కుట్ర

| సాహిత్యం | క‌విత్వం

కుట్ర

- కోడంకుమారస్వామి | 03.11.2018 12:20:27pm

చేపలకు నీటిబుడగ ఎరలతో
గాలం వేస్తున్న కొంగల దొంగజపం
పందులదొడ్డికి క్యూకడుతున్న
టక్కరి నక్కలు.. కొంటె పులులు...

బొంత పేగులకు బొంగుపేలాల హామీలు
బీళ్లు తడపని వాగ్దానాల సొళ్లు
జుట్టుకో లక్ష కనిపించని వరల్డ్ బ్యాంక్ అప్పు
వేల త్యాగాల పునాదిపై దిగిన బంగారు పిడికత్తి
ఆకాంక్షల గుండె గొంతుక మీద ఆంక్షల నిగళాలు

బుడ్డర్ ఖాన్ వేశాలతో
ఊరూర ఓట్లు నోట్లు క్విడ్ ప్రోకొ
మల్టినేషన్ కార్పొరేట్ విఫణిలో
రాజీకీయ దిష్టిబొమ్మల ఓట్లాట

జెండాలు,ఎజెండాలు వేరైనా
ఈగిల్ దందాలో కిరాయి రోబోలె
అభివృద్ధి మాయల మంత్రం
ఒకే ఆకులో చదువుకున్నట్లు
స్విస్ ఖాతాల్లో పెరుగుతున్న పొదుపులు

పెట్టుబడికి ఫలితమయి కురుస్తున్న కమీషన్లు
ప్రశ్నించే కలాల మీద వేలాతున్న కరవాలం
పదవుల పంజరంలో బందీఅయిన
మేధావుల మౌనం పోస్టుమాడర్న్ కుట్ర

ఆశలన్ని బ్యాలెట్ బాక్స్ లో నానబోస్తె
పుచ్చిబుర్రల్లేని పందికొక్కులొచ్చే కుట్రకాలంలో
నూతన మానవావిష్కరణకు దండకారణ్యంలో
త్యాగాల విత్తులు చల్లుతున్న విలుకాడే దిక్కు

No. of visitors : 364
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •