పీక‌ నొక్కు సిద్ధాంతం

| సంపాద‌కీయం

పీక‌ నొక్కు సిద్ధాంతం

- సంఘ‌ర్ష్‌ | 03.11.2018 11:41:35am

ʹఎదిరించినోని పీకనొక్కుʹ సిద్ధాంతం ఫాసిజం అన్నాడు కాళోజీ. ఇప్పుడు దేశంలో అక్ష‌రాల అమ‌ల‌వుతున్న‌దీ ఈ సిద్దాంత‌మే. అస‌మ్మ‌తిని ఏమాత్ర‌మూ స‌హించ‌లేని పాల‌కుల ఏలుబ‌డిలో ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. రాజ్యాన్ని ప్ర‌శ్నించే వాళ్ల గొంతునొక్కి నిశ్శ‌బ్ధాన్నిశాశ్వ‌తం చేయాల‌నుకుంటున్నారు పాల‌కులు. సామాజిక ఆచ‌ర‌ణ‌లో ఉన్న స‌మూహాలు, వ్యక్తుల క‌ద‌లిక‌ల‌పై క‌న్నెర్ర జేస్తున్న రాజ్యం విద్యార్థి, యువ‌జ‌న‌, మ‌హిళా, హ‌క్కుల కార్య‌ర్త‌ల‌పై తీవ్ర నిర్భంధాన్ని ప్ర‌యోగిస్తున్న‌ది. తెలంగాణ‌తో పాటు కేంద్రంలోనూ అమ‌ల‌వుతున్న ఈ ఫాసిస్టు విధానాలు ఇప్పుడు ప్ర‌జ‌ల జీవించే హ‌క్కును కాల‌రాస్తున్నాయి.

ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగుల‌ను, గిట్టుబాటు ధ‌ర‌ల‌డిగినందుకు రైతులను, ఉచిత విద్య అడిగినందుకు విద్యార్థుల‌ను, స‌మాన‌త్వాన్ని ఆశించినందుకు మ‌హిళ‌ల‌ను, కుల ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించినందుకు ద‌ళితుల‌ను.. ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను జైళ్ల‌లో బంధిస్తోంది రాజ్యం. విశ్వ విద్యాల‌యాల స్వ‌యం ప్ర‌తిప‌త్తిని తాక‌ట్టుపెట్టిన పాల‌కులు విద్యార్థి ఉద్య‌మాల‌పై అణ‌చివేత‌ను ప్ర‌యోగిస్తున్నారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న వ‌రుస అరెస్టులే అందుకు నిద‌ర్శ‌నం. తెలంగాణ విద్యార్థి వేదిక అధ్య‌క్షుడు మ‌హేష్‌తో మొద‌లై.. డీఎస్‌యూ అధ్య‌క్షుడు బ‌ద్రీ, డీఎస్‌యూ స‌భ్యులు రంజిత్‌, సుధీర్‌, టీవీఎస్ అధ్య‌క్షుడు కోట శ్రీనివాస్‌, డీటీఎఫ్ క‌న్వీన‌ర్ బండి దుర్గా ప్ర‌సాద్‌ల‌పై అక్ర‌మ కేసులు మోపి జైళ్ల‌లో నిర్భందించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇంచుమించు అంద‌రిపైనా ఊపా కేసులు మోపింది. ఇప్ప‌డు తాజాగా తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్‌, తెలంగాణ యువ‌జ‌న స‌మాఖ్య నాయ‌కుల‌పైనా ఊపా కేసులు మోపి జైళ్ల‌లో బంధించింది.

అక్టోబ‌ర్ 30న తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మెంచు ర‌మేష్‌ను హైద‌బాద్ న‌డిబొడ్డు నుంచి ఎత్తుకెళ్లిన‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖ‌మ్మం కొత్త‌గూడెం జిల్లాలో ఊపా కేసులో నిందితుడి చూపించారు. అంత‌కు రెండు రోజుల ముందుకు చ‌ర్ల మండ‌లంలో న‌లుగురు యువ‌కుల‌ను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వ‌ద్ద పేలుడు ప‌దార్థాలు ల‌భించాయ‌ని, వాటిని మావోయిస్టుల‌కు చేర‌వేసేందుకు య‌త్నిస్తున్నార‌ని అక్ర‌మ‌కేసులు మోపారు. వారికి పేలుడు ప‌దార్థాల‌ను తెలంగాణ ప్ర‌జా ఫ్ర‌జా ఫ్రంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మెంచు ర‌మేష్‌, తెలంగాణ యువ‌జ‌న స‌మాఖ్య అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు మోహ‌న్‌రాజ్‌, పాండులు అంద‌జేశార‌ని ఆరోపిస్తూ వారిపై ఊపా కేసును న‌మోదు చేశారు.

ఏ విద్యార్థులైతే... తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో ముందు నిలిచిపోరాడారో... ఇవాళ ఆ విద్యార్థి నాయ‌కులే దేశ‌ద్రోహుల‌య్యారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌డం వీళ్లు చేసిన నేరం. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంచ‌మ‌ని అడ‌గ‌డం వీళ్లు చేసిన నేరం. కేజీ టూ పీజీ ఉచిత విద్య అడ‌గ‌డం, ఓపెన్ కాస్ట్‌ల‌ను ర‌ద్దు చేయ‌మ‌ని అడ‌గ‌డం వీళ్లు చేసిన నేరం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేయ‌డం వీళ్లు చేసిన నేరం. అందుకే... ఇప్పుడు రాజ్యం వీళ్ల‌పై క‌క్ష‌గ‌ట్టింది. వీళ్ల గొంతునొక్కేందుకు య‌త్నిస్తోంది.

ఇంత‌కూ తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ నాయ‌క‌త్వంపై, ప్ర‌జా ఫ్రంట్ భాగ‌స్వామ్య సంఘాల‌పై రాజ్యం ఎందుకంత క‌క్ష‌సాధింపు దోర‌ణిని అవ‌లంభిస్తోంది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మాన్ని ర‌గిలించిన జ‌నస‌భ స్ఫూర్తితో ఆవిర్భ‌వించిన ప్ర‌జా ఫ్రంట్ ఆది నుంచీ ఓట్ల రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేదని చెబుతూనే ఉంది. భౌగోళిక తెలంగాణ‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావంటూ ప్ర‌చారం చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం కూడా. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఏ సైద్ధాంతిక అవ‌గాహ‌న‌తో ప‌నిచేసిందో... ఇప్ప‌టికీ అదే అవ‌గాహ‌న‌తో ప్ర‌జా ఫ్రంట్ ప‌నిచేస్తోంది. ప్ర‌జాస్వామిక తెలంగాణ‌లోనే ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతోంది. ఆ దిశ‌లో ప్ర‌జా పోరాటాల‌ను నిర్వ‌హిస్తోంది. అలాంటి సంస్థ ఆచ‌ర‌ణ అంటేనే అధికార ప‌క్షానికి భ‌యం ప‌డుతుంది. ప్ర‌జ‌లను చైత‌న్యం చేసే ఏ ఆచ‌ర‌ణ‌నూ రాజ్యం అనుమ‌తించ‌దు. అంద‌కే.. ప్ర‌జా ఫ్రంట్ నాయ‌క‌త్వంపై నిర్భందాన్ని ప్ర‌యోగిస్తున్న‌ది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ అధికార పార్టీని ఓట‌మి భ‌యం వెన్నాడుతోంది. అందుకే.. ప్ర‌జా ఫ్రంట్ కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకోవాల‌ని జూస్తోంది. ఓట్ల‌కోసం వ‌చ్చే రాజ‌కీయ నేత‌ల‌ను నిల‌దీయండంటూ ప్ర‌జా ఫ్రంట్ చేప‌ట్టిన జ‌న చైత‌న్య యాత్ర‌ను అడ్డుకునే కుట్ర‌లో భాగంగానే మెంచు ర‌మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స‌రిగ్గా యాత్ర ప్రారంభ‌మ‌వ‌డానికి ఒక రోజు ముందు ప్ర‌జా ఫ్రంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మెంచు ర‌మేష్‌ని అరెస్టు చేసి... ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌ల‌ను సృష్టించాల‌నుకున్నారు. దాదాపు 300 మంది కార్య‌క‌ర్త‌ల‌తో 17 బృందాలుగా 2వేల గ్రామాల్లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు ప్ర‌జా ఫ్రంట్ ప‌య‌న‌మైంది. అరెస్టులు ప్ర‌జ‌ల పోరాట ప‌టిమ‌ను అడ్డుకోలేవ‌ని మ‌రోమారు నిరూపిత‌మైంది.

No. of visitors : 434
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •