సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

- | 01.10.2018 10:37:48pm

తీవ్రవాద చర్యలకు సహకరిస్తున్నారన్న అభియోగం మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ) కింద ఆగస్టు 28న దేశంలో చాలా ప్రముఖులైన న్యాయవాదులను, జర్నలిస్టులను, పౌరహక్కుల కార్యకర్తలను అరెస్టు చేయగా మేము సుప్రీం కోర్టును సంప్రదించాము.

రాజ్యం తన అధికారంతో అమానుషమైన యూ.ఎ.పి.ఎ చట్టాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేయడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడమే మా ఉద్దేశం. ఇటువంటి దుర్వినియేగం తీవ్ర అన్యాయాలకు దారితీసి భారతీయులందరి పౌరహక్కులను ప్రమాదంలో పడేస్తుందని మన రిపబ్లిక్‌ చరిత్ర మనకు చూపెడుతోంది.

ఆగస్టు 28న అరెస్టయినవారిపై తీవ్రవాద చట్టాల కింద అభియోగం మోపారు. కాని మన ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచే తీవ్రవాదాలు రెండు రకాలని మేం నమ్ముతున్నాం.

1. బాంబులు పెట్టి, ప్రజలను హింసకు పురిగొల్పి, అల్లర్లకు సూత్రధారులుగా వ్యవహరిస్తూ, పనిగట్టుకొని తమ చర్యల ద్వారా భయాన్ని వ్యాపింపజేస్తూ తీవ్రవాదులుగా వర్ణించబడేవారి హింసాత్మక చర్యలు.

2. అసలు నేరస్తులను పట్టుకోవాల్సింది పోయి, అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ వారి యజమానుల రాజకీయాలకు లోబడనివారిని వేధించే ప్రభుత్వ అధికారులు చేసే చట్టవ్యతిరేకమైన, సమర్థించుకోను కూడా వీలుగాని చర్యలు.

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్‌ని వ్యాపింపజేస్తోందనే అర్థం. నమ్మశక్యం కాని అరోపణలతో ఆగస్టు 28నాడు చేసిన విచ్చలవిడి అరెస్టుల వంటివి మా అందరి ఆందోళనకు కారణమయ్యాయి. వాటి అర్థం ఏమంటే వారెంటు లేకుండా, లేదా మనకు అర్థంకాని భాషలో ఉన్న వారెంట్లతో పోలీసులు ఎప్పుడైనా మన ఇళ్లలోకి జొరబడొచ్చు. మనకు ఏమీ తెలీని కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలు చేయవచ్చు.

నిజమైన ప్రజాస్వామ్యం ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులను గౌరవిస్తుందని ఎప్పుడూ అనుకుంటాం. అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు- అది ఆరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా సరే- ఉంటుందని అనుకుంటాం. ఆగస్టు 28 అరెస్టులు జూన్‌లో జరిగిన అరెస్టుల వంటివే కావడంతో అవి ఈ హక్కులను కాలరాచే నిరంతర ప్రయత్నంలో భాగమని అర్థమవుతోంది.

మేము సుప్రీం కోర్టులో అత్యావశ్యకంగా వేసిన పిటిషన్‌ ఇలా హక్కులను కాలరాయడానికి చెక్‌ పెట్టమని, మానవహక్కుల కార్యకర్తల స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడమని విన్నవించడానికే.

ఈరోజు తీర్పు ఈ సామాజిక కార్యకర్తలకు మరో నాలుగు వారాల ఊరట కలిగించింది. సంబంధిత న్యాయస్థానాలను సంప్రదించడానికి వెసులుబాటును ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మా అభిప్రాయం మెజారిటీ తీర్పుకు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జస్టిస్‌ డివై చంద్రచూడ్‌తో ఏకీభవిస్తుంది. ఏ కీలక సందర్భాల పేరు మీద స్వేచ్ఛను బలిపెట్టవద్దని, పోలీసులు మీడియా విచారణను నిర్వహించి ఇష్టానుసారం ప్రవర్తించారని, వాస్తవాలను వక్రీకరించే స్వేచ్ఛను తీసుకొని సామాజిక కార్యకర్తల గౌరవానికి భంగం కలిగించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పినట్లు ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు న్యాయంగా, నిష్పక్షపాతంగా విచారణ చేయగరనే విషయంలో చాలా అనుమానం కలుగుతుంది.

సుప్రీం కోర్టు మానవహక్కుల కార్యకర్తల స్వేచ్ఛ, గౌరవాలకు ప్రస్తుతానికైనా భంగం కలగజేయకుండా కాపాడినందుకు అర్జీదారులుగా మేము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం.

-రొమిలా థాపర్‌,
దేవకీ జైన్‌,
ప్రభాత్‌ పట్నాయక్‌,
సతీష్‌ దేశ్‌పాండే,
మాజా దారూవాలా.

28 సెప్టెంబర్‌ 2018.

(అనువాదం: మిసిమి)


No. of visitors : 616
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •