ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం

- కడప జిల్లా ప్రజాసంఘాల నిజనిర్ధారణ బృందం | 10.10.2018 10:57:42pm

కాశినాయన మండలం, కేశవనాయని కొట్టాల దళిత విద్యార్థిపై దాడి, సాంఘిక బహిస్కరణపై ప్రజా సంఘాల ఆధ్వర్యములో 8.10.2018న నిజనిర్ధారణ బృందం, కోడిగుడ్లపాడు హైస్కూల్ విద్యార్థినులను, కొండ్రాజుపల్లె కె.యన్. కొట్టాల గ్రామాలను, కె.యన్. కొట్టాల దళితవాడను పర్యటించి అక్కడి ప్రజలను కలిసి వాస్తవాలను సేకరించింది.

కొండ్రాజుపల్లె, కె.యన్.కొట్టాల, ఆకులవారిపల్లె తదితర గ్రామాలనుండి అన్ని వర్గాల పిల్లలు చదువుకోవడానికి కోడిగుడ్లపాడులో వున్న జిల్లా పరిషత్ హైస్కూలుకు వెళ్తారు. సాయంకాలం స్కూలు వదిలిన తరువాత కొందరు సైకిళ్ళపై, మరికొందరు నడుచుకుంటూ వారివారి గ్రామాలకు పోతుంటారు. సెప్టెంబర్ 4న కే.యన్. కొట్టాల దళితవాడకు చెందిన ఇంటర్ చదువుతున్న వంశీ, డిగ్రీ చదువుతున్న కాశయ్యలు కోండ్రాజపల్లె, కోడిగుడ్లపాడు మధ్యలో నడుచుకుంటూ వస్తున్న విద్యార్థినులపై ఈవ్ టీజింగ్ కు పాల్పడినారని తెలిసింది. ఈ విషయం పెద్దలకు తెలిసి దళితవాడకు రోడ్డుమీద నడచుకుంటూ వస్తున్న వంశీ, కాశయ్యలను కొండ్రాజుపల్లె గ్రామస్తులు ఊరులోకి తీసుకొనిపోయి ఆవేశంతో మూకుమ్మడిగా చెప్పులతోను, కాళ్ళు చేతులతోనూ కొట్టారు. వాళ్ళను కొట్టే వీడియోలుకూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆడపిల్లలను అల్లరి పెడితే కొట్టామని కొండ్రాజుపల్లె గ్రామస్తులు కూడా తెలిపారు. కోడిగుడ్లపాడు జిల్లా పరిషత్ హైస్కూలు బాలికలను ఈ విషయం గురించి అడిగితే వారిలో కాశయ్య ఈవ్ టీజింగ్ పాల్పడలేదని వంశీ మాత్రమే విద్యార్థినులను వేధించాడని నిజనిర్ధారణ బృందానికి చెప్పారు. ఆడపిల్లలను వేధించడం ఏమాత్రం క్షమించరానిది. వారిని చట్టప్రకారం శిక్షించాల్సిందే. అది ఎవరికీ మినహాయింపు కాదు. కానీ కొండ్రాజుపల్లె వాసులు చట్టప్రకారం వ్యవహరించకుండా బాలికలను వేధించారని ఆరోపణలు ఎదురుకొన్న వంశీ, కాశయ్యలను అదుపులోకి తీసుకొని భౌతిక దాడులకు పాల్పడడం శోచనీయం. వారిని పోలీసులకు అప్పగించి వుంటే బాగుండేది. అంతే కాకుండా దానిని సాకుగా తీసుకొని మూడు గ్రామాలకు కూడలిగా, బస్టాప్ గా ఉన్నచోట దళితులకు సంబంధించిన వేపచెట్టును నరికివేయడం, వేపచెట్టు కిందవున్న అరుగును ధ్వంసం చేయడం, దాని ప్రక్కనే ఉన్న కాశినాయన పూరిగుడిసె ఆశ్రమాన్ని కాల్చివేయడం చూస్తూంటే దళితులపట్ల అగ్రకులాలకు ఎంతటి కులవివక్ష వున్నదో అర్ధమౌతున్నది.

కె.యన్. కొట్టాల దళితవాడ ప్రజలు ఏమంటున్నారంటే నిజంగా మా పిల్లలు కొండ్రాజుపల్లె బాలికలను వేధించినట్లయితే మేము దాన్ని సమర్ధించడంలేదు. మా పిల్లలను కొట్టినాకూడా అర్థం చేసుకోగలం. ఆడపిల్లల విషయంలో ఎవరైనా అట్లాగే చేస్తారు. కానీ మా దళితుల పట్ల ఎప్పటి నుండో కులవివక్షతతో వున్న అగ్రకులాలవారు దానిని సాకుగా తీసుకొని మాకు సంబంధించిన వేపచెట్టును నరికేసి, అరుగును కూల్చేసి, ఆశ్రమాన్ని తగలపెట్టారు. బస్టాప్ లోని అరుగులమీద మేము కూర్చోవడం సహించలేక, ఏరా మెమోస్తే అరుగులపై నుండి లేయరా అని చాలాసార్లు కులం పేరుతో తిట్టేవాళ్ళు. కుల దురహంకారంతో, ఎప్పటి నుండో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా వీటిని ధ్వంసం చేసినారు. ఈ సంఘటనను సాకుగా తీసుకొని చుట్టప్రక్కల గ్రామాలలోని అగ్రకులాలు ఏకమై మాకు వ్యతిరేకంగా ధర్నా చేసినారు. దళితవాడ ప్రజలను అగ్రకులాలవారు వ్యవసాయపనులకు పిలవొద్దంటూ అన్నిచోట్లా అడ్డం తగులుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనడానికిపోతే సరుకులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. కనీసం ప్రభుత్వం యన్.టి.ఆర్ సృజల స్రవంతిలో భాగంగా ఇస్తున్న మినరల్ వాటర్ కూడా మాకు ఇవ్వడంలేదు.

దీనిని బట్టి చూస్తే అక్కడ ʹసాంఘిక బహిష్కరణʹ అమలవుతోందని అర్ధమౌతున్నది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ క్షణంలోనైనా దళితవాడపై దాడి జరిగే అవకాశముంది. ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని గ్రామంలో పర్యటించి ఇరువర్గాలను సమావేశపరచి శాంతిని నెలకొల్పాలని కమిటీ అభిప్రాయపడుతున్నది.
వేధింపులకు పాల్పడిన విద్యార్థులనే కాకుండా దళితవాడ నుండి కాలేజీలకు పోయే నాగరాజు, శశీ, జీవన్ కుమార్ అనే విద్యార్థులపై కూడా కేసు పెట్టడం దారుణమైన విషయం. ఇది దళిత విద్యార్థులను చదువులకు దూరంగా పెట్టడమేనని అర్ధమౌతున్నది. పై సంఘటనలన్నీ పరిశీలిస్తే వేధింపులను సాకుగా తీసుకొని దళిత విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడమే కాకుండా వీరి చదువులకు ఆటంకం కలిగిస్తున్నారు. బాలికలను వేధించడం తప్పే. అది శిక్షార్హమే. కాని ఇది సాకుగా తీసుకొని చట్టాన్ని చేతులోకి తీసుకొని గ్రామస్తులు దళిత విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడడంకూడా నేరమే.

డిమాండ్స్ :
1. సాంఘిక బహిష్కరణకు పాల్పడుతున్న అగ్రకులాల వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి.
2. దళిత విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడిన అగ్రకుల వారిపై కేసులు నమోదు చేయాలి.
3. బస్టాండులో వున్న అరుగు, చెట్లును, ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.
4. అరుగును, ఆశ్రమాన్ని తిరిగి పునరిద్ధరించాలి. చెట్లను నాటాలి.
5. ప్రభుత్వ యంత్రాంగం దళితులకు రక్షణ కల్పించాలి.
6. వేధింపులకు సంబంధంలేని దళిత విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి.

-కొవ్వూరు మనోహర్ రెడ్డి (పౌరహక్కుల సంఘం),
సి. వెంకటేశ్వర్లు, (పౌరహక్కుల సంఘం),
వంగిమళ్ళ రమణ (పౌరహక్కుల సంఘం)
కె. జయశ్రీ (మానవహక్కుల వేదిక)
పి. వరలక్ష్మి (విప్లవ రచయితల సంఘం)
పద్మ (చైతన్య మహిళా సంఘం)


No. of visitors : 460
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ పిల్లకు క్షమాపణతో...

పి.వరలక్ష్మి | 24.09.2018 11:25:16am

కులం, పితృస్వామిక కుటుంబం మానవత్వాన్ని, ప్రేమను ఎట్లా బలితీసుకుంటోంది. మనిషిని ఒక్కసారి కాదు, పదేపదే చంపుతుంది. మనిషి చచ్చిపోయినా ప్రేమను బతికించుకోవాలనే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •