రభుత్వాన్ని కోరారు. ʹʹఅంగవైకల్యంగల వ్యక్తులను జైళ్ళలో పెట్టినపుడు వాళ్ళకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కల్పించకపోవడం అంటే అది వాళ్ళ పట్ల వివక్షతను చూపడమేకాక, చిత్రహింసలు పెట్టటంతో సమానం. ఇలాంటి వ్యక్తులను ఏకాంతవాస శిక్షకింద నిర్బంధించడంవల్ల వాళ్ళ స్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి దానిని నిషేధించాలి.ʹʹ

యూరోపియన్‌ కమిషన్‌ తరఫున మీరిచ్చిన సమాధానం ఇలా వుంది.

ʹʹనక్సలైట్‌ మిలిటెంట్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలమీద ప్రొఫెసర్‌ సాయిబాబా అరెస్టు, ప్రొఫెసర్‌ సాయిబాబాకు అనుకూలంగా వ్యాసం రాసినందుకు కోర్టు ధిక్కారం నేరంకింద శ్రీమతి అరుంథతీ రాయ్‌ అరెస్టులతో సహా భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షకుల అరెస్టులకు సంబంధించిన ఘటనలను యూరోపియన్‌ యూనియన్‌ దగ్గరగా పరిశీలిస్తోంది.

న్యూఢిల్లీలోని యూరోపియన్‌ కమిషన్‌ ప్రతినిధి వర్గం జాతీయ మానవహక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది. భావవ్యక్తీకరణ, న్యాయమైన విచారణ, మానవహక్కుల కార్యకర్తల హక్కులు వంటి అంశాలకు యూరోపియన్‌ కమిషన్‌ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. మానవహక్కుల గురించి యూరోపియన్‌ కమిషన్‌కు భారతదేశానికి మధ్య జరిగిన సంభాషణలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. 2017 మార్చిలో మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాకు శిక్షవేసిన కేసును యూరోపియన్‌ కమిషన్‌ సమీక్షిస్తోంది. ఆయన నాగ్‌పూర్‌ హైకోర్టులో అప్పీల్‌ వేసుకున్నారు కాబట్టి ఆ కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో వుంది. దాని గురించి మేం భారత అధికారులతో మానవతావాద దృక్పథంతో మాట్లాడుతున్నాం.ʹʹ

మానవులను ప్రథమశ్రేణి, ద్వితియశ్రేణి వ్యక్తులుగా పరిగణించడాన్ని సమర్థించే ప్రభుత్వంతో, ఆదివాసీలను, దళితులను, మతమైనారిటీలను విచక్షణారహితంగా హత్యచేసే ప్రభుత్వంతో, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధించే ప్రభుత్వంతో యూరోపియన్‌ కమిషన్‌ ఎలా సంబంధాలను కలిగి వుంటుంది? ఎలా ఒడంబడికలు చేసుకుంటుంది? హక్కుల కార్యకర్తలను విడుదల చేసేంతవరకు, ఆదివాసీలు, దళితులు, మతమైనారిటీలు, కాశ్మీర్‌, మణిపూర్‌ ప్రజలను వేటాడడం మానివేసేంతవరకు భారతప్రభుత్వంతో చేసుకున్న అన్ని ఒడంబడికలను రద్దుచేసుకోవాలని మేం కోరుతున్నాం.

ప్రొఫెసర్‌ జి.యన్‌.సాయిబాబా, సుసాన్‌ అబ్రహం, వరవరరావు, ఫాదర్‌ స్టాన్‌స్వామి, ఆనంద్‌ తేల్‌ తుంబ్డే, గౌతమ్‌ నవాల్కా, వెర్నాన్‌ గొంజాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరా, సుధా భరద్వాజ, సురేంద్ర గాడ్లీంగ్‌, షోమాసేన్‌, సుధీర్‌ ధవాలే, రోనా విల్సన్‌, మహేష్‌ రౌత్‌లతో పాటు మానవ హక్కుల కార్యకర్తలందరిని తక్షణం విడుదల చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం.

1. మరియా లిడియా సెన్రా (Maria Lidia Senra, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

2. ఏంజెలా వలినా (Angela Vallina, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

3. పలోమా లోపెజ్‌ (Paloma Lopez, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

4. జూలీ వార్డ్‌ (Julie Ward, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

5. మెర్జా కిల్లోనెన్‌ (Merja Killonen, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

6. అనా గోమ్స్‌ (Ana Gomes, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

7. క్లారా అగులేరా (Clara Aguilera, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

8. సిప్రియాన్‌ టనాస్క్యూ (Ciprian Tanasescu, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

9. క్లాడ్‌ మొరేజ్‌ (Claude Moraes, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు)

అనువాదం: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్


No. of visitors : 394
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •