మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

| సాహిత్యం | వ్యాసాలు

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

- వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am


జాషువా శత జయంతి సందర్భంగా 1995 సెప్టెంబర్‌ ʹఅరుణతారʹ సంచికలో సంపాదకీయం రాశాను. అది చదివి నన్నభినందిస్తూ నాలుగైదు ఉత్తరాలు వచ్చాయి. అప్పటికి నేను చదివిన జాషువా సాహిత్యం గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలు, మరికొన్ని కవితాఖండికలు మాత్రమే. సంపాదకీయం రాయడానికి ఇవి సరిపోతాయని అనుకున్నాను గాని, మనసు అంగీకరించలేదు. మా కళాశాల లైబ్రరీలో వెదికితే జాషువా పద్యాల్లో రాసుకున్న స్వీయచరిత్ర ʹనా కథʹ దొరికింది. మిగతా రచనలు ఎలా సంపాదించాలా అని అనుకొంటుండగా చలసాని ప్రసాద్‌ మెరుపులా మెరిశాడు. ఆయన ఇంటి నిండా పుస్తకాలే. అదొక పుస్తక మహాసముద్రం. ఆ సముద్రంలో జాషువా రచనలన్నీ తప్పక ఉండే ఉంటాయి. వెంటనే ఆయనకు ఉత్తరం రాశాను. పది రోజులు తిరక్కుండానే రిజిస్టర్‌ పోస్టులో ఒక పెద్ద పార్శిల్‌ వచ్చింది. విప్పి చూస్తే అన్నీ జాషువా పుస్తకాలే. నా ఆనందానికి హద్దు లేదు. ఆశ్చర్యం! గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలు మాత్రమే చదివినప్పుడు మనసులో ఏర్పడ్డ జాషువా చిత్రం లేదు, ఆయన సాహిత్యం మొత్తం చదివాక ఏర్పడ్డ జాషువా వేరు. ʹమా నాన్నగారుʹ పేరుతో జాషువా గురించి హేమలతగారు రాసిన పుస్తకంలో కొంత సమాధానం దొరికింది. మనిషిగా నిలబడడానికీ, కవిగా నిలదొక్కుకోడానికీ, తల్లిదండ్రుల్నీ, భార్యా బిడ్డల్నీ పోషించుకోడానికి, కొన్ని పాత కవితా సంప్రదాయాలతోనూ, సంఘం ఇచ్చే విలువలతోనూ, పాత ఆచారాలతోనూ జాషువా రాజీపడవలసి వచ్చిందని హేమలతగారు రాశారు. ఆ సమయంలో జాషువాలాంటి గొప్ప కవి ఎంత అంతర్మథనానికి లోనయ్యాడో ఊహించుకోవచ్చు.

నిజానికి జాషువాకు తన జీవితంలో ఎన్ని అవమానాలు జరిగాయో, అంతకంటే ఎక్కువగా సన్మానాలూ జరిగాయి. ఒక విధంగా అవమానాలతో మండిపడ్డ జాషువా హృదయం సన్మానాలతో చల్లబడిందేమో అని నా సంపాదకీయంలో రాశాను. హిందూమతంలోని అసమానతల్ని, అంటరానితనాన్ని బలంగా ప్రశ్నించిన జాషువా నాస్తికుడు కాకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. భక్తి ఉద్యమ కాలం నుండీ మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది. దేవుణ్ణి నిరాకరించకుండానే మతమౌఢ్యాన్ని నిరసించడం ఆ సంప్రదాయం. వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ మొదలైన వాళ్ళు ఈ సంప్రదాయంలోని వారే. వీళ్ళెవరూ నాస్తికులు కారు. అయినా మతమూఢవిశ్వాసాల్నీ, కుల అసమానతల్నీ ఎండగట్టిన వాళ్ళే. దేవుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అని నాస్తికులు ఆస్తికుల్ని ప్రశ్నిస్తే, ఆస్తికులు దేవుణ్ణే ప్రశ్నించారు. అసలు దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ఆస్తికులకే ఉందిగాని, నాస్తికులకు లేదు. ఎందుకంటే, లేని దేవుణ్ణి ప్రశ్నించటం అర్థరహితం గదా!

మూఢ విశ్వాసాలు, అర్థం లేని మతాచారాలు, కుల అసమానతలు లేని దేవుడితో, మతంతో జాషువాకు పేచీలేదు. కానీ ఇవేవీ లేని దేవుడు కాని, మతం కాని ఆయన జీవితంలో ఆయనకెప్పుడూ కనబడలేదు. మహిమలతో కూడిన క్రీస్తు జీవితాన్ని జాషువా కావ్యంగా రాస్తే, మహిమలు లేకుండా క్రీస్తు గొప్పదనాన్ని వివరిస్తూ రాయవచ్చు గదా అని హేమలతగారు ప్రశ్నించారు. అప్పుడు కూడా కవిగా తాను కొన్నిటికి రాజీపడవలసి వస్తోందని జాషువా సమాధానం చెప్పారు. మొత్తం మీద ఆధునిక విజ్ఞానశాస్త్రం వల్ల వచ్చిన భౌతిక దృక్పథం జాషువాకు దూరంగానే ఉండిపోయింది.

ʹʹసిరి నిజమ్ముగ వట్టి టక్కరిది సుమ్ముʹʹ అంటాడు జాషువా.. ʹఇంటనున్న ద్రవ్యమెరుపు గుట్టను బోలు వ్యాప్తి చెందెనేని ఫలమునిచ్చుʹʹ అని ఆశించాడే గాని, అదెలా జరగాలో ఆలోచించలేదు. ʹవడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వంʹʹ అని తన జీవితాన్నీ, కవిత్వాన్నీ వ్యాఖ్యానించుకున్నాడుగాని, వడగాడ్పు జీవితం నుండి రావసింది వెన్నెల కవిత్వం కాదని అనుకోలేదు. ʹʹనాల్గు పడగల హైందవ నాగరాజుʹʹ పడగ విప్పి బుసలు కొడుతున్న ఈ హైందవ సమాజంలో జాషువా ఒక అగ్ని పర్వతం.

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత. జాషువా కవిత్వం చండ ప్రచండ భానుడిలా సామాజిక అసమానతలపై నిప్పులు కురిపించి ఉండేది, వెన్నెలలా చల్లని ఓదార్పుగా మాత్రమే మిగిలిపోయేది కాదు. హిందుత్వ పెట్రేగిపోతున్న ఈ సమయంలో జాషువా కవిత్వం అప్పటికంటే మరింత పదునెక్కింది.

( జాషువా 123వ జయంతి సందర్భంగా )

No. of visitors : 287
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •