సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి

- విరసం | 27.10.2018 09:36:24pm

*సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి

*ఆరెస్సెస్‌ పోలీసుల కుట్రపూరిత న్యాయప్రహసనాన్ని ఎండగట్టండి

*ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, ప్రజాసంఘాలకు, రచయితలకు, మేధావులకు విరసం విజ్ఞప్తి

ప్రధాన మంత్రి హత్యకు కుట్రపన్నారనే అభియోగంపై సుదీర్ఘ న్యాయ ప్రహసనం తర్వాత నిన్న ముంబైలో వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాలను, ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గట్టిగా ఒక్క ఆధారం కూడా పోలీసులు చూపకపోయినా పూణె సెషన్స్‌ కోర్టు ఈ ముగ్గురి బెయిల్‌ పిటషన్‌ను తిరస్కరించింది. సెప్టెంబర్‌ 28నాటి సుప్రీం కోర్టు తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు. ఇక విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును తెలంగాణ హైకోర్టు గృహననిర్బంధాన్ని మూడు వారాలు పొడిగిస్తూ ఇచ్చిన గడువు తర్వాత, గౌతం నవాల్కాను గృహ నిర్బంధం నుండి విడుదల చేసి నవంబర్‌ 1 వరకు ఇచ్చిన సడలింపు ముగిసాక అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 28నాటి అరెస్టులు సుప్రీం కోర్టు జోక్యంతో ఆగిపోయి సుమారు రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉన్న వరవరరావు, సుధాభరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖా, అరుణ్‌ ఫెరేరా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌లను ఎలాగైనా జైలుకు పంపి కక్ష సాధించాలనే విధంగా బిజెపి ప్రభుత్వం, పోలీసులు మొదటి నుండి అత్యంత అప్రజాస్వామికంగా, నీతిబాహ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ అయిదుగురు సామాజిక కార్యకర్తలపై మోపిన అక్రమకేసు నేపథ్యంలోని న్యాయ ప్రక్రియను పరిశీలిస్తే అడుగడునా చట్ట ఉల్లంఘన, కక్షసాధింపు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆగస్టు 28న గౌతం నవల్కా, అరుణ్‌ ఫెరేరా, సుధాభరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వోజ్‌, వరవరరావుల ఇండ్లపై దాడులు, అరెస్టు చేసిన పద్ధతి చట్ట వ్యతిరేకంగా ఉందని రొమిల్లా థాపర్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, దేవకీ జైన్‌, సతీష్‌ దేశ్‌పాండె, మాజాదారువాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మరునాడు సుప్రీంకోర్టు స్పందించి అరెస్టులను నెల రోజులు గృహనిర్బంధంగా మార్చి, నేరాధారాలను చూపాలని పూణె పోలీసులను ఆదేశించింది.

కోర్టుకు సాక్ష్యాలు చూపాల్సిన పోలీసులు పౌరహక్కుల కార్యకర్తలపై నిందల్ని మీడియా ద్వారా ప్రచారం చేశారు. 29 ఆగస్టు నాడే పూనాలో పోలీసు జాయింట్‌ కమీషనర్‌ విలేఖరుల సమావేశం నిర్వహించి ప్రధాని హత్యకు కుట్ర జరిగిందనడానికి సాక్ష్యాలు తమ దగ్గరున్నయంటూ 13 ఉత్తరాలను పేర్కొని కొన్నిటిని మీడియాకి విడుదల చేశారు. దీన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అయితే మొదట హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 28న తన న్యాయబద్ధతను సందేహించేలా తీర్పునిచ్చింది. ఇక్కడ ప్రజాస్వామికవాదులంతా అప్రమత్తం కావాల్సిన ఒక పెద్ద కుట్ర జరిగింది. సుప్రీం కోర్టు కేసు కొట్టివేసి ఈ మొత్తం మీద దర్యాప్తును అదేశిస్తుందని అందరూ అశించారు. సెప్టెంబర్‌ 27 సాయంకాలం వరకు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఈ కేసు మీద జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తీర్పును వెలువరిస్తారని ఉంది. కాని మరుసటి రోజు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ మెజారిటీ జడ్జిమెంటు రాశారు. నిందితులకు దర్యాప్తు సంస్థను ఎంచుకునే హక్కు లేదనీ, వారిపై వచ్చిన ఆరోపణలు కేవలం నిరసన గొంతును వినిపించినందుకు కాదనీ, అందరికీ నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనడానికి ప్రాథమిక సాక్ష్యం ఉన్న కారణంగా పెట్టిన కేసనీ దానిలో తాము జోక్యం చేసుకోలేమనీ, మరో నాలుగు వారాల గృహ నిర్బంధం పొడిగించింది. ఈ లోపు, వారు కింది కోర్టుని ఆశ్రయించి అవసరమైన ఉపశమనం (బెయిల్‌ ) పొందవచ్చని తెలిపింది. అయితే మెజారిటీ తీర్పుతో విభేదించిన చంద్రచూడ్‌ ఆ 13 లేఖలు ఆధారాలుగా నిలవలేవని చెప్పడమే కాదు, మీడియా ద్వారా పోలీసులు చేసిన ప్రచారం ఉద్దేశపూర్వకంగా ఉందని, దీని మీద స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీంతో విచారణ జరపాలని ఆదేశమిస్తున్నట్లుగా రాశారు. కేసు దర్యాప్తులో ఉండగా మీడియాకు లేఖలు విడుదల చేసి ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి పోలీసులు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇదే అసలు తీర్పు. తెల్లారేసరికల్లా అసలు తీర్పు మైనారిటీ తీర్పయ్యింది. ప్రభుత్వం జోక్యం వల్లే తీర్పు మారిపోయింది. కారణం వాదోపవాదాల్లో ప్రభుత్వం, పోలీసుల కుట్ర బైటపడింది.

ప్రొఫెసర్‌ సాయిబాబా మొదలుకొని మావోయిస్టు బూచి చూపి చేసిన అన్ని అరెస్టులు కుట్రపూరితమనడానికి ఆధారాలు బైటపడ్డాయి. సుధా భరద్వాజ్‌ ప్రకాష్‌ అనే పేరుగల వ్యక్తికి రాసినట్టుగా చెప్పి మీడియాకి పోలీసులు విడుదల చేసిన ఉత్తరంలో 17 చోట్ల మరాఠీ కనిపిస్తుంది. ఆ భాష తెలియని సుధా భరద్వాజ్‌ ఆ లేఖ రాసే అవకాశమే లేదు. అలాగే ఆ ఉత్తరంపై తేదీలు కానీ, మెయిల్‌ లో పంపారనడానికి సంకేతాలు కానీ లేవు. ఈ ఉత్తరం నకిలీదని చెప్పడానికి ఇలా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వరవరరావు రాశాడని చెప్తున్న హిందీ లేఖలోనూ మరాఠీ పదాలున్నాయి. అసలాయనకు హిందీ రాయడమే రాదు, ఇక మరాఠీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన 13 ఉత్తరాలు ఇలాంటివే. ముఖ్యంగా సుధాభరద్వాజ్‌-కామ్రేడ్‌ ప్రకాష్‌ల మధ్య నడిచిన ఉత్తరం బోగస్‌ అని తేలడమేగాక ప్రొ. సాయిబాబా మీద పెట్టిక కేసులో మరో కీలకమైన తప్పుడు ఆధారం కూడా బైటపడే అవకాశం వచ్చింది. ఆయన కామ్రేడ్‌ ప్రకాశ్‌ అనే పేరుతో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అభియోగం మోపి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రధాని హత్య కుట్రకు సంబంధించిన లేఖల్లోని మావోయిస్టు నాయకుడు కామ్రేడ్‌ ప్రకాశ్‌, ప్రొఫెసర్‌ సాయిబాబా ఒకరే అయ్యేటట్లయితే హైసెక్యురిటీ జైల్లో ఉన్న సాయిబాబా ఈ నిందితులతో లేఖల ద్వారా ఎలా సంప్రదింపులు జరుపుతాడు? లేఖలైనా తప్పు కావాలి, సాయిబాబాపై పెట్టిన కేసైనా తప్పుడు కేసు కావాలి. కాబట్టి ఈ మొత్తాన్ని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే తీగలాగితే డొంక కదులుతుంది. ప్రొ. సాయిబాబా మీద పెట్టిన కేసు, భీమా కొరేగావ్‌ ఊరేగింపుపై హింసకు పాల్పడ్డారనే సాకుతో జున్‌ నెలలో అరెస్టు చేసిన రోనా విల్సన్‌, షోమాసేన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, మహేష్‌ రౌత్‌, సుధీర్‌ ధావ్లేల కేసు, ఆగస్టు 28నాటి ఐదుగురి కేసు అన్నీ బూటకపు కేసులని, పోలీసులు కుట్రపూరితంగా ఆపాదించినవేనని రుజువు అవుతాయి. సాయిబాబా మొదలుకొని ఆ తర్వాత అరెస్టు చేసిన పౌరహక్కుల కార్యకర్తలంతా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోంది. దీని ఫలితంగానే విడుదల కావాల్సిన వాళ్లను మరో నాలుగు వారాలు గృహనిర్బంధంలో ఉంచేలా కోర్టు తీర్పు వెలువడింది. ఈలోగా కింది కోర్టుల్లో బెయిల్‌ పిటషన్లు వేసుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించిన ప్రకారం ఢిల్లీ హైకోర్టులో గౌతమ్‌ నవలఖా, తెలంగాణ కోర్టులో వరవరరావు, హర్యానా కోర్టులో సుధాభరద్వాజ్‌ పిటిషన్లు వేశారు. మొదటి నుండి వీళ్లు చెబుతున్నదేమిటంటే సోదాల దగ్గర్నుండి అరెస్టుల దాకా అన్నీ చట్టవ్యతిరేకంగా జరిగాయని. మరాఠీలో వారెంట్లు తీసుకొచ్చి, సాక్షులుగా కూడా పూణే నుండి మనుషుల్ని ఎలా పట్టుకొస్తారు అని. అంటే ముద్దాయిలకు అర్థం కాని భాషలో ఏమైనా రాసి వాళ్ల సంతకాలు తీసుకోవచ్చని, పోలీసులు అన్ని పద్ధతులు ఉల్లంఘించారని. దీని మీద విచిత్రంగా మూడు కోర్టుల్లో మూడు రకాల తీర్పులొచ్చాయి. ఢిల్లీ హైకోర్టు గౌతమ్‌ నవలఖా అరెస్టు చెల్లదని తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. దీని మీద పూణే పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. వరవరరావు విషయంలో తెలంగాణ హైకోర్టు దీని మీద తాను జోక్యం చేసుకోనని సంబంధిత కోర్టులో పిటిషన్‌ వేసుకోమని మూడు వారాలు గృహనిర్బంధాన్ని పొడిగించింది. హర్యానా హైకోర్టు సుధాభరద్వాజ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. సుధాభరద్వాజ్‌తో పాటు అరుణ్‌ ఫెరేరా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌లు నేరుగా కేసు నమోదైన పూణే కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే నిన్న దానిని కొట్టివేశారు.

ఆగస్టు 28నాటి అరెస్టులను గృహనిర్బంధంగా మార్చడం దగ్గరి నుంచి న్యాయవ్యవస్థ సేఫ్టీ వాల్వ్‌ పాత్ర ఘనంగా పోషిస్తోంది. జైలు నిర్బంధం కంటే గృహ నిర్బంధం నయం కదా అనుకునేలా చేసింది. కాని అరెస్టుకు, హౌస్‌ అరెస్టుకు చిన్న తేడానే ఉంది. అరెస్టు ద్వారా పౌరులను జైల్లో నిర్బంధిస్తే, హౌస్‌ అరెస్టు ద్వారా ఇంటినే జైలుగా మారుస్తారు. పూర్తి కల్పిత, కుట్రపూరిత అభియోగాలు మోపి రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉంచి, కింది కోర్టుకు వెళ్లమని చెప్పడం, నేరం జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పోలీసుల కల్పిత లేఖలకు ఒక హోదా ఇవ్వడం మన అత్యున్నత న్యాయ వ్యవస్థ స్వభావాన్ని తెలియజేస్తోంది.

ఈ లేఖల పరంపర 13 సంఖ్య దగ్గరే ఆగిపోలేదు. జాన్‌లో అరెస్టయిన ఐదుగురి కేసు విచారణలో తాజాగా పోలీసులు మరో రెండు లేఖల్ని పట్టుకొచ్చారు. అవి మావోయిస్టు నాయకుడు గణపతి వరవరరావుకు రాసిన ఇ-మెయిల్‌, వరవరరావు దానికిజవాబుగా రాసిన ఇ-మెయిల్‌ అని ప్రకటించారు. కేసు బలహీనపడుతున్న కొద్దీ పోలీసులు కొత్త కొత్త మావోయిస్టు లేఖలు పట్టుకు వస్తున్నారు. వరవరరావుకు గణపతికి మధ్య ఈ మెయిల్‌లో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి ఉంటే మెయిల్‌ ఐడీల, ఇంటర్నెట్‌ సర్వర్‌ల దగ్గరి నుంచి దానికి సాక్ష్యాలు ఉండాలి. అవి నిజమైన లేఖలే అని ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీలో రుజువు కావాలి. ఏ సాక్ష్యం లేని గాలి ఆరోపణలు చేసైనా సరే ప్రజా ఉద్యమ కార్యకర్తలను జైల్లో పెట్టాలనే కుట్రబుద్ధితో పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి ʹఆధారాలుʹ సృష్టించి అవి నిరూపితం కాకపోయినా శిక్ష పడేలా చేయవచ్చొని ఆరెస్సెస్‌ అనుబంధ పూణే పోలీసు శాఖ ఇప్పటికే సాయిబాబా విషయంలో ఆచరించి చూపించింది. తమ కనుసన్నలలో కోర్టులు పనిచేయాలని సంఘపరివార్‌ ఫాసిస్టు ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకది చేయవలసిందంతా చేస్తోంది. కీలక కేసులతో వ్యవహరించే న్యాయమూర్తులు కూడా అనుమాస్పదంగా మరణించే ప్రమాదకర రోజుల్లో మనం జీవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ప్రతిపత్తితో ఉండవలసిన యూనివర్సిటీలు, కోర్టులు, సి.బి.ఐ- ఇలా అన్ని వ్యవస్థలనూ సంఘపరివార్‌ సమూలంగా నాశనం చేసేస్తోంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన తక్షణ ఆవశ్యకత ప్రజల మీద, ప్రజాస్వామిక సంస్థల మీద, మేధావుల మీద ఉంది. సాయిబాబా మొదలుకొని ప్రజల కోసం పనిచేస్తున్న నిస్వార్థ సామాజిక కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అందరూ కలిసి రావాలని విరసం విజ్ఞప్తి చేస్తోంది.

-విరసం

No. of visitors : 329
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •