చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

| సాహిత్యం | వ్యాసాలు

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

- రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడుతున్నారు.
-రాహుల్ మాగంటి

ʹఏ కాలమైనా సగానికి సగం మంది ఊరు దాటే ఉంటారు. హైదరాబాద్ అంబార్ పేట్ మార్కెట్లో కొంత మంది, విజయవాడ బీసెంట్ రోడ్డులో కొంత మంది, ముంబై ʹగేట్ వే ఆఫ్ ఇండియాʹ దగ్గర వషి మార్కెట్లో కొంత మంది, ఢిల్లీ పహార్ గంజ్ లో కొంత మంది- అందరూ బుట్టలు, తాడుతో అల్లిన ఉయ్యాలలు అమ్ముకుంటుటారు,ʹ అంటాడు ఉత్తరాంచల్ నుండి అమ్మకాలు పూర్తి చేసుకొని వచ్చిన మ్యాలపిల్లి పట్టయ్య.

42 సంవత్సరాల పట్టయ్య గ్రామంలో అందరిలాగానే 20ఏళ్ల క్రితం నైలాన్ తాడుతో బుట్టలు, సంచులు, ఉయ్యాలలు చేయడం ప్రారంభించాడు. అప్పటిదాకా కొవ్వాడ (రెవెన్యూ రికార్డుల్లో జీరుకొవ్వాడ)లో చేపలు పట్టడమే ప్రధాన వృత్తి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో 250 మంది నివసించే బంగాళాఖాతపు చిన్న తీరప్రాంత గ్రామమది.

తర్వాత ఆ ప్రాంతంలో నీటి కాలుష్యం సముద్రపు సంపదను ధ్వంసం చేసింది. 1990లలో అక్కడికి 10 కిలోమీటర్ల దూరం లోపల పైడిభీమవరంలో ఫార్మా పరిశ్రమలు వచ్చాయి. అవి సముద్రపు నీతితో పాటు భూగర్భ జలాలనూ కలుషితం చేసాయి.

భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ రసాయన మందులు (ఫార్మాశూటికల్ కెమికల్స్) తయారు చేయడాన్ని ప్రమాదకర వ్యర్థాల ఉత్పాత్తిలో ఎరుపు జోన్ లో (రెడ్ జోన్) వర్గీకరించింది (కాలుష్య ప్రమాదాన్ని బట్టి ఆయా ఉత్పత్తి క్షేత్రాలను ఎరుపు, నారింజ, ఆకు పచ్చ రంగు జోన్లుగా వర్గీకరించారు. ఎరుపు అంటే అత్యంత ప్రమాదకరం – అను) 1990ల తోలి సంవత్సరాల్లో ప్రపంచీకరణ చెందిన ఫార్మా పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్నవాటిలో ఒకటైంది. ఆ పారిశ్రామిక హబ్ లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. భారతదేశ పర్యావరణంపై, ప్రజలపై ఫార్మా పరిశ్రమల కాలుష్య ప్రభావంపై రూపొందిన ఒక నివేదిక ఈ విషయాన్ని చెప్తూ ఎన్ని వ్యతిరేక ప్రభావాలున్నా ఎపి, తెలంగాణాల్లో ఈ పరిశ్రమ అప్రతిహతంగా వృద్ధి చెందుతోందని రాసారు.

ఆంధ్రప్రదేశ్ లో పైడిభీమవరం, రణస్థలం ప్రాంతం కలకత్తా, చెన్నై జాతీయ రహదారి ఇరువైపులా అదొక భారీ ఫార్మా కేంద్రం. 2008-2009లో అది ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) అయ్యాక మరింతగా ఊపందుకుని కొత్త కంపెనీలు కూడా రావడం మొదలైంది. 2005 సెజ్ చట్టం పరిశ్రమలకు అనేక రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు కార్మిక చట్టాలను కూడా సవరించింది. ఆంద్రప్రదేశ్ లో 19 సెజ్ లు ఉంటే పైడిభీమవరం వద్ద ఉన్న నాలుగు సెజ్ లు మందుల తయారీ పరిశ్రమల మీద దృష్టి సారించాయి.

ʹవాటి పైప్ లైన్లు (వ్యర్థాలను వదిలే పైపులు) సముద్రంలో 15 కిలోమీటర్ల లోపలికి ఉన్నాయి. కాని మేం చేపలు పట్టడానికి పొతే 100 కిలోమీటర్ల వరకు ఆయిల్, మురికి అంతా తేలుతూ కనపడుతుందిʹ అని గనగాల్ల రాముడు చెప్తాడు. కొవ్వాడలో అతడు తెప్ప నడుపుతాడు. ఇరవై ఏళ్ల క్రితం ప్రతి ఇంటికీ కనీసం ఒక తెప్ప ఉండేది. ఇప్పుడు 10 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. ʹ2010లో మేము వరుసగా మూన్నెల్ల పాటు రణస్థలం ఎంఆర్వో ఆఫీసు ముందు ధర్నా చేసాము. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఉద్యమం ఆపేసి వెన్నక్కొచ్చి మా పనులు మేం చేసుకుంటున్నాం,ʹ అన్నాడు.

ʹఫార్మా పరిశ్రమల వల్ల ఈ ప్రాంతపు జల సంపద ధ్వంసమైపోయింది. చనిపోయిన తాబేళ్లు, చేపలు తరచూ ఈ తీరంలో కనిపిస్తుంటాయి. వీటిలో ఆలివ్ రిడ్లీ తాబేలు ఒకటి. సముద్రపు మొక్కలు విషతుల్యం కావడం వల్ల జలచరాలు కూడా విషతుల్యం అయ్యాయి,ʹ అంటున్నారు బుడుమూరు గ్రామానికి చెందిన నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్ (ఎన్.ఏ.పి.ఎం) పర్యావరణ కార్యకర్త, కూనం రాము.

దీనివల్ల కొవ్వాడ తదితర గ్రామాల్లో చేపలు పట్టడం నిష్ఫలమవుతున్నది. ʹఇక మేము చేపల వేటకు పోడం కూడా దండగ, ఎందుకంటే ఎంత సేపు కష్టపడ్డా చేపలు దొరకవు,ʹ అంటున్నాడు 40 ఏళ్ల మ్యాలపిల్లి అప్పన్న. ʹఉదయం నాలుగు గంటలకు సముద్రంలోకి 20 కిలోమీటర్ల వరకు వెళ్లి, 8-9 గంటలకల్లా వల వేసి ఓ రెండు గంటలపాటు ఎదురు చూడ్డం, మద్యాహ్నం 2-3 కల్లా తిరిగి రావడం. ఒక్కో తెప్పలో నలుగురైదుగురం వెళ్తాం. రోజు గడిచే సరికి ఒక్కొక్కరికి 100 రూపాయలు కూడా రావడం లేదు.ʹ

ʹఅమ్మకం అలాగుంచితే, మేం పట్టే చేపలు మా ఇళ్ళల్లో వొండుకోనీకే సరిపోవడం లేదు. ఇంట్లో కూరకే విశాఖపట్నం, శ్రీకాకుళం, రణస్థలం నుండి చేపలు తెచ్చుకున్తున్నాʹమని పట్టయ్య చెప్పాడు.

అందువల్లే అప్పన్న, పట్టయ్య కొవ్వాడలోని చాలా మంది లాగే బుట్టలు, సంచులు, ఉయ్యాలలు తయారు చేయడం మొదలుపెట్టారు, దేశమంతా అమ్మడానికి. శ్రీకాకుళంలో నైలాన్ తాళ్ళు బాగా దొరుకుతాయి. అందువల్ల ఈ అన్ని పనుల్లోకి ఇది కొంచెం లాభసాటిగా ఉంటున్నదని అంటున్నారు. తాను 24 రాష్ట్రాలు తిరిగానని, చాలా రాష్ట్రాలు ఒకటి కన్నా ఎక్కువసార్లు వెళ్లానని అప్పన్న అన్నాడు. కిలో నైలాన్ తాడుతో 50 బుట్టలు తయారు చేస్తాం. ఒక్కోటీ 10, 20 రూపాయలకు అమ్ముతాం. కిలోకు 200 నుండి 400 వరకు గిట్టుతుందని అంటాడు. నైలాన్, గుడ్డతో కలిపి తయారు చేసే ఉయ్యాల ఒక్కోటి 150 నుండి 200 రూపాయల వరకు అమ్ముతారు.
ఊర్లో మగవాళ్ళు బృందాలుగా ఏర్పడి సుదూర ప్రాంతాలకు అమ్మకాలకు వెళ్తారు. అప్పన్న మిత్రుడైన గనగాల్ల రాముడు అతనితో పాటు ఏప్రిల్ లో కేరళ వెళ్ళాడు. తిండి, వసతి, ప్రయాణ చార్జీలు వంటి రోజువారీ ఖర్చులు అతను లేక్కవేస్తూ ʹమే 15 నాడు తిరిగొచ్చేసరికి (నెల తర్వాత) నాకు మిగిలింది ఆరు వేలు మాత్రమే అని చెప్పాడు.

ఈ తిరుగుళ్ళ వల్ల పట్టయ్య కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషలు నేర్చుకున్నాడు. ʹఎక్కడికెళితే అక్కడి భాష నేర్చుకుంటాం. కస్టమర్లతో మాట్లాడాలంటే తప్పదు కదా అంటాడు. ʹఊరు మొత్తం కలుసుకునేది పండగలకు, శుభాకార్యాలకే. బుట్టలు, ఉయ్యాలలు అమ్మడానికి పోయిన మగవాళ్ళు ముఖ్యమైన పండగలకు వస్తారు. అవి అవ్వగానే మళ్ళీ బయలుదేరతారు.ʹ

ఆడవాళ్ళు బుట్టలు, సంచులు, ఉయ్యాలలు అల్లడంతో పాటు అడపాదడపా వచ్చే ఉపాధి హామీ పనులు చేసుకుంటారు. 56ఏళ్ల మ్యాలపల్లి కన్నాంబ ʹనేను నాలుగు వారాలు పని చేస్తే రోజుకు వంద లెక్కన రెండు వారాల డబ్బులు మాత్రమే వచ్చాయనిʹ అంటుంది. 2018-2019 సంవత్సరానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 205 రూపాయల కూలి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఆమె చుట్టు పక్కల ఊర్లలో ఎండు చేపలు కూడా అమ్ముతుంది. ʹవిశాఖపట్నం నుండి చేపలు తెచ్చుకొని, వాటిని రెండ్రోజులు ఎండబెట్టి అమ్ముతామని ఆమె చెప్పింది. ʹఒకప్పుడు ఈ చేపలు మాకు ఊరికే దొరికేవి. ఇప్పుడు రెండు వేలు లాభం రావాలంటే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తాంది,ʹ అంటోంది కన్నాంబ.

రానున్న కాలంలో ఆ చిన్న లాభం కూడా రాకపోవచ్చు. కొవ్వాడ సహా మూడు గ్రామాల్లో 2,073 ఎకరాల పరిధిలో అణువిద్యుత్ కేంద్రం రాబోతోంది. ఇది మొత్తంగా గ్రామస్థులందరినీ అక్కడి నుండి వెళ్ళగొడుతుంది. బుట్టలు చేసుకొని అమ్ముకునే చిన్న ఉపాధిని కూడా చెదరగొట్టి, మరింత పెద్ద ఎత్తున చేపల్ని నాశనం చేయబోతోంది.

అనువాదం: మిసిమి


No. of visitors : 325
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •