సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌

| సంభాషణ

సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌

- కె.యస్‌.వి. కృష్ణన్‌ | 22.09.2018 08:15:04pm

కొన్ని సంవత్సరాల క్రితం నా కుమార్తె పారిజాత భరద్వాజ్ పూణేలోని సింబయాసిస్‌ లా స్కూలులో న్యాయశాస్త్రం చదువును ముగించింది. అన్నింట్లో మొదటిస్థానాలలో వుండే నా కూతుర్ని చూసి మేం గర్వపడేవాళ్ళం. ఆమె న్యాయశాస్త్రంలో ఆదివాసి సంక్షేమాన్ని ప్రత్యేక అంశంగా ఎంచుకున్నది. ఇలాంటి స్థితిలో వున్న తమ పిల్లలు కార్పొరేట్‌ న్యాయవ్యవస్థలో భాగమై డబ్బు సంపాదించాలని తల్లిదండ్రులందరూ సహజంగానే కోరుకుంటారు. ఆమె స్నేహితులైన కొందరు న్యాయవాదులు అలానే చేస్తున్నారు. అయితే మాతో చర్చించకుండా, మా అనుమతి తీసుకోకుండానే తాను బస్తర్‌లో పేదలు, అణచివేతకు గురైన ప్రజల పక్షాన పనిచేస్తున్న ఒక బృందంతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నానని చెప్పింది.

ఆమె చెప్పిన మాటలు విని నేను చాలా గర్వించాను. ʹʹనీ తల్లిదండ్రులు నువు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నిచ్చారు. అది చాలా గొప్ప విషయంʹʹ అని అన్నాను. కాని నిజానికి ఆమె నిర్ణయంలో మా పాత్ర అంటూ ఏమీలేదు.

పారిజాత జగదల్‌పూర్‌ వెళ్ళిపోయింది. మా ఆర్థిక సహాయం ఏమీ లేకుండానే అక్కడ వుండడం కొనసాగించింది. ఆమె రక్షణ గురించి మేం ఆందోళన చెందేవాళ్ళం. నేను కొన్ని నెలల తరవాత పారిజాత, ఆమెతోపాటు పనిచేసే ఇతర మహిళలు ఎలా వుంటున్నారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాను.

అక్కడ వాళ్ళేమీ పెద్ద భవంతులలో వుండడం లేదు. వాళ్ళు తినే పప్పు అన్నం, కూరలు రొట్టెలలాగానే వాళ్ళ నివాసం కూడా అంత సాధారణంగా వుంది. వాళ్ళు బతకడం కోసం తింటున్నారుగాని, తినడం కోసం బతకడం లేదు. తిండి వాళ్ళకి ఒక విలాసం కాదు. తాము ఎంచుకున్న కర్తవ్యం పట్ల నిబద్దతే వాళ్ళు పనిచేయడానికి కావల్సిన శక్తినిస్తోంది. వాళ్ళు న్యాయవ్యవస్థ చిక్కుముళ్ళల్లో ఇరుక్కుపోయిన అమాయక ఆదివాసీలను కలిసేవారు. నిష్కారణంగా సంవత్సరాల తరబడి జైళ్ళల్లో వున్న పేద ఆదివాసీలతో మాట్లాడేవారు. వాళ్ళు ఎప్పుడూ కాలి నడకనగాని, స్థానిక బస్సుల్లోగాని ప్రయాణించేవారు.

అయినా వాళ్ళు సంతోషంగానే వున్నారు. నేను 35 సంవత్సరాలపాటు సైనికాధికారిగా పనిచేసినవాడిని. మా శారీరక, మానసిక, ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవ, బాధ్యతల పట్ల నిబద్దత నాకు నిజంగా గర్వ కారణంగా వుండేవి. తాము విలాసంగా జీవించే అవకాశాలు వున్నప్పటికీ వాటన్నింటినీ వదిలిపెట్టి, ఆధునిక జీవితం కల్పిస్తున్న ఆకర్షణలన్నింటినీ కాదనుకొని వీళ్ళు సమాజాన్ని బాగుచేసే కృషిలో నిమగ్నమయ్యారు.

నా కూతురు పారిజాత ఎదుర్కొన్న ఒక సమస్య విషయంలో సుధా భరద్వాజ ఎంతగానో సహాయం చేశారు. ఆవిడ పట్ల ఆసక్తి పెరిగి ఎక్కువ సమాచారం తెలుసుకోవడం ప్రయత్నించాను. ఆమె, యువ కార్యకర్త సోనీసోరీ కలిసి పేద ప్రజలు గురవుతున్న అన్యాయాల్ని గురించి చేస్తున్న వివిధ రకాల కార్యక్రమాలన్నింటినీ గమనించాను. అలాంటి వాళ్ళందరు సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి తమ యావత్‌ శక్తిని ఎలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకున్నాను.

సుధా భరద్వాజ్ పేదలలో కెల్లా పేదవాళ్ళ పక్షాన నిలబడ్డారు. అన్ని ఆశలు అడియాసలయిపోయాక వాళ్ళు బిలాస్‌పూర్‌లోని ఆమె కార్యాలయంలోకి చేరుకునేవారు. వాళ్లదగ్గర ఆమెకివ్వడానికి డబ్బేమీ లేకపోయినా, అనేక సందర్భాలలో తమ పోలాలల్లో పండిన ధాన్యాన్నో, కూరగాయల్నో, తమ ఇళ్ళల్లో వున్న పాలనో తీసుకు వచ్చి ఆమెకివ్వడానికి ప్రయత్నించేవారు. ఇది మమ్మల్నెంతగానో వుత్తేజపరిచింది. మా కూతురు కూడా క్రమక్రమంగా పేద ప్రజల పట్ల సహానుభూతితో వుండడాన్ని మేం గమనించాం.

ఇతర మేధావులతోపాటు కుట్ర అనే నేరంకింద సుధా భరద్వాజ్ ను అరెస్టు చేసారని ప్రసారమాధ్యమాల్లో చదివిన వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. నవ్వాలో, ఏడవాలో మాకు తెలియలేదు.

ఉన్నతమైన చదువులు చదివి, న్యాయశాస్త్రం, సామాజిక న్యాయాల గురించిన తన జ్ఞానంతో అణగారిన ప్రజలకు సేవచేయడానికి నిర్ణయించుకున్న, భౌతిక వస్తుగత సౌఖ్యాలన్నింటిని నిరాకరిస్తూ, సత్యమేవ జయతే అనే సూక్తిని వాస్తవ అర్థంలో తన ఆదర్శంగా చేసుకున్న సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళు కుట్రచేశారనడం నమ్మశక్యం కాదు. సత్యాన్ని చేరుకోవడానికి ప్రయాణించే బాటలో అనేక అవరోధాలు ఎదురవుతాయి. వాటన్నింటిని ఎదుర్కొనే శక్తి నాకులేదు. అయినా సుధా భరద్వాజ్ లాంటి వ్యక్తులకి నేను కనీసం సాల్యూట్‌ చేయగలను.

కె.యస్‌.వి. కృష్ణన్‌. (భారత సైన్యంలో 1972 నుండి 2007 వరకు పనిచేసి కల్నల్‌గా పదవీ విరమణ చేశారు)

అనువాదం: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌


No. of visitors : 697
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •