అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

| సాహిత్యం | వ్యాసాలు

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

- డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm


దివంగత మధుసూదనరావు మంచిమనిషి. భౌతికవాది. గొప్ప వక్త. స్నేహశీలి. సరళ స్వభావులు. నిరాడంబరులు. విప్లవకవి. ప్రఖ్యాత విమర్శకులు. పుస్తక నేస్తం. అన్నింటికి మించి ఒక అరుదైన తెలుగు అధ్యాపకులు.

మూడు దశాబ్దాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో వీరు తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. వీరికి, విప్లవ సంస్థతో పరిచయం ఉండేది. తన ఆలోచనలు ఆ దిశగానే ఉండేవి.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి కాలనీ, బైరాగిపట్టెడలో భార్య, కుమారుడు, కుమార్తెలతో నివాసం ఉండేవారు. నేనూ ఈ కాలనీలోనే, తెలుగు అధ్యాపకురాలుగా ఉంటున్నాను. మధుసూదనరావు సహ తెలుగు అధ్యాపకులకుగా కంటే, మా అందరికీ గురువుగానే ఉండేవారు. అప్పుడప్పుడూ సాయంత్రం వారి యింటికి వెళ్ళేదాన్ని. తెలుగు పాఠ్యాంశాలు, సిలబస్‌, తెలుగు పాఠాలు ఎలా చెప్పాలో తదితర అంశాలను గురించి చర్చించుకునేవారం. నాతో పాటు మరికొందరు తెలుగు అధ్యాపకులు, నరాల వీరయ్య వంటి వారు అక్కడికి వచ్చేవారు. ముఖ్యంగా డిగ్రీలో తెలుగు పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ప్రమాణాలు పడిపోవడం గురించి ఆలోచించే వాళ్ళం. అందుకని ʹఇంటర్‌మీడియట్‌ʹ దాక తెలుగును తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి గురువు మధుసూదనరావు ద్వారా ప్రతిపాదనలు పంపేవాళ్ళం. ఇలా వారితో మంచి పరిచయం ఏర్పడింది.

త్రిపురనేని యింట్లో ముందుభాగం, ఎడమవైపు ఒక గదిలో బోలెడన్ని పుస్తకాల మధ్య, తన చుట్టూ కూర్చొన్న వ్యక్తులతో చర్చలు జరుపుతూ కనిపించేవారు. అవన్నీ విజ్ఞాన దాయకమైనవి. ఉపయోగపడేవి కూడ. ఒక గంట వారితో మాట్లాడితే పది పుస్తకాలు చదివినంత భావన, తృప్తి కలిగేది. ఇది ప్రతినిత్యం జరిగే కార్యక్రమం. తిరుపతి నగరంలో మరెక్కడా యిలాంటి సాహిత్య చర్చలు ఇలా జరిగేవి కాదు. ప్రధానంగా ఆధునిక సాహిత్య చర్చ.

తెలుగు పాఠాలు బోధించడం అంటే వారి దృష్టిలో పదాలకు అర్థం, తాత్పర్యాలు చెప్పడం మాత్రం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలోనే తెలుగు పాఠ్యాంశాలను బోధించాలనే వారు. ఇలా వారు మాకు పథ నిర్దేశకులైనారు. ఒక ప్రాపంచిక దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని అందించిన త్రిపురనేని ఒక అరుదైన తెలుగు అధ్యాపకులు. వీరి విద్యార్థులెందరో, కవులుగా, రచయితలుగా, కళాకారులుగా తయారు కావడం ముదావహం. తెలుగు భాషను సరిగా నేర్చుకోని వారికి ఆంగ్లం అంత సులభంగా రాదన్నది వారి అభిప్రాయం.

మరో ప్రధానాంశం తెలుగును ప్రత్యేకంగా తీసుకొని చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు వుండాలని ఆలోచించేవారు. సంవత్సరాంతపు జవాబు పత్రాలు దిద్దే అధ్యాపకులకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు. ఎప్పుడూ తెలుగు అధ్యాపకులు ఎక్కువ మార్కులు యివ్వరని ఒక బలమైన వాదన విద్యార్థుల్లో ఉండేది. పిల్లలు జవాబులు తప్పులు లేకుండా రాస్తే 90 శాతం దాక యివ్వమనే వారు. వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించేవారు. ఈ మార్పు ఎందరో తెలుగు విద్యార్థులకు సంతోషదాయకమే గాక, వారి భవిష్యత్తును మార్చే పరిస్థితి వచ్చింది. పిల్లలు పి.జి., పి.హెచ్‌.డి.కి వెళ్ళాలంటే మార్కుల వల్ల ఉపయోగం ఉండేది.

చూడ్డానికి మధుసూదనరావు సైలెంట్‌గా, సాదా, సీదాగా చిరునవ్వుతో కన్పించేవారు. అయితే ఒక సారి ఉపన్యాసం ప్రారంభిస్తే కంచుకంఠం... పిల్లల్లో ఆనందోత్సాహాలు మారుమోగేవి. ఎన్నో సభలు పిల్లలు, పెద్దలు యిష్టంగా, ఆసక్తితో సభలకు వచ్చేవారు. ప్రధానంగా ʹకోనేటికట్టʹ సభలు ప్రముఖంగా జనాన్ని ఆకర్షించేవి. విషయ స్పష్టత, సరళమైన భాష, నిర్భీతిగా చెప్పడం మరింత ఆదరణకు కారణం. ఒక సామాజిక అవసరంగా, ప్రయోజనకరంగా సభలు సాగేవి. భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?

సన్మానాలు, పొగడ్తలు వారికి గిట్టవు. నిరాడంబరులు. ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవారు. ʹʹకదిలేది, కదిలించేది, పెను నిద్దుర వదిలించేది, మునుముందుకు నడిపించేది, పరిపూర్ణపు బతుకిచ్చేది కావాలోయ్‌ నవకవనానికిʹʹ అన్న శ్రీశ్రీ మాటలు వీరి ఉపన్యాలు వింటుంటే గుర్తుకు వస్తాయి. సాహిత్య సభలకు విద్యార్థులు సమంగా రావడం లేదని ఒక సందర్భంలో నేనంటే ʹʹఒకరిద్దరైనా సరే నువ్వు చెప్పదలచుకొన్నది పూర్తిగా చెప్పే రావాలి. ఆ మాటలు అగ్గిలా వ్యాపిస్తాయి. శక్తి ఉన్నంత వరకు వెళ్ళాల్సిందేʹʹ అన్న వారి మాటలు ఎన్నిసార్లో గుర్తుకు వస్తాయి.

కొన్ని పుస్తకావిష్కరణ సభలకు వారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించేవారు. ఆ పుస్తకాన్ని ఆయన విశ్లేషించేప్పుడు చీల్చి చెండాడం, ఘాటుగా విమర్శించడం, పుస్తక రచయితలకే గాదు సభలోని వారికీ భయమేసేది. ఎవరి రచనలైనా నిర్మొహమాటంగా, తూర్పారపట్టేవారు. నాకూ ఒకసారి అలాంటి అనుభవం కల్గింది. నా గ్రంథం విషయంలో కూడ రెండు మూడు ఘాటైన విమర్శలు చేశారు. అయితే వారి విమర్శలకు ధీటైన సమాధానాలిచ్చిన సందర్భాల్లో రచయితల్ని సంతోషంగా అభినందించేవారు. ఇవన్నీ స్ఫూర్తిదాయకాలేకదా!

పదవీ విమరణ చేశాక వీరు సీ.కాం కళాశాల వేదికగా ఎనిమిది ఆదివారాలు ʹʹగత తార్కిక భౌతికవాదంʹʹ గురించి పాఠాలు చెప్పారు. ఆసక్తిగా చాలా మంది వచ్చి విన్నారు. ఉపన్యాసాలను రికార్డు చేశాం.

తిరుపతితో మధుసూదనరావుకు ఒక విడదీయరాని బంధం ఉంది. తనకంటూ ఒక గుర్తింపు, స్థానం సంపాదించుకొన్నారు. విద్యార్థుల మనస్సుల్లో వారెప్పుడూ చిరంజీవులే.

జీవిత చరమాంకంలో అనారోగ్య కారణంగా కొంత యిబ్బంది పడ్డం బాధ కల్గించింది.


No. of visitors : 331
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •