ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు

| సాహిత్యం | వ్యాసాలు

ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు

- -పి.వరలక్ష్మి | 03.11.2018 12:35:00pm

అయ్యప్ప గొడవొచ్చి అంతకు నెల రోజుల ముందు నాటి కేరళ విపత్తును మరచిపోయేలా చేసింది. 24 గంటల వార్తాప్రసారాలొచ్చాక ఏ రోజుకారోజుదే వార్త. రోజులు గడిస్తే విషయం పాతబడిపోయి ముతక వాసనొస్తుంది. కాబట్టి ఎప్పటి చర్చలప్పుడే. ఇప్పుడు వార్తలు పెద్ద ఎంటర్టైన్మెంట్ కూడా. సంచలనం ఉంటే తప్ప చూడబుద్దెయ్యదు. సోషల్ మీడియా భిన్నమైన అభిప్రాయాలను వేరువేరు వైఖరుల నుండి వ్యక్తం చేసినా ఈ సంచలనాల వెంట నడవక తప్పదు. ప్రస్తుతం హాట్ హాట్ గా ఉన్నది 600 మీటర్ల పటేల్ విగ్రహం. అయితే ఇక్కడ దీన్ని గురించి మాట్లాడ్డం లేదు. ఆ పాయింటుకూ వద్దాం కానీ కొంచెం వెనక్కిపోయి ఒకటి రెండు ఘటనల వెంట నడిచివద్దాం. చూపు విశాలం చేసుకోకపోతే కష్టం.

ఆగస్టు నెలలో కేరళను వరదలు ముంచేసాయి. ఆ విషాదంలో చిక్కుకున్నవాళ్ళు ఇప్పటికీ బైటపడి ఉండరు. సాయం కోసం అల్లాడుతున్న కేరళ ప్రజల మీద ఒక అమానవీయమైన, వికృతమైన విద్వేష క్యాంపెయిన్ నడిచింది. కేరళ వరదలను పర్యావరణ విధ్వంసం వైపు నుండి అర్థం చేసుకుని, దాని వెనక కారణాల మీద చర్చ జరుగుతున్నప్పుడే కొన్ని సనాతన మతపిచ్చి బృందాలు ఈ విపత్తు దేవుడి శాపం అని ప్రచారం చేసాయి. అక్కడి ప్రజలు బీఫ్ తింటారు గనక, శబరిమల విషయంలో కోర్టు జోక్యం చేసుకుంది గనక, హిందూ మతానికి వ్యతిరేకమైన కమ్యూనిస్టుల పాలనలో ఉంది గనక, ఇంకా ఇట్లాంటి అపచారాలు జరుగుతున్నాయి గనక దేవుడికి కోపమొచ్చింది. కాబట్టి కేరళ ప్రజలకు ఎవరూ సహాయం చేయకూడదు అనే ప్రచారాన్ని వైరల్ చేసారు. వాళ్ళు కోరుకుంటున్నట్టుగా సమాజంలో పూర్తిగా మానవత్వం నశించలేదు గనక చావుబతుకుల్లో ఉన్న తోటి మనిషికి సహాయం చేయొద్దని చెప్పే వాళ్ళను జనం అసహ్యించుకున్నారు. సాటి మనుషులుగా స్పందించారు. అయినా కేంద్రప్రభుత్వం చేయవలసిన సాయం చేయకుండా చిల్లర విదల్చి కేరళ ప్రజల్ని అవమాపరచింది. విదేశీ సాయాన్ని కూడా తిరస్కరించి విమర్శలపాలయ్యింది. బిజెపి, ఆరెస్సెస్ ప్రజల్లో, ముఖ్యంగా కేరళ ప్రజల నుండి ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

నెల దాటిందో లేదో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించమని సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఆరెస్సెస్ అన్నది. కాని వెంటనే ఇది విశ్వాసాలకు, మత భావజాలానికి సంబంధించిన విషయమని అది పసిగట్టింది. అప్పటిదాకా మూటగట్టుకున్న వ్యతిరేకతనంతా భక్తి మాటున, విద్వేషాల మాటున కనుమరుగు చేయడానికి అది చేయగలిగిందంతా చేసింది. అయ్యప్ప గుడి మూర్ఖత్వాన్నే కాదు, మహిళల బహిష్టు చుట్టూ సమాజంలో ఉండే మూఢత్వాన్ని అది వాడుకుంది. కాషాయ సేనలు, నల్లబట్టలు వేసుకొని రౌడీయిజం చేసాయి. మహిళలను అంటరానివాళ్ళను చేసే ఆచారానికి మద్దతుగా మహిళల్నే రెచ్చగొట్టారు. దేవుడి వ్యవహారం మరి. ఏ అపచారం జరిగితే ఏమవుతుందోనని భయం ఒక పక్క, హిందూ మతానికేదో ముంచుకొస్తోందని మరోపక్క. అవకాశం దొరికింది కదా అని దేశమంతా అల్లరి చేసారు. మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు విని మహిళ అయివుంది అలా ఎలా అనగలిగింది అని ఆశ్చర్యపోతున్నాం గాని, ఆ స్థానంలో ఆమె మహిళగా కన్నా మత పరిరక్షకురాలిగా, బిజెపి మనిషిగా పాలకవర్గ ప్రతినిధిగా ఉంది. మామూలు మహిళలది అమాయకత్వం అయితే ఈమెది అవకాశవాదం, వర్గప్రయోజనం.

బిజెపి, ఆరెస్సెస్ ల అవకాశవాదాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి. వాళ్ళకు నిజంగా విశ్వాసాల పట్ల ప్రేమ లేదు. మహిళల్ని రానివ్వని శనిసింగనాపూర్ గుడి మీద పోరాటం చేసి అనుమతి సాధించడంలో ఆరెస్సెస్ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు అదే ఆరెస్సెస్ శబరిమల పవిత్రత అంటూ యాగీ చేస్తోంది. అంతెందుకు, ఇదే శబరిమల వ్యవహారం మీద మహిళల్ని అనుమతించాలంటూ 2006లో అది వేసిన పిటిషన్ కూడా బైటపడింది. కనీసం ఈ విషయాన్ని కూడా గుర్తించలేని కాంగ్రెస్ బిజెపితో పోటీపడి అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఇక్కడే ఈ ఆలయ సనాతనత్వం కూడా చర్చకు వచ్చింది. నిజానికి శబరిమల ఆదివాసులకు సంబంధించినదని, దాన్ని బ్రాహ్మణ భూస్వామ్య శక్తులు కబ్జా చేశాయని కోర్టులో కేసు నమోదైంది.

కవిత, రెహానా వంటివాళ్ళు నిజమైన ప్రజాస్వామికవాదులుగా, చైతన్యవంతమైన మహిళలుగా సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలని పోరాడారు. రెహానా అయితే ముస్లిం కూడా అయినందుకు రెండు మతాలతో పోరాడుతోంది, దెబ్బలు కాచుకుంటోంది. చట్టాన్ని అమలు చేయమని కోరేవాళ్ళు ఇప్పుడు నేరస్తులయ్యారు. దేశద్రోహులయ్యారు. చట్టాన్ని, న్యాయాన్ని, మానవత్వాన్ని తుంగలో తొక్కేవాళ్ళు రోడ్ల మీద స్వైరవిహారం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం మేలుకొని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. భక్తులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని అమిత్ షా హెచ్చరికలు చేసేకాడికి పోయింది. కేరళ హైకోర్టు తీర్పు ఎంతవరకు దీన్ని నిలువరిస్తుందో, ఉన్న కాసింత చోటూ ఊడ్చుకుపోకుండా లెఫ్ట్ ఫ్రంట్ ఏం చేయగలదో గాని ఇక్కడ మరచిపోకూడని ముఖ్యమైన విషయం ఉంది.

ధరల పెరుగుదల, పన్నుల మోతలు, ఉద్యోగ, ఉపాధి క్షీణించడం, ఎన్నికల హామీలేవీ నెరవేర్చకపోవడం, నోట్ల రద్దు పేరుతో సామాన్యుల వెన్నువిరిచి తమవారికి మేలు చేకూర్చడం, వేలకోట్లు కొల్లగొట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను దేశం దాటిచడం, అమిత్ షా కొడుకు జైషా ఆస్తులు వేలరెట్లు పెరిగిపోయినట్లుగా బైటపడటం, దేశ చరిత్రలోనే అతి పెద్దదైన రాఫెల్ కుంభకోణం, ఆరెస్సెస్ సంస్థల నేతృత్వంలో దేశవ్యాప్తంగా విచ్చలవిడి హింసాకాండ, విశ్వవిద్యాలయాలు, న్యాయవ్యవస్థ, సిబిఐ, ఆర్.బి.ఐ దాకా అన్ని స్వతంత్ర వ్యవస్థల్లో జోక్యం చేసుకొని ధ్వంసం చేస్తూ అప్రదిష్ట మూటగట్టుకున్న మోడీ సర్కారుకు ఇక ఎన్నికల్లో చెప్పుకోడానికేమీ లేదు. తనను చంపే కుట్ర జరుగుతున్నదని ఏడ్చినా సానుభూతి రాకపోగా తన కుట్రే బైటపడింది. కోర్టులను ఎంత ప్రభావితం చేసినా భీమా కోరేగావ్ అక్రమ కేసులు తనను మరింత పతనం చెయ్యక తప్పదు.

ఆర్థికంగా, సామాజికంగా దేశం పతనవుతోంది. ఇలాంటప్పుడు వీళ్ళ చేతుల్లో ఉండే రెడీమేడ్ ఆయుధం హిందూ సాంస్కృతిక జాతీయవాదం. ఇదో మతపిచ్చి విద్వేషవాదం. ఇందులో అటు మతం, దానితో ముడిపడిన జాతీయవాదం ఉంది. అది ఎప్పటికప్పుడు భావోద్వాగాలను పంప్ చేస్తూ ఉంటుంది. ఇవాల పటేల్ తో అవసరం కూడా అదే.

బలవంతపు ఐక్యత, భిన్నత్వాన్ని మాయం చేసే ఏకత్వంలో, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రతిమలో తనను తానూ చూసుకుంటున్నాడు మోడీ. రాజ్యహింసకు, పోలీసు దౌర్జన్యాలకు, జాతుల స్వాతంత్ర్యాన్ని అణచివేసిన ఉక్కు పాదానికి ప్రతిరూపమైన పటేల్ ను హీరోగా దేశం ముందు నిలబెట్టి చూపుతున్నాడు. నోట్ల రద్దు, జి.ఎస్.టి వంటి అహంభావపూరిత నిర్ణయాలను, దేశాన్ని స్వదీశీ, విదేశీ కంపెనీలకు అమ్మివేయడాన్ని పటేల్ తీసుకున్న సాహసోపేత చర్యల వంటివని చెప్తున్నాడు. తన ప్రభుత్వ విధానాలను సమర్థించుకోను ఏ శాస్త్రీయ వాదన చేయలేక, కనీసం ఏ వాదనా చేయలేక అన్నిటినీ ఐక్యత, జాతీయత గోతాంలోకి తోసేస్తున్నాడు. మతం, సంస్కృతి, భావజాలంతో బతికేస్తున్నాడు. అన్నం, నీళ్ళు లేకున్నా ఐక్యతా విగ్రహం చూసుకొని బతికెయ్యమంటున్నాడు మనల్ని కూడా.

No. of visitors : 319
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •