చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?

| సాహిత్యం | వ్యాసాలు

చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?

- పాణి | 03.11.2018 11:47:33am

గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ఆశ్చర్యమేమీ కాదు. అయినా మాట్లాడుకోవాల్సిందే. గద్దర్ కాంగ్రెస్లో చేరడం ఆయన వ్యక్తిగత నిర్ణయం. అలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉ ంటుంది. అయితే గద్దర్ ఒకప్పుడు విప్లవోద్యమంతో ఉన్నాడు. అందువల్ల ఆయన నిర్ణయం సామాజికం. ఆయన తన రాజకీయ అభిప్రాయాలు మార్చుకున్నందువల్ల చర్చనీయాంశం అయింది. కొందరు పనిలో పనిగా విప్లవోద్యమం మంచి చెడ్డల గురించి మాట్లాడుతున్నారు. ఏ చర్చనైనా స్వాగతించాల్సిందే.

ఇక్కడ బయల్దేరితే తప్పక గంభీరమైన తీరానికి చేరుకుంటాం. కాబట్టి ముక్కలు ముక్కలుగా అభిప్రాయలు ప్రకటిస్తే సరిపోదు. ఉదాహరణకు విప్లవోద్యమంలో అగ్రకుల నాయకత్వం ఉన్నందు వల్లే గద్దర్ అక్కడ ఉండలేక కాంగ్రెస్ లోకి వెళ్లాడనే అభిప్రాయం దగ్గర దగ్గర ఆరంభిద్దాం. కాంగ్రెస్ పార్టిలో దళిత బహుజన నాయకత్వాన్ని వెతుక్కుంటూ గద్దర్ వెళ్లాడని చెప్పదల్చుకున్నారు. కానీ అంతేనా? ఇలా చూస్తే సరిపోతుందా?

ఇక విప్లవాన్ని ఇష్టపడే వాళ్లయితే గద్దర్ కాంగ్రెస్ లోకి పోవడానికి విప్లవోద్యమమే కారణమని బోను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేరానికి తగిన భాషలో వాళ్లు మాట్లాడితే బాగుండు. అందరూ సున్నితంగా, జాగ్రత్తగా, బాధ్యతగా, క్రిటికల్గా, నిజాయితీగా మాట్లాడాలని కోరుకునే వాళ్లం కదా? ఒక గంభీరమైన విషయంలోకి వెళ్లినప్పుడు ఏ గొంతుకతో మాట్లాడతాం? వాదనకు ఏ ఆధారాలను తీసుకొచ్చుకుందాం? అనేవి ముఖ్యం. కనీసం మనం మాట్లాడేవి మనకే ఎదురెక్కి వచ్చే పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు.

విప్లవోద్యమం నుంచి ఎవరైనా వెళ్లిపోయినప్పుడు, లేదా బూర్జువా పార్టీల్లో కలిసిపోయినప్పుడు చాలా సాదాసీదాగా ఒక మాట అంటారు. ʹనీ మాటలు నమ్మి నీ వెంట వచ్చి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటే నీవు తట్టాబుట్టా సర్దుకోని వస్తవా?ʹ అని. విప్లవాచరణ కొనసాగిస్తూ బైట ఉన్న వాళ్లను ఉద్దేశించి కూడా మీ మాటలు విని ఉద్రేకంతో ఉద్యమంలోకి పోయినవాళ్లు చచ్చిపోతరు. మీరు మాత్రం బైట కులాసగ ఉంటరా?ʹ అంటారు.

ఈ మాటలు బిడ్డల్ని కోల్పోయిన తల్లులు, ఉద్యమ ప్రాంతంలో రిస్క్ అనుభవిస్తున్న జనం అనడంలో ఒక అర్థం ఉంది. వాళ్ల వరకు ఈ మాట లోతైనదే. అయితే మేధో రంగంలో ఉన్నవాళ్లు ఆ మాటలతో సరిపెట్టడానికి లేదు. కాస్త లోతుగా చూడాలి. అన్ని విషయాలను మామూలు జనాలకంటే భిన్నంగా, లోతుగా చూడాలని ప్రయత్నించే వాళ్లం కదా? ఆ పని ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు?

ఈ మాట ఇప్పుడు గద్దర్ ను సమర్థించేందుకు కాదు, మావోయిస్టుపార్టీ మీద వస్తున్న విమర్శలను అడ్డుకోడానికీ కాదు.

ʹనీ పాటల వల్ల, నీ మాటల వల్ల..ʹ అనే మాట బైటికి సరైందే కావచ్చు. అట్ల రాలిపోయిన వాళ్లలో మన పిల్లలే ఉ ండనక్కర్లేదు. ఇతరుల పిల్లల గురించీ అంతే సున్నితంగా, బాధ్యతగా మాట్లాడవచ్చు.

ఎవరి మాటలో, పాటలో విని ఉద్యమంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నామంటే అలా వెళ్లిపోయిన వాళ్ల చైతన్యాన్ని, సాహసోపేతమైన స్వీయ నిర్ణయాన్ని, అలా నిర్ణయం తీసుకోవడం వెనుక పని చేసిన విలువలను, విశ్వాసాలని ఘోరంగా అవమాన పరిచినట్టు కాదా? దీని వెనుక ఇంత అనుచితమైన అర్థం ఉందనే ఎరుక మనకు ఉందా? అంతిమంగా మనుషులు తమ స్వీయ చైతన్యంతో విమర్శనాత్మక ఆచరణలోకి మళ్లే నిర్ణయాలే భౌతికశక్తిగా మారుతాయని మనందరికి తెలుసు. కానీ వేల మంది నిర్ణయాలను ఇలా కించపరచడం తగునా? అనే సందేహం మనకు ఎందుకు కలగడం లేదు?


ఈ మాట ఎక్కడి దాకా పోతుందో గమనించాలి. అజ్ఞాతంలో పని చేసి బైటికి వచ్చినవాళ్లకు, గద్దర్ లాంటి వాళ్లకు, ఇంకా అలా విప్లవాన్ని కోరుకుంటూ బైట పని చేస్తున్న వాళ్లకే కాదు, ఈ విమర్శలు చేస్తున్న వాళ్లకూ ఇది పూర్తిగా వర్తిస్తుంది. అందరికీ సమానంగా వర్తిస్తుంది. తేడా ఉండదు. ఎలాగో చెబుతాను.

ఇప్పుడు ఈ మాటలు అంటున్న వాళ్లు కూడా తమ జీవితం పొడవునా ఒక్కో సందర్భంలో ఒక్కో రూపంలో రాజకీయ ఆచరణ కొనసాగిస్తూ వచ్చి ఉంటారు. రాస్తూ, మాట్లాడుతూ ఉంటారు. అది ఇతరుల మీద ప్రభావం వేయకుండా ఎందుకు ఉంటుంది? ఒక గద్దర్ పాటే ప్రభావం వేసి మీ మాటలో, రచనలో, ఆచరణ్ ప్రభావం వేయకుండా ఎందుకు ఉంటాయి? మీ పరిచయాల్లోనో, పరోక్ష ప్రభావాల్లోనో ఉద్యమాల్లోకి వెళ్లి అర్ధాంతంగా రాలిపోయి ఉంటారు కదా. మరి మీరు మాత్రం ఇక్కడ భద్రంగానే ఉన్నారు కదా? .. అనేంత దూరం పై వాదన విస్తరిస్తుంది.

గద్దర్ కో, అజ్ఞాత విప్లవం నుంచి బైటకి వచ్చిన వాళ్లకో వేసే ఈ ప్రశ్న మీకూ వర్తిస్తుంది. మన అందరికీ వర్తిస్తుంది. అంతే సున్నితంగా వర్తిస్తుంది. ఇతరులకే దీన్ని ఆపాదించి మీరు తప్పుకోవాలంటే కుదిరేది కాదు. చర్చ అక్కడిదాకా వెళ్లడమంటే నైతిక సరిహద్దులోకి వెళ్లడమే. ఉద్యమాలకు, అందులో, దాని చుట్టూ పని చేసే వాళ్లకు తప్పక నైతికత ఉ ండాల్సిందే. లేకపోతే లోపమే. కాని ఇంత లోతైన, మానవ చైతన్యానికి, ఆచరణకు సంబంధించిన విషయాలను నైతిక స్థాయికి కుదించడం సాధ్యమా? అదే జరిగితే ఆ నైతిక చట్రంలోంచి తప్పుకోవాలని ఎవరు, ఏ వాదన చేసినా నమ్మశక్యం కాదు.

ఈ తరహా వాదన ఎలా ఉంటుందంటే ఒకప్పుడు విప్లవ పార్టీల్లో పని చేసి బైటికి వచ్చిన వాళ్లు ఇప్పుడు ఆ ఉ ద్యమాలంటేనో, వాటి సానుభూతిపరులంటేనో గిట్టక ఇదే వాదన చేస్తుంటారు. వాళ్లు తీసుకొనే ఈ వైఖరికి అర్థం ఏమంటే - తాము ఆరోజుల్లో ఉద్యమంలోకి వెళ్లింది కూడా తమ చైతన్యంతో కాదు, అవగాహనతో కాదు. ఎవరో ప్రేరేపిస్తే దారి తప్పి వెళ్లిపోయామని, మళ్లీ ఎవరో చెబితే బైటికి వచ్చామని ఒప్పుకున్నట్లు కాదా? తాము లోపలికి పోవడంలో, రావడంలో కూడా తమ ప్రమేయం ఏమీ లేదని అంగీకరించినట్లవుతుంది.

ఈ రోజు ఆ ఉద్యమాలపట్ల ఏ అభిప్రాయాలైనా ఉండవచ్చు. కానీ ఒకప్పుడు అదే శ్వాసగా, జీవితంగా, జీవన్మరణ సన్నివేశాల్లో కొనసాగించిన ఆచరణను ఇంతగా అవమానించుకోవడం తగునా? ఆనాటి ఆచరణతో తమ హృదయానికి, జ్ఞానానికి, నిర్ణయానికి, అనుభవానికి ఏ సంబంధం లేదని చెప్పుకోవడం ఎంత స్వీయ హననం? ఎంత స్వీయ అవమానం? ఇప్పటి అవగాహన ప్రకారం ఎవరినో, దేన్నో నిందించాలనుకొని సారాంశంలో ఏం ప్రతిపాదిస్తున్నారు?

అయితే ప్రభావాలు ఉండవా? ప్రేరణలు ఉండవా?

ఎందుకు ఉండవు. తప్పక ఉంటాయి. పాటలు, మాటలు, కవిత్వాలు, మనుషుల స్పర్శలు, సంభాషణలు తప్పక ఉద్వేగానికి లోను చేస్తాయి. లేకపోతే ఇన్ని పాటలు, పద్యాలు, సభలు సమావేశాలు ఎందుకు? అత్యంత హేతుబద్ధ స్పృహతో జీవన్మరణ సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి వాటి ఉద్వేగం, ప్రభావం ఉంటాయి. ఏ ప్రభావం లేని శూన్యాన్ని సృష్టించుకొని ఎవ్వరూ జీవించలేరు. ఇప్పుడు ఈ విమర్శలు ప్రకటిస్తున్న వాళ్లను కూడా ఎవరి మాటలో, ఎవరి పుస్తకాలో, తెలిసీ తెలియని వాళ్ల చావులో ప్రభావితం చేసి ఉంటాయి. వాళ్లు మిమ్మల్ని ప్రభావితం చేసి ఎక్కడున్నారో, ఏమైపోయారో, మీరు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉనారో అకౌంట్స్ సెటిల్ చేసుకోవడం సాధ్యమయ్యేదేనా?

ఇవేవీ మాట్లాడకుండా కేవలం ప్రభావాల గురించే మాట్లాడుకుంటే నిజాయితీ అనిపించుకోదు.

ప్రభావాలు అనేడి అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. అనేక ప్రభావాల ఒరిపిడి నుంచి నిర్మాణమయ్యే వ్యక్తిత్వ క్రమాన్ని, చైతన్యయుతమైన మానవ ఆచరణకు ప్రేరేపించే విలువలను, విశ్వాసాలను, అవగాహనలను ఎలా చూడాలి? గద్దర్ పాట విని ఎవ్వరూ విప్లవంలోకి పోలేదన్నా తప్పే. వ్యక్తుల స్వీయ చైతన్యాన్ని, సంసిద్ధతనీ తక్కువ చేసినా తప్పే. ఉద్యమాల్లోకి రావడం, పోవడం కూడా అంతిమంగా వ్యక్తి సంసిద్ధత, చైతన్యానికి సంబంధించిన విషయం. మన అవసరం కోసం ఇప్పుడు వ్యక్తీ పాత్రను చూడ నిరాకరిస్తే.. ఈ వాద పద్ధతి మనలను ఎక్కడికి చేర్చుతుందో గమనించాలి.

ఇప్పుడు గద్దర్ విషయంలో విప్లవోద్యమాన్ని బోనెక్కించి మాట్లాడుతున్న వాళ్లు కూడా ఈ రాజకీయాల్లోకి రావడానికి ఈ సంక్లిష్ట క్రమమే కారణం. తమతోపాటు పని చేసినవాళ్లలో కొందరి వలె అజ్ఞాత ఉద్యమంలోకి వీళ్ళు వెళ్లకపోవడానికి కూడా ఇదే కారణం. కొందరిని పూర్తికాలం కార్యకర్తల్లాగా తయారు చేసి, మరి కొందరిని తయారు చేయకపోవడం విప్లవోద్యమం లోపమని అంటే కరెక్టు అవుతుందా?

బైటి ప్రభావాలే అంతిమ నిర్ణాయకమని మాట్లాడటం ఎవరి విషయంలోనూ సరైంది కాదు.

కాబట్టి ప్రభావాలది ఎప్పుడూ రెండో స్థానమే. ఇంకో వైపు నుంచి చూస్తే .. ఒక పాటకు, ఒక మాటకు ఉన్న ప్రభావశక్తి కూడా ఆ వ్యక్తులది మాత్రమే కాదు. అనేక కారణాల వల్ల వాటికి ఆ శక్తి వస్తుంది. ముఖ్యమైన కారణం ప్రజా పోరాటం. ప్రజల భాగస్వామ్యం. వాళ్ల త్యాగం. దాన్నుంచి ఒక వ్యక్తి మాటకు, పాటకు శక్తి వస్తుంది. ప్రభావం వేస్తుంది. ఈ క్రమంలో ఏ మేరకు భాగమైతే ఆ మేరకు ఆ వ్యక్తుల మాటలకు, పాటలకు ఆ శక్తి వస్తుంది. ప్రభావానికి గురి కావడమంటే కూడా ఈ క్రమంలోకి రావడమే. అలా వచ్చిన వాళ్ల అవగాహనలు, సంసిద్ధతలు వాళ్ల స్వీయ వ్యక్తిత్వ నిర్మాణాన్నిబట్టి, దాని విలువల పునాదినిబట్టి ఉ ంటాయి. అంటే ఒక వ్యక్తికి తన చుట్టూ సిద్ధంగా ఉన్న ప్రపంచంపట్ల, వారసత్వంగా అందిన ప్రపంచంపట్ల విమర్శనాత్మక, ఆచరణాత్మక వైఖరి ఎంత ఉంటే అంతగా సొంత వ్యక్తిత్వం నిర్మించుకోడానికి ఆస్కారం ఉంటుంది. మనిషులు తమను తాము మార్చుకుంటూ, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడం ఈ విమర్శనాత్మక ఆచరణ వల్లే సాధ్యమవుతుంది. అది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ప్రజలు అనే కలెక్టివకు వర్తించేది. వ్యక్తులు తమ ఆచరణను ఈ కలెక్టివ్ దిశగా నిర్మించుకోడానికి ఈ సమాజంలోంచే అనేక ప్రభావాలు దోహదపడతాయి.

కొందరు వ్యక్తులు కొద్ది కాలమయ్యాక ఈ విమర్శనాత్మక ఆచరణ క్రమం నుంచి తప్పుకోవచ్చు. అలా తప్పుకుంటున్నప్పుడు వాళ్లు అంత కాలం కొనసాగిన కలెక్టివ్ కు ఏం వివరణ ఏమిస్తారు? అసలు ఇస్తారా? లేదా? అనేది వాళ్ల నిజాయితీనిబట్టి ఉంటుంది. వాళ్లు ఏ వివరణ ఇవ్వనప్పుడు, లేదా హేతుబద్ధ వివరణ ఇవ్వనప్పుడు అప్పటి దాకా వాళ్లు కొనసాగిన కలెక్టివ్ గాని, చుట్టూ ఉన్న సమాజం కానీ అడుగుతుంది. మామూలు మాటల్లో ప్రజలు తమకు తోచిన పద్దతిలో అడుగుతారు. ఆ వ్యక్తులు ఎక్కువ ప్రభావశీలమైన వాళ్లయితే, మీ మాటల వల్ల, పాటల వల్ల మా పిల్లలు మీతోపాటు ఉద్యమంలోకి వెళ్లి చనిపోయారు. మీరు ఇలా తయారవుతారా? అని ఆ కుటుంబాల వాళ్లు అడుగుతారు. వాళ్ల తరపున ఇతరులు కూడా అడుగుతారు. ముందే అన్నట్లు ఇది ఒక తలానికి చెందిన ప్రశ్న మాత్రమే. అంతకంటే దాన్ని ఎక్కువ చేసినా, అదే సర్వస్వమనుకున్నా పైపై విషయాలతో సరిపెట్టుకున్నట్టవుతుంది. ముఖ్యంగా ఉ ద్యమాలకు మేధో రంగంలో అండదండలందించే వారైతే ఈ మాటలతో సరిపెట్టుకోవడం కుదరదు.

మళ్లీ గద్దర్ దగ్గరకే వస్తే ఆయన చైతన్యంలో, మౌలిక అవగాహనల్లోనే మార్పు రావడం వల్ల కాంగ్రెస్ లో చేరడం, లేదా ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ మద్దతు కోరడం జరిగాయి. అది ఏదైనా సరే రూపంలో తేడా. అంతే.

| గద్దర్లోని ఈ పరిణామానికి విమర్శకులు విప్లవోద్యమంలో కారణాలు వెతుకుతున్నారు. విప్లవ పార్టీలో దళిత బహుజన నాయకత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది అన్నట్లే ఇదీ ఉంది. అంటే కారణాన్ని ఇంకో వైపు నుంచి విప్లవోద్యమంలో చూపడం. విప్లవ సంబంధమైన ఏ విషయాన్నయినా అటు విప్లవోద్యమంలోనో, లేదా సమాజంలోనో వెతకాల్సిందే. అభ్యంతరం దానికి కాదు, వెతుకుతున్న తీరుకు. విప్లవ పంథా గురించి, ఎన్నికల బహిష్కరణ రాజకీయాల్లోని లోటుపాట్ల గురించి ఎంతైనామాట్లాడుకోవచ్చు. అది పూర్తిగా వేరే విషయం. వాటికి గద్దర్ కాంగ్రెస్ లోకి పోవడానికి ఏ సంబంధమూ లేదు. అట్లాగే గద్దర్ సందర్భంలో విప్లవ రాజకీయాల్లో ఉంటూ శతృ పక్షంలో కలిసారని కొందరిని ప్రస్తావించి, అలాంటి వాళ్లను కూడా తన వాళ్లే అని విప్లవోద్యమం అనుకుంటోందని ఆరోపిస్తున్నారు.

మొదట తెలుసుకోవాల్సిందేమంటే- శతృ పక్షం చేరిన వాళ్లను విప్లవోద్యమం తన వాళ్లని ఎప్పటికీ అనుకోదు. రాజ్యం పట్ల, వ్యవస్థ పట్ల విప్లవోద్యమానికి కచ్చితమైన వైఖరి ఉంది. అది జీవన్మరణ పోరాటానికి సంబంధించింది. దీర్ఘకాలిక సామాజిక పరిణామానికి సంబంధించింది. విప్లవోద్యమ సృహ కనీసంగా ఉన్న వాళ్లకు కూడా తెలిసే చాలా మామూలు విషయం, ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు. గద్దర్లాగే సంవత్సరాల కింద, దశాబ్దాల కింద విప్లవాభిమానాన్ని వదిలేసుకొని తమ పద్ధతిలో తాము జీవిస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లను విప్లవోద్యమం తన వాళ్లని అనుకుంటుందనడం అభ్యంతరం.

వాళ్లు ఆ రోజుల్లో అలా తయారు కావడానికి విప్లవోద్యమమే కారణమని చెప్పదల్చుకున్నారా? అదే అయితే ఉద్యమం ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరిస్తుందో గుర్తు చేసుకోవాలి. తనతో ఉన్న వాళ్లలో అభ్యంతరకరమైన ధోరణులు తలెత్తితే ఉద్యమం ముందు గుర్తింపజేస్తుంది. సవరించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ల పొరబాటు అవగాహనలను, పనులను చర్చకు పెట్టి అర్థం చేయిస్తూ, సరిదిద్దుతూ, నిష్కర్షగా విమర్శిస్తుంది. దానికి ఒక క్రమాన్ని పాటిస్తుంది. తమ తప్పులు తెలుసుకునేలా చేస్తుంది. ఎక్కడో ఒక చోట మనుషులను నిలబెట్టుకోడానికి, వాళ్ల వ్యక్తిత్వం పటిష్టం కావడానికి కృషి చేస్తుంది. లోపాలు గుర్తించిన వాళ్లను.. ఏ మేరకు గుర్తిస్తే ఆమేరకే కలుపుకపోతుంది. ఒక విస్తృత ప్రజా ఉద్యమంలో కలిసిరాగల వాళ్లందరితో ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుందో వీళ్లతో కూడా అంతే. అసలే తప్పులు గుర్తించని వాళ్లను పూర్తిగా పక్కన పెడుతుంది. తప్పులు గుర్తింపజేయడం, సవరింపచేయడం, ఆలోచించేయడం అనే సుదీర్ఘ క్రమం లేకపోతే ఇన్ని దశాబ్దాలపాటు ఇన్ని లక్షల వ్యక్తిత్వాలతో కలిసి నడవడం, నడపడం ఉద్యమానికి సాధ్యమయ్యేది కాదు. వ్యక్తిత్వాలను నిర్మించడం అనే అనే ప్రక్రియ సుభాషితాలు వల్లించేది కాదు. అత్యంత ఆచరణాత్మకమైనది. వ్యక్త్కిత్వం అనే మాట రాజకీయ విశ్వాసాల దాక విస్తరించి ఉంటుంది.

రాజకీయంగా ఊగిసలాడే వాళ్లతో, తప్పులు చేసిన వాళ్లతో విప్లవోద్యమం జరిపే రాజకీయ సంవాదానికి గద్దర్ కంటే ఉ దాహరణ ఏముంటుంది? ఆయనలో రాజకీయ ఊగిసలాట దాదాపుగా రెండు దశాబ్దాలుగా సాగుతోంది. ఆయన జారిపోకూడదని, విప్లవంలో నిలబడాలని పార్టీ సుదీర్ఘమైన ప్రయత్నం చేసింది. ఏ నిర్మాణమైనా వ్యక్తులను కాపాడుకోడానికి ఓపికగా ఇలాంటి ప్రయత్నాలే చేస్తుంది. బహుశా ఎవ్వరి విషయంలో అయినా ఇలాగే ఉంటుంది.

విప్లవ నిర్మాణాల పరిచయం ఉన్నవాళ్లందరికీ ఈ మాత్రం తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం, పార్టీ, ప్రజలు కూడా ఇలాంటి విమర్శనాత్మక సంఘర్షణ క్రమంలోనే అసలైన విప్లవ శక్తిగా రూపొందడం సాధ్యమని ఆచరణాత్మకంగా నాయకత్వానికి తెలుసు. లేకపోతే ఇన్నేళ్లపాటు కరకు నిర్బంధంలో, అపారమైన నష్టాల మధ్య కూడా నిర్మాణం కొనసాగడం, విస్తరించడం, తన విలువల పునాదిని పటిష్టపరుచుకోవడం, విప్లవశక్తిగా ఎదగడం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి? వాళ్ల తప్పులను ఎలా సవరించాలి? అంతిమంగా వ్యక్తులను సంఘటితశక్తిగా ఎలా తీర్చిదిద్దాలి? అనే స్పృమే నిర్మాణానికి ప్రాణం.

ఎందుకంటే తనతోపాటు పని చేసే వాళ్లు రకరకాలుగా తయారైపోతే నాలుగు రాళ్లు వేసి సరిపెట్టుకుందామని విప్లవోద్యమం అనుకోదు. లేదా అయ్యో.. అయ్యో మనుషులు ఇట్లా తయారువుతున్నారేంటి? అని విషాదంలోకి జారిపోదు. ఎవర్ని నమ్ముతాం.. ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియదు కదా, అందరూ ఇంతేనా? అనే సంశయవాదానికి, శుష్క పరిశుద్ధవాదానికి లోనుకాదు. వ్యక్తులందరూ పటిష్టమైన సొంత వ్యక్తిత్వంతో కలిసి ఉద్యమం వ్యక్తిత్వాన్ని సంతరించుకొని నిర్వహించాల్సిన చారిత్రక బాధ్యతకు తగిన ఆచరణాత్మక క్రమాలను రూపొందించుకుంటుంది. అవి కూడా మేధావుల ప్రవచనాల్లా ఏకాఎకి తయారు కావు. ఆచరణలోకి రావు. విలువల సారాన్ని తెలుసుకుంటూ, వాటిని పటిష్టపరుస్తూ, వాటిని కేవల నైతిక తలానికంటే ఉన్నతమైన నిర్మాణ ఆచరణల తలానికి తీసికెళుతుంది.

కాబట్టి గద్దర్ విషయంలో సుమారు రెండు దశాబ్దాలుగా విప్లవోద్యమం ఎంత ప్రయత్నించిందో తెలుసుకోవాలి. ఇదేదీ దాపరికం కాదు. ఏ వ్యక్తితోనైనా సూత్రబద్ధంగా ఇట్లాగే వ్యవహరిస్తుంది. గద్దర్ విషయంలో ఇంకా ఎక్కువ కాలం ఓపిగ్గా చర్చ చేసింది. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ములైన కొందరు వ్యక్తుల వ్యవహారం కాదు. ఇది ఏ ఒక్కరి సొంత విషయం కాదు. ఎవరి సామాజిక ఆచరణను మరెవరూ రద్దు చేయలేరు. దాన్ని తీర్చిదిద్దాల్సిందే. విమర్శనాత్మకంగా వ్యవహరిస్తూ ఎంత వరకు కలిసి నడిస్తే అంత వరకు కలిసి పని చేస్తారు. తప్పుల పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? అనేదే ఆచరణకు గీటురాయి. కానీ గద్దర్ ఎక్కడా మిగలలేదు. చివరికి తానే వెళ్లిపోయాడు.

ఏ విషయంలోనైనా మన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, ఇష్టా ఇష్టాలు ఎలా ఉన్నా వాస్తవ సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. దేన్నయినా నిర్దిష్టంగా మాట్లాడాలనుకుంటాం కదా. గద్దర్ విషయంలో కూడా అలాగే ఉండాలి. ఎన్ని విమర్శలయినా పెట్టవచ్చు. ఎక్కడి నుంచైనా కారణాలు వెతకవచ్చు. అయితే వాటికి సంబంధం ఉండాలి. దీర్ఘకాలిక పరివర్తన క్రమం మీద, స్థూల అంశాల మీదే కాదు, ఆచరణలోని నిర్దిష్ట అంశాల మీద కూడా హేతుబద్ధంగా ఆలోచించాలి.

అయినా గద్దర్ పరిణామాన్ని ప్రశ్నించాల్సింది గద్దర్ నే కాని విప్లవోద్యమాన్ని కాదు.

రాజ్యాంగం పేరుతోనే బూర్జువా నియంతృత్వం నడుస్తున్న తరుణంలో నీవు ఇలా రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని ఉరేగడం గురించి ఏమి వివరణ ఇస్తావు? ఇంతకూ నీ అభిప్రాయాల్లో మార్పు గురించి ప్రజలకు చెప్పేది ఏమైనా ఉందా లేదా? అని అడగాలి .

పార్లమెంటరి వాదులకు ఆయన మార్పు ఆనందం కావచ్చు. పార్లమెంటరి మార్గం ఎన్నుకున్న దళిత వాదులకు సంబరం కావచ్చు. అందరు కలసి రాజ్యాంగ వాదాన్ని యెంత బలపరిచినా దాని ఫాసిస్టు స్వభావం దాచేస్తే దాగేది కాదు.

ఒక వేళ విప్లవోద్యమాన్ని కూడా అడగాల్సిందే అనుకుంటే .. ఇలాంటి పరిణామాల మీద మీ సూత్రబద్ధ వైఖరి ఏమిటి? అని అడగవచ్చు. తప్పేమీ లేదు. ఆ విషయంలో ఉద్యమానికి సంశయం ఉండదు. ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరిస్తుందో, తన ప్రమాణాలు, వైఖరులు ఏమిటో, కాల క్రమంలో అవి ఎలా మారుతున్నాయో కుడా చెబుతుంది. గద్దర్ ఏ ధోరణులకు గురయ్యాడో చెబుతుంది. ప్రభావశీలమైన కళాకారుడు కాబట్టి గద్దర్ సందర్భంలో సమాజం ఇంతగా ఆలోచిస్తోంది గాని, ఉద్యమమైతే ఇలాంటి మార్పుకు గురైన అందరి విషయంలోనూ ఒకే రకమైన పద్ధతి పాటిస్తుంది. అదే వివరణ ఇస్తుంది.

ఇక ఎన్నికల బహిష్కరణ రాజకీయాల గురించి కూడా చర్చ వచ్చింది కాబట్టి ఒక్క మాట దాని గురించీ చెప్పాలి. భారత విప్లవోద్యమం ముందు చారిత్రక కారణాల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక ముఖ్యమైన ప్రత్యేకతగా నిలబడింది. అందులో ఒకటి ఎన్నికల ప్రహసనం. బూర్జువా ఎన్నికల విధానాన్ని అధిగమించి విప్లవ క్రియాశీలత పెంచడం అనే లక్ష్యం ఎన్నికల బహిష్కరణలో ఉ ంది. దాన్ని అంతవరకే చూడాలి. ఆచరణలో బహిష్కరణ ప్రభావం ఎలా ఉన్నా, లోటుపాట్లు ఎన్ని జరిగినా పాల్గోనడమా, బహిష్కరించాడమా అనే రెండు మార్గాలే ఉంటాయి. కొన్ని విప్లవ పార్టీలు ఎన్నికల్లో ఎత్తుగడగా పాల్గొంటూ వచ్చాయి కూడా. ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ మీద విమర్శ పెట్టదల్చుకుంటే ... పరమ జుగుప్సాకరమైన ఎన్నికల మీద ఇంత కంటే మెరుగైన ఆచరణాత్మక విప్లవ వైఖరి ఏమిటో ముందుకు తేవాల్సి ఉంటుంది.

ఒక వేళ మావోయిస్టు ఉద్యమ పంథానే తప్పుకావడం వల్ల, నాయకత్వం అహంభావానికి గురికావడం వల్ల, అగ్రకుల తత్వం వల్ల, మారుతున్న పరిణామాలను గుర్తించలేకపోవడం వల్లే ఉద్యమం దెబ్బతినిపోయిందనుకుంటే, గద్దర్ వెళ్లిపోయాడనుకుంటే ఈ విమర్శకులు ఒక పని చేయాలి. గద్దర్ ఎలాగూ తనదారి తాను చూసుకున్నాడు కాబట్టి ఆ విషయం ఈ విమర్శలతో సరిపెట్టి, అసలైన విప్లవ పంథా నిర్మించి విప్లవాన్ని ముందుకు తీసుకపోవడమనే ఏకైక కర్తవ్యాన్ని చేపట్టాలి. ఇక ఆలస్యం ఎందుకు?

ʹమీ తప్పులను విమర్శించినంత మాత్రాన మాకు ఇలా కర్తవ్యాలు నిర్దేశిస్తారా?ʹ అనాల్సిన పని లేదు. రాజకీయ రంగంలో ప్రతి ఒక్కళ్లకు నిర్దిష్ట కర్తవ్యాలే ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా నిర్దేశించేదేమీ ఉండదు. అది తగదు కూడా. అయితే నడుస్తున్న ఉద్యమం మీద ఇంత కచ్చితమైన నిర్ధారణకు వచ్చాక యిక విప్లవోద్యమాన్ని నిర్మించకుండా చూస్తూ ఊరుకోవడం ఎందుకు? అప్పుడు ఈ నిర్దారణల హేతుబద్దతకు అర్థం ఏముంటుంది?

No. of visitors : 608
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •