ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

| సంభాషణ

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

- వరవరరావు | 01.06.2016 12:30:00pm

మే , 20 తేదీ సాయంత్రం బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు నేను , నా పెద్ద కూతురు సహజ , ఆమె కూతుర్లు నయన, ఉదయ , మా కుటుంబ మిత్రుల దగ్గరికి బయల్దేరాం. ప్రయాణానికి సిద్దమవుతుండగానే ఉరుముల మెరుపులతో వాన కొడుతున్న గాలితో కరెంట్ పోయింది , మా ఫ్లాటు వెనుక బాల్కానీ రెకులు విరిగి పోయాయి , తత్కాల్ రిజర్వేషన్ డబ్బులు వాససు రావు కదా , క్యాబ్ తెప్పించుకొని బయల్దేరాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకు నేను మలక్‌పేట, నల్లగొండ చౌరస్తా పురానా షహర్ ముస్లీం టెర్రరిస్టు స్నేహితులను; కమలానగర్, శంకర్‌నగర్ మురికివాడ పని మనుషుల సహవాసాన్ని వదిలి గాంధీ నగర్‌లోని జవహర్‌నగర్ ఆరవ వీధికి మారాను . ఇదివరలో ఇది సిటిజన్ పత్రిక ఆవరణ స్థలం. కరెంటు ఆఫీసు సందు అనేవాళ్లు. ఆంధ్రా కేఫ్ రోడ్ అని కూడా అనే వాళ్లు. బహుశా ఒకప్పుడిది చిక్కడపల్లిలో ముస్లీం జాగీర్ధార్ స్థలం . ఇప్పుడు సిద్ధం శెట్టి స్థలం. కానీ బిల్డర్స్ వేరు. సిద్ధంశెట్టి హిమాసాయి అపార్ట్‌మేంట్స్ . చైనా బజార్ - ఎఎంపీఎం కేఫ్ మధ్య వీధి. ఈ వీధి ఆర్‌టీసీ క్రాస్‌రోడ్ ను ఇందిరాపార్కును కలిపే రోడ్డు మీద రెండో చౌరస్తాలో ఉంటుంది .భౌగోళిక రూపం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం వలే అక్కడ ఒక పోల్చుకోలేని జయశంకర్ బస్ట్ ఉంటుంది . కనుక అది కొండ గుర్తు అనడానికి లేదు . ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నది - హెరిటేజ్ మాల్ - మా అపార్ట్‌మెంట్‌లోనే ఉంటుంది అన్న‌మాట‌. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా ఉన్నవాళ్లకు ఆంద్రా కేఫ్ రోడ్ అని చెప్పడం ఇష్టం ఉండదు . రెండేళ్లు కావస్తున్నది కదా. హెరిటెజేట్ మాల్ అని చెప్పడానికి హైదరాబాదు హెరిటెజ్ గురించి గొప్పలు పోయిన వాళ్లకు ఇప్పుడేమి అభ్యంతరంగా లేదు. నామోషీగా కూడా లేదు. ఇక్కడ ఎక్కువగా ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు . ఒక్క ముస్లీంగానీ, దళితుడు కానీ ఉండరు. అంతర్జాతీయ యోగా దివస్, గణేస్ చతుర్థి ఉత్సవాలు, రాఖీ బంధ‌న్, హనుమాన్ జయంతి (ఆరోజు హనుమాన్ ఛాలీసా కుడా చదువుతారు ) వంటి హిందువుల పండుగలు అట్టహసంతో, శ్రద్ధాశక్తులతో చేస్తారు. లోపల ఒక ఫ్లాట్ దగ్గర గుండెల్లో నిలుపుకున్నట్లుగా ఓం జెండా కూడా ఎగురుతుంది , భద్రలోకానికి భద్రమైన స్థలం. తెలంగాణ ప్రభుత్వం నిఘా, గ్రేహౌండ్స్ ఫోర్సెస్, ఎఒబి నుంచి గిరిజనులకు తెచ్చి మా అపార్ట్‌మెంట్ ముందు నాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించడానికి కూడా అనువైన స్థలం.

ఈ శాఖా చంక్రమణమంతా ఎందుకంటే చెట్ల కొమ్మలు చాలా విరిగిపడిపోయిన సాయంత్రం గనుక. ఎడమకు తిరిగి ఆర్‌టీసి క్రాస్‌రోడ్ నుండి కుడివైపు తిరిగేవరకు ట్రాఫిక్ జామ్. (నేనిది వరకు చార్మినార్ చౌరస్తా అనేవాణ్ని. చార్‌మినార్ మీంచి నలుగురు అవివాహిత అక్కచెల్లెళ్లు దూకి హత్మహత్య చేసుకున్న తర్వాత ఆ మాట అనడానికెందుకో గొంతుకేదో అడ్డంపడుతుంది. అయినా చార్‌మినార్ ఫ్యాక్టరీ ఏది? చార్‌మినార్ సిగరెట్టు ఏది? గోల్కోండ సిగరెట్టు కూడా పోయింది. కాళోజి రామేశ్వరరావు గారి ఖాయిష్. కాని ఆ చౌరస్తా మిగిలింది చర్చ్ కొండా గుర్తుగా).

ముందర నారాయణ గూడ వంతెన దగ్గర కరెంట్ తీగెలను తెంచుతూ చెట్లు కూలి పడ్డాయట. మళ్లీ చిక్కుడపల్లి ఎడమ సందుల్లో దూరి విరిగిపడిన కొమ్మలు మధ్య నుంచి బాగ్‌లింగంపల్లి దగ్గర చేరాం. బాగ్‌లింగంపల్లి పార్కు దగ్గర బస్‌స్టాప్ పక్కన రోడ్డుకడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి. మళ్లీ ట్రాఫీక్ జామ్. కాసేపటికి ఎర్రదీపం అలాగే ఉండి పోతుందనిపించింది. హమ్మయ్య కదిలాం. కాచీగాడాస్టేషన్‌కు వెళ్లాలి. ఆరు గంటల‌కు బయలు దేరాం. ఏడు అయిదుకు ట్రెయిన్ బర్కత్‌పురా చమన్- మళ్లీ ట్రాఫీక్ జామ్. కొంచెం కదిలాం. అక్కడ స్వచ్ఛంద వాలంటీర్లు కాచీగూడా వైపు చెట్లన్నీ కూలిపోయాయని చమన్ దాటగానే వాహనాలను ఎడమకు మళ్లించారు. 1964-66లో మా ఉమన్న , ఉపేందర్ ఉన్న ఇంటి పునాదుల్లో కట్టిన అపార్ట్‌మెంట్ల ముందు నుంచి ఎట్టకేలకు కాచీగూడా స్టేషన్‌కు చేరుకున్నాం. ముందటి సీట్లో కూర్చున్న నేను క్యాబినెట్‌లో గడియారం ముళ్ల కదలికలల్లో నాగుండె చప్పుళ్లు లెక్కించుకుంటున్నాను . ఏడ‌య్యింది. బ్యాగులు తీసుకోని దిగి పరుగెత్తి, నాలుగో ఫ్లాట్‌పామ్ కోసం లోపల రైలు వంతెన మెట్లెక్కి దిగి, పరుగెత్తే వరకు కాళ్ల పిక్కలు పట్టుకున్నాయి . గొంతు తడారిపోయి మా ఎడబోత మాకు వినోస్తున్న‌ది. ఏడు అయిదు దాటి పోయింది. ట్రెయిన్ కొంచెం ఆలస్యంగానే బయలు దేరింది . హమ్మయ్య అనుకున్నాం . ఈ చెట్లు కూలుతున్న దృశ్యం నుంచి విచిత్రమైన ప్రమాద మలుపుల్లో మమ్ములను తీసుకుపోయిన డ్రైవర్ పాతబస్తీ ముస్లీం యువకుడు . సాహసంతో నైపుణ్యంతో కూడిన డ్రైవింగు. నీటుగా ఉన్నాడు. అత్తరు వాసన గుబాళిస్తున్నది. సన్నని చరకత్తుల వంటి మీసకట్టు . తెల్లని కుర్తాప్యాంటు. ట్రిమ్‌గా ఐఎస్ వలె ఉన్నాడు. మాటలు కలిపాను.

ఎవరికి తెలుసు - అతడు దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి, మక్కా మసీదుబాంబు పేలుళ్లలో ఉన్నదీ లేనిది .. ఎన్‌ఎస్‌ఎ వాళ్లు చెప్పాల్సిందే.

21 సాయంత్రం బెంగ‌ళూరు న‌గ‌ర బావి ఆవ‌ల నేష‌న‌ల్ లా స్కూల్ నుంచి మ‌ళ్లీ క్యాబ్‌లో మెజిస్టిక్‌కు బెంగ‌ళూరు సిటీ స్టేష‌న్‌కు బ‌య‌ల్దేరాం. ఎనిమిది గంట‌ల‌కు రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌. ఏడు గంటలకు బయల్దేరాం . శనివారం కనుక‌ విపరీతంగా ట్రాఫిక్ ఉంది . ప్రతిచోట సిగ్నల్స్‌ పడుతున్నాయి . క్యాబ్ డైవర్ అంటూనే ఉన్నాడు . ఆరున్న‌రకే బయల్దేరాల్సిందని . ఎన్ని షార్ట్ కట్స్ తీసుకొని , ఎన్నిసిగ్నల్స్‌ తప్పించాడో చెప్పలేం. అందరికీ అదే తోందర కదా. చాలా మంది ఈ తోవలే ఎంచుకుంటారు. ఇంక దూరాన‌ కెఆర్‌ఎల్ బెంగళూరు రైల్వేస్టేషన్ శోభాయమానంగా కనిపిస్తున్నది. అన్ని తోవలూ కలసి స్టేషన్‌కు తీసుకువేళ్లే రాజమార్గం మీదికొచ్చాం. మెట్రోకోసం చెట్లు కూల్చి, తవ్వకాలు తవ్వి డైవర్షన్ పెట్టిన చోట - ఇంకా హెవీ ట్రాఫీక్ జామ్. బండి ఎద్దును కదిలిస్తూ బండివాడు బండిని తోసినట్లు యూటర్న్ దాకా ఎట్లాగో ముందుకు పోనిచ్చి ఎనమిది నంబ‌ర్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదకు పోవడానికి వెళ్లే రోడ్డెక్కించగలిగాడు . ఎనిమిదయింది. నాకు కనిపిస్తూనే ఉన్నది . మా ఉదయ స్మార్ట్‌పోన్‌లో రాజధాని రైట్‌టైమ్ అని చూపుతుంది. మొదటి సారి డ్రైవర్ నుదుటి మీద అరచెయ్యి పెట్టి ..ప్చ్.. అన్నాడు. అయినా పట్టుదల వీడలేదు. వచ్చేశాం ఫ్లాట్‌పాం మీదికి. ఈలోగానే ఆయన తన స్మార్ట్‌ఫోన్‌లో ఎంత‌వుతుందో లెక్కేసి నలభై రూపాయలు తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. డ్రైవర్‌సీట్లో నుంచే ఆటోమేటిక్ ఏర్పాటుతో వెనక డిక్కి తెరిచాడు. 161 రూ. రెండు వంద‌లిస్తే నలభై తిరిగి ఇస్తూ వెనక నుంచి మూడు బ్యాగులను చేతికిచ్చి ఫ్లాట్‌ఫామ్ మీదకుతోసినంతపని చేశాడు .

మేం ట్రైయిన్‌నెక్కగలిగి కుదుట పడినాక ఫోన్. ట్రైయిన్ ఎక్కగలిగారా ? అని ఆ క్యాబ్‌ డ్రైవర్.

ఆయన క్రైస్తవుడు. రేపు ఆదివారం బెంగళూరులో కూల్చివేయబ‌డిన‌ అనేక చర్చల్లో రేపు ఏచ‌ర్చిలో హిందూ జాతి వినాశనం కోసం ప్రెయిర్‌ చేస్తాడో తెలియదు .

రాజధాని ఎనిమిది మీద లేదు. ఏడు మీద ఉంది. ట్రైయిన్ కనిపిస్తూ ఉన్నది. కానీ మధ్యలో రైలుపట్టాలున్నాయి. అడ్డంగా ఇనుప ట్యాబ్‌ల ఫెన్సింగ్ డివైడ‌ర్ ఉన్న‌ది. పైగా ఇటువైపు ట్రెయిన్‌ డోర్లు అన్నీ లాక్ చేసినట్లున్నారు. చుట్టూ తిరిగి ఫ్లాట్‌ఫామ్ మీదికి పోవాల్సిందే. అప్పటికే ఎనిమిది దాటింది. పరుగులంకించుకున్నాం. పోర్టర్లు రాజధాని టీసీలతో, రైల్వే సిబ్బందితో అరచి చెప్తున్నారు కాసేపు ఆపండి అని- కన్నడంలో, మమ్ములను అండర్ గ్రౌండ్ నుంచి పరుగెత్తి యూటర్న్ తీసుకొమ్మంటూ ఒక కూలీ - మా ముగ్గురి చేతుల్లోంచి బ్యాగులు లాక్కొని వంద రూపాయలివ్వండి అని మా జవాబు కోసం కూడా చూడలేదు. మా ఉదయ ఆయన వెంట పరుగెత్తింది. మా న‌యన నన్ను కనిపెడుతూ, నన్ను పరుగెత్త వద్దంటూ పరుగెత్తింది. ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చిన నేను, సహజ కనిపించిన‌ కంపార్ట్‌మెంటులోకి దూరబోతుంటేనే ట్రెయిన్ కదిలింది. టికట్ కలెక్టర్లు లోపలికి లాక్కున్నారు. ఆ కూలీ మా ఉదయ, నయనలను మా రిజర్వేషనున్న కంపార్ట్‌మెంట్‌లోకి తోసేసాడు. బ్యాగులు ముందే లోపలికి విసిరేసాడు. ట్రెయిన్ వేగం పుంజుకుంటున్నది. అతనడిగిన వంద రూపాయలు కూడా ఇవ్వలేక పోయాం. మేం రాజధానిలో కుదుటపడి ఎగపోత తగ్గి అటు చూస్తే.. ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి, ఆర్‌ఎస్‌ఏ కూడా అయిన రోహిత్ వేముల! జాతీయాదాయంలో కనీసం వంద రూపాయలు, ప్రజల పన్ను వలన ప్రభుత్వ ఆదాయంలో చేరిన వంద రూపాయలు - నా పెన్షన్‌లోని వంద రూపాయలు దేశద్రోహికి ఎగ్గొట్ట‌గ‌లిగినందుకు గుండెలు దేశభక్తితో ఉప్పొంగినవి. అయితే మమ్ములను, మా బ్యాగులను ముట్టుకున్న మైలను, హైదరాబాదు యూనివర్సిటీలో బ్రాహ్మణ ప్రొఫెసర్ బావిలోని జలాలతో కడుక్కుంటే తప్ప పూర్తి నిష్కృతి లభించదు!

No. of visitors : 2024
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి

ప్ర‌శ్నించాల్సింది రాజ్యాన్ని : వ‌ర‌వ‌ర‌రావు

వ‌ర‌వ‌ర‌రావు | 17.08.2016 12:26:16am

2016 జ‌న‌వ‌రి 9, 10 తేదీల‌లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల ముగింపు సంద‌ర్భంగా బ‌హిరంగ‌స‌భ‌లో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •