విప్లవ బాటసారి త్రిపురనేని

| సాహిత్యం | వ్యాసాలు

విప్లవ బాటసారి త్రిపురనేని

- సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

అతడు రెబల్‌. అతడు రాడికల్‌. అతడు విప్లవ భావాల ప్రభంజనం. ఎక్కడ కృష్ణాజిల్లా దివితాలూకా అంగలూరు గ్రామం? ఎక్కడ చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం? వృత్తి రీత్యా మామూలు ఒక తెలుగు అధ్యాపకుడు విప్లవ చరిత్రగా మారాడు. తరగతి గదిలో పాఠం చెప్పినా, కోనేటికట్ట దగ్గర ఉపన్యాసం ఇచ్చినా, డీలక్స్‌ హోటల్‌ ముందు పదిమంది విద్యార్థులను వెంటేసుకుని పిచ్చాపాటి మాట్లాడినా శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. అతడే త్రిపురనేని మధుసూదనరావు.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో త్రిపురనేని ఆరేండ్ల పిల్లవాడు. హిట్లర్‌ ఓ విలన్‌గా స్టాలిన్‌ ఓ హీరోగా ఆ పసిహృదయంలో ముద్రపడింది. కమ్యూనిస్టులంటే మంచివాళ్లనే ఆనాటి సంఘటనే ఆయన జీవితంలో తొలి మలుపు. తదనంతరం హైస్కూల్‌ రోజుల్లో బాబాయ్‌ గోపీచంద్‌ సాహిత్యం, తాతగారు త్రిపురనేని పద్యాలు పునాదులైనాయి. ఇక గుడివాడ కాలేజీలో ప్రిన్సిపాల్‌ ఎ.ఎఫ్‌.త్యాగరాజు, తెలుగు మాష్టారు కేతవరపు రామకోటి శాస్త్రి, చరిత్ర అధ్యాపకుడు సుందరరామిరెడ్డి ఈ విద్యార్థి రత్నాన్ని సానబట్టారు. ఇక్కడ కళాశాలలోను ఆపైన ఆంధ్ర యూనివర్సిటీలోనూ చదివిన పుస్తకాలు విప్లవ దృక్పథాన్ని కల్పించాయి. ʹనా జీవితంలో ముఖ్యమైంది పుస్తక జ్ఞానమే, ఆ విజ్ఞానమే నన్ను ముందుకు నడిపించిందిʹ అని చెప్పేవారు మధుసూదనరావు.

1972 ప్రాంతంలో తిరుపతిలో రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పడింది, మధుసూదనరావు ప్రేరణతోనే. వారితోపాటు సిహెచ్‌ శివారెడ్డి, భూమన్‌, జ్యోతి (కోటయ్య) శ్రీధర్‌, నేనూ వ్యవస్థాపక సభ్యులం. ఆ తర్వాత పిడిఎస్‌యు నుంచి విడిపోయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి రాడికల్‌ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇటు రాడికల్‌ విద్యార్థి సంఘం అటు విరసం కార్యకలాపాల్లో మధుసూదనరావు ముమ్మరంగా పాల్గొనేవారు. ఇంటికి ఎవరు వచ్చినా వ్యక్తిగత విషయాలు ఎన్నడూ మాట్లాడిందిలేదు. 7-రాంనగర్‌ క్వార్టర్స్‌, బైరాగిపట్టెడ ప్రాణిగ్రాహి నిలయం, డీలక్స్‌ హోటల్‌ దగ్గర, విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో, సాయంకాలం వాహ్యాళి సమయాల్లో తాను మాట్లాడేది ప్రాపంచిక విషయాలే. గంటలు గంటలు అలుపే వుండదు. తిరుపతిలో నలభై సం||రాల పాటు విప్లవ భావాలు నాటి, పెంచి పోషించి కాపలా కాసిన మేధావి. వేలాది మంది విద్యార్థుల చూపు సమాజంవైపు మళ్ళించిన మహావక్త మధుసూదనరావు. ఈ రోజుల్లో అలా చెప్పే టీచర్లు, వినే విద్యార్థులు ఎందరున్నారు? ʹమార్క్సిస్టు మహోపాధ్యాయుడు మధుసూదనరావు అని శ్రీశ్రీ ఊరకే అనలేదు.

ఇంట్లో తన కుర్చీకి ఎదురుగా గోడ మీద మావో, టేబుల్‌పైన గద్దర్‌ ఇరువైపులా శ్రీశ్రీ, చెరబండ రాజు ఫోటోలు పెట్టుకున్నారు. వారి ఇంటికి వందల సార్లు వెళ్ళాను. నేనై అడిగితే తప్ప తనంతగా సొంత విషయాలు ప్రస్తావించలేదు. నాకీ సమస్య వుందని ఏ రోజూ నోరు తెరిచి ఆయన అడగలేదు. చదవమనీ, రాయమనీ నన్ను ప్రతిసారీ కోరేవాడు. ఆ మాట వినిపించుకోనందువల్ల నేనెంతో కోల్పోయాను.

ఆ విప్లవ బాటసారి మరణానికి కొన్ని నెలల ముందు ʹఉపాధ్యాయవృత్తి అనుభవాలూ, జ్ఞాపకాలూʹ పుస్తకానికి వారి ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్ళాము. అనారోగ్యంతో వుండీ 20 ప్రశ్నలకు సమాధానం చెప్పారు, రెండు గంటల సేపు. అవి చివరి మాటలనీ, అది చివరి కార్యక్రమం అనీ మేము ఊహించలేదు. ఇంటర్వ్యూ చివరల్లో అధ్యాపకులకు మీ సందేశం ఏమిటి అని అడిగితే ʹʹజీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి. జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి. రేపటి మీద ఆశ పెంచుకోండి. నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతకడం గొప్ప అని తెలుసుకోండిʹʹ అన్నారు.

పాఠం విన్న ప్రతి విద్యార్థికి మరపురాని మేటి మాష్టారు మధుసూదనరావు. ఉపాధ్యాయుడు సమాజానికి తాత్విక నాయకుడు అన్న మాటకు ఓ నిరూపణ.

No. of visitors : 282
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •