తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?

- ప్రజాసంఘాల ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ | 14.11.2018 02:27:02pm

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ తదితర ప్రాంతాలలో గత నెలలో సంభవించిన ʹతిత్లీʹ తుఫాను విధ్వంసం అందరికీ తెలిసిందే. నిలువ నీడ కోల్పోయిన ప్రజలు, జీడి, కొబ్బరి తోటల వంటి ఫలసాయాన్ని పోగొట్టుకున్న ప్రజలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చాలని, తమను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాలు చేస్తున్న వితరణ చాలక రాష్ట్రంలోని స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు తమ పరిమితుల్లో ప్రజల నుండి విరాళాలు, నిత్యావసర వస్తువులు సేకరించి నిరాశ్రయులైన ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పి.డి.యం) నేతృత్వంలో ప్రజాసంఘాలన్నీ కొంత కాలం శ్రమించి ప్రజల నుండి సేకరించిన బియ్యం, ఇతర ఆహార వస్తువులను, చీరలను తుఫాను బాధితులకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వ్యయప్రయాసలకోర్చి నిరాశ్రయులైన ప్రజల వద్దకు వెళితే శ్రీకాకుళం జిల్లా పోలీసులు కనీసపు మానవత్వాన్ని చూపకుండా ʹమీ సంఘాల వారెవ్వరూ ఇక్కడ బాధితులను కలుసుకోవడం కానీ, వారికి సాయం చేయడం కానీ చేయకూడదనిʹ ప్రజల వద్ద విరాళంగా తీసుకున్న నిత్యావసర సామగ్రిని సీజ్ చేసి, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి, వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం(సెక్షన్ 8 (1) (2) ఎపి. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ -1992) కింద, నేరపూరిత కుట్ర (సెక్షన్ 120 బి, 124) ఆరోపణల కింద కేసులను నమోదు చేసి మొత్తం 14 మంది కార్యకర్తలను వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ నుండి శ్రీకాకుళం జిల్లా జైలుకు రిమాండుకు పంపారు.

పోలీసులు అక్రమగా అరస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలు: వై.వెంకటేశ్వరరావు (పిడియం కార్యదర్శి), బి.అంజమ్మ (అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు), నీలకంటు (ప్రజాకళామండలి ఉపాధ్యక్షులు), కోదండం (అమరుల బంధుమిత్రుల సంఘం), ధనలక్ష్మి (అమరుల బంధుమిత్రుల సంఘం), అరుణ (తిత్లీ తుఫాను బాధిత సంఘీభావ కమిటి), వీరాస్వామి (పిడియం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి), దాసరి శ్రీరాములు (ఉద్దానం రైతాంగ వేదిక), వెంకయ్య (పిడియం ప్రకాశం జిల్లా కార్యదర్శి), సయ్యద్ మీరా (పిడియం ప్రకాశం జిల్లా సభ్యుడు), రామకృష్ణ (పిడియం గుంటూరు జిల్లా కార్యదర్శి). వీరితో పాటు ప్రకాశం జిల్లా పొదిలి నుండి నిత్యావసరాలు పంచడానికి వచ్చిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి కేసులు పెట్టారు.

ప్రభుత్వం తన దుర్మార్గాన్ని, కుటిల నీటిని బయట పెట్టుకుంటూ ప్రజాసంఘాలైన దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజా కళా మండలి వారిని అరెస్టు చేసి మానవ సహజ స్పందనలు కూడా నిర్బంధించి మానవతను కూడా అవమానించే దశకు చేరుకుంది. తుఫాను వంటి ప్రకృతి విధ్వంసాలలో నిరాశ్రయులైన కట్టు బట్టలతో మిగిలిన ప్రజల దుఃఖంలో పాలుపంచుకొని, తమకు చేతనైన సాయాన్నందించే ప్రజాసంఘ కార్యకర్తలను నిర్బంధించడం, కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు.
1. మానవతను చాటుకుంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం అనైతిక చర్య.
2. తక్షణం ప్రజాసంఘాల కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి.
3. ప్రజాసంఘాల కార్యకర్తల అనారోగ్య దృష్ట్యా వారికేమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

-ప్రజాసంఘాల ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్
దుడ్డు ప్రభాకర్ (కుల నిర్మూలనా పోరాట సమితి), అరసవిల్లి కృష్ణ (విరసం), కె.ఏసు (ఒపిడిఆర్), టి. ఆంజనేయులు (పౌరహక్కుల సంఘం), జె.కోటి (ప్రజా కళా మండలి), బి.కొండారెడ్డి (ప్రగతిశీల కార్మిక సమాఖ్య), ఎన్.క్రాంతి కుమార్ (పి.డి.యం), రాధ (చైతన్య మహిళా సంఘం), పిచ్చుక శ్రీనివాస్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్)

No. of visitors : 200
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •