నేనూ అర్బన్ మావోయిస్టునే

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

నేనూ అర్బన్ మావోయిస్టునే

- సాగర్ | 22.09.2018 09:53:57pm

దేశద్రోహం, దేశభక్తి బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన పదాలు. తాజాగా వీటి జాబితాలోకి ʹఅర్బన్ మావోయిస్టుʹ కూడా చేరింది. ఇంతకముందర ఆదివాసుల కోసమో మావోయిస్టుల కోసమో మాట్లాడే ప్రజస్వామికవాదులను మావోయిస్టులు అనే వారు. కానీ ఇప్పుడు దళితుల కోసం మాట్లాడినా, రైతుల కోసం మాట్లాడినా, ప్రభుత్వ విధానాలను నిరసించినా అర్బన్ మావోయిస్టు గా పరిగణిస్తున్నారు. అందుకే ప్రొ .సాయిబాబా, వరవరరావు, సుధా భరద్వాజ్ మొదలు రచయిత అరుంధతీరాయ్, స్వామి అగ్నివేశ్, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్, కాంగ్రెస్ పార్టీ నేతలు అర్బన్ మావోయిస్టులు అయ్యారు. నేడు తమ ప్రభుత్వం పై అసమ్మత్తిని ఎవరు తెలియచేసినా వారిని అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు.

2013 లో ఢిల్లీలో ప్రొ. సాయిబాబాను వైట్ కాలర్ మావోయిస్టుగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది. పట్టణ ప్రాంతాలలో ఉంటూ మావోయిస్ట్ ఐడియాలజీని ప్రచారం చేస్తున్నాడని, మావోయిస్టులకు అర్బన్ కనెక్టివిటీగా పనిచేస్తున్నాడని తప్పుడు కేసులు పెట్టి జైలులో నిర్బంధించారు. ఇంతకంటే ముందు RDF ఉపాధ్యక్షుడు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యుడు గంటి ప్రసాదంను ఆదివాసుల పక్షాన సల్వాజుడంకు, ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న నెపంతో 2013 జులైలో నెల్లూరు పట్టణంలో పట్టపగలు ప్రభుత్వ హంతక మూకలు హత్య చేశాయి. 2016 లో అప్పటి బస్తర్ ఐజి అడవుల్లో తాము మావోయిస్టులతో యుద్ధం చేస్తుంటే, పట్టణాల్లోని మావోయిస్టు మేధావులతో పోరాడటానికి అగ్ని (యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌) సంస్థను ప్రారంభించామన్నాడు. ఇక్కడ మావోయిస్టు మేధావులు అంటే ఆదివాసుల హక్కుల కోసం మాట్లాడే ప్రజాస్వామికవాదులు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందుకు తగ్గట్టుగానే 2017లో ఆదివాసుల కోసం పనిచేస్తున్న సోనిసోరిపై యాసిడ్ దాడి, మాలినీ సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి జ‌ర్న‌లిస్టులును బస్తర్ నుంచి పంపివేయడం, ఇషా కందేల్‌వాల్, శాలినీ గేరా వంటి న్యాయ‌వాదులను సైతం బ‌స్త‌ర్ వీడి వెళ్లాల‌ని ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేయడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జె.ఎన్.యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్ వంటి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఎవరైతే ఆదివాసుల కోసం మాట్లాడుతున్నారో వారంతా అర్బన్ మావోయిస్టులు అనే ముద్రను వేశారు. ఇది ఎక్కడ దాక వెళ్ళింది అంటే గిట్టుబాటు ధర కోసం మహారాష్ట్ర రైతులు ర్యాలీ చేసినా , తూత్తుకుడి స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాడినా వారిని కూడా అర్బన్ మావోయిస్టులే అంటున్నాయి ఈ ప్రభుత్వాలు.

ఈ జనవరి నెలలో ముంబైలో గత సంవత్సరం డిసెంబర్ 31న జరిగిన భీమా కోరేగావ్‌ ఉద్యమంలో పాల్గొన్న దళితులపై శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేల నాయకత్వంలోని హిందుత్వ శక్తులు దాడిచేశాయి. ఈ సంఘటనను మరుగున పర్చడానికి దీనిలో మావోయిస్టుల పాత్ర ఉన్నదని, దానికి సంబంధించి జూన్ నెలలో 5గురు హక్కుల కార్యకర్తలను ఆరెస్ట్ చేశారు. వీరిలో దళిత హక్కుల కార్యకర్త, ʹవిద్రోహిʹ పత్రిక సంపాదకుడు సుధీర్‌ ధావ్లే, న్యాయవాది, ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్‌, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సెక్రెటరీగా ఉన్న రోనా విల్సన్‌, విస్థాపనకు వ్యతిరేకంగా పోరాడుతున్న విస్థాపన్‌ విరోధి జన వికాస్‌ ఆందోళన్‌ సభ్యుడు మహేష్‌ రావత్‌, నాగపూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, మహిళా హక్కుల కార్యకర్త షోమా సేన్‌ ఉన్నారు. వీరంతా మొదటి నుంచి ఆదివాసుల పక్షాన మాట్లాడుతున్నవారు. భారత పాలకవర్గాలు ఆదివాసులపై చేస్తున్న అప్రకటిత యుద్దాన్ని నిరసిస్తున్నవారు. అంతేకాక అరెస్టు కాబడ్డ రోనా విల్సన్ దగ్గర ప్రధాని హత్యకు సంబంధించి లేఖ దొరికిందని దానిలో విరసం నేత వరవరరావు, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌ తదితరులు మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనే ఒక అబద్దాన్ని ప్రచారం చేశారు. ఈ లేఖల ఆధారంగా ఆగస్టు 28న దేశవ్యాప్తంగా 8చోట్ల పూణే పోలీసులు సోదాల పేరుతొ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరో అయిగురు హక్కల కార్యకర్తలను అరెస్టు చేశారు. సుధా భరద్వాజ్, వరవరరావు, గౌతమ్ నవలఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరాలను అరెస్టు చేసారు. వీరంతా కూడా ఆదివానులు గురుంచి, భీమా కోరేగావ్‌ గురించి, తమ కంటే ముందు అక్రమంగా అరెస్టు కాబడ్డ వారి గురుంచి మాట్లాడుతున్నవారే. వీరికంటే ముందు ముంబైలో తెలంగాణ నుంచి వలస వెళ్లి బతుకుతున్న 8 మందిని మహారాష్ట్ర నుంచి గుజరాత్ మధ్య మావోయిస్టు ఉద్యమం కోసం గోల్డెన్ కారిడార్ నిర్మిస్తున్నారన్న ఆరోపణతో అరెస్టు చేశారు. దీని వెనుకున్న అసలు కారణం మహారాష్ట్రలోని రిలయన్స్ కంపెనీలో అసంఘటితంగా ఉన్న కార్మికులను సంఘటితపర్చి ఉద్యమం నడపటమే.

రాబోయే 2019 ఎన్నికల కంటే ముందే దండకారణ్యంలోని ఆదివాసులను, మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి వైమానిక దాడులు చేయడానికి దాదాపు 10 ఎయిర్ బేస్ లను 2,00,000 మంది బలగాలను మోహరించారు. అంతేకాక 50,000 మందితో సల్వాజుడం లాంటి బస్తరియా బెటాలియాన్ ను ఏర్పాటు చేసి ఆదివాసులను అంతమొందించి, వారి కాళ్ళ కింద ఉన్న ప్రకృతి సంపదను కార్పొరేట్లకు అప్పగించడమే ఈ ప్రభుత్వాల లక్ష్యం. పూజారి - కాంకేర్ ,గడ్చిరోలి, కల్లెడ మారణకాండ లు వీటిలో భాగమే. ఆగస్టు 7న కుంట ప్రాంతంలో 16 మంది ఆదివాసులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల పేరుతో కాల్చివేశాయి. వీటి నిజనిర్ధారణకు వెళ్లిన హక్కుల సంఘాలను బెదిరించడం, మాట్లాడే వారిని కుట్ర కేసుల పేర అరెస్టు చేయడం, ఇక మీదట ఎవరు మాట్లాడినా వారిని ఇలాగే చేస్తామని ప్రజలను టెర్రరైజ్ చేయడం, ఎవరిని కూడా మాట్లాడకుండా చేయడమే ఈ అరెస్టుల ఉద్దేశం.

ఇలా ఎవరైతే ఆదివాసుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, రైతుల కోసం మాట్లాడతారో వారంతా అర్బన్ మావోయిస్టులు అవుతారని ఈ అరెస్టులతో ప్రభుత్వం చెప్పదలుచుకుంది. అసలు ఈ మొత్తం క్రమాన్ని చూస్తే మొట్టమొదలు ఆదివాసుల కోసం మాట్లాడే వారి నుండి చిట్టచివరకు తమ అసమ్మత్తిని తెలిపే వారిని కూడా అర్బన్ మావోయిస్టులు అనే ముద్రవేయడం దాకా వెళ్ళింది. ఇలా మాట్లాడే ఎవరినైనా అర్బన్ మావోయిస్టు అని ప్రభుత్వాలు అంటున్నప్పుడు ఇప్పుడైనా ఇక మాట్లాడాలి. కాబట్టి ఈ అప్రకటిత ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా వేలాదిమంది తమ నిరసనను బహిరంగాను, సోషల్ మీడియాలోనూ ʹనేనూ అర్బన్ నక్సలైట్ʹనే అంటూ తమ అసమ్మత్తిని తెలియచేస్తున్నారు. వీరిలో ప్రముఖ నటుడు సాహితీవేత్త గిరీష్ కర్నాడ్, బాలీవుడ్ నటీమణి స్వర భాస్కర్, అరుంధతీ రాయ్ తో పాటు ఏంతో మంది ప్రజాస్వామికవాదులు, పలువురు రాజకీయ నాయకులూ ఉన్నారు. పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు. ఆదివాసులను, దళితులను, మైనార్టీలను వారి తరుపున మాట్లాడే ప్రజాస్వామికవాదులనే కాదు, మన స్వేచ్చను కాపాడుకోవడానికైన మనమందరం ʹనేనూ అర్బన్ నక్సలైట్ʹనే అని నినదించాల్సి ఉంది.

No. of visitors : 768
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •