నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే

| సంపాద‌కీయం

నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే

- పాణి | 19.11.2018 03:34:17pm

కవులు ఎందరో ఉంటారు. కానీ కవిత్వ సారం తెలిసి రాసే వాళ్లు కొందరే ఉంటారు. వివి వ్యక్తిత్వం ఆయన కవిత్వమే. ఆయన చైతన్యం నక్సల్బరీయే. ఈ రెంటి అభేద సారమే ఆయన ఆకర్షణ. కవిగా ఆకర్షణీయ వ్యక్తిత్వంగల గౌరవనీయ కవులు మనకు ఎందరో ఉన్నారు. కవిత్వమంటే జీవితమే అని చెప్పిన కవులు కూడా ఉన్నారు. వివికి కవిత్వం అంతకంటే ఇంకా ఎక్కువ. ఆయనకు కవిత్వమంటే ఆచరణే. అత్యున్నత తాత్వికార్థంలో మార్క్స్‌ చెప్పిన మానవ ఆచరణలో కవిత్వం భాగమని వివి నమ్మకం. అందుకే ఆయన వ్యక్తిత్వం ఆర్షణీయమైనదే కాదు, ప్రభావశీలమైనది.

ఎంతగానంటే వచన కవిగా ఆయనకు ఉన్నంత మంది పాఠకులు మరెవరికీ ఉండరు. ఏ పత్రికలోనో ఆయన కవిత్వాక్షరాలు కనిపించినా, అనేక పుస్తకాల దొంతరల్లో ఆయన కవితా సంపుటం కనిపించినా ప్రేమగా వివిసారు అని ముట్టుకొనే వాళ్లు అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్లు ప్రాథమికంగా కవితా పాఠకులు కూడా కాకపోవచ్చు. కొండొకచో అసలు పాఠకులే కాకపోవచ్చు. కానీ అలా చూసి ముందు ఆయనతో కనెక్టవుతారు. లేదా తమ అభిమానాన్ని ఆ అక్షర స్పర్శతో పునర్మించుకుంటారు. వాళ్లలో అనేకమంది తర్వాత్తర్వాత నిజంగానే ఆయన కవితా పాఠకులుతారు. సాహిత్య ప్రపంచంలో సంచారులవుతారు. విప్లవోద్యమ వ్యాఖ్యాతగా ఆయన శ్రోతల్లో ఉండే డైవర్సీటీ మరే వక్తకూ ఉండనట్లే ఆయన కవితా పాఠకుల్లో కూడా అపారమైన వైవిధ్యం ఉంటుంది.

అంటే అనేక వైపుల నుంచి తన పాఠకులను తానే తయారు చేసుకొనే కవిత్వం ఆయనది. కవిత్వమంటే ఆచరణ అయినందువల్లే ఆయన కవిత్వానికి అంత శక్తి వచ్చింది. కవిత్వమంటే విప్లవం కావడం వల్లే ఆయనకు మూడు తరాలుగా అంత భిన్నమైన పాఠకులు సమకూరారు.

వివి కవిత్వ నిర్మాణాల గురించి, ప్రయోగాల గురించి ఎంతయినా చెప్పవచ్చు. బహుశా తెలుగు విప్లవ వచన కవిత్వంలోని ప్రయోగాల్లో ఆయన ముద్ర అసాధారణం. తన అరవై ఏళ్ల కవిత్వ జీవితంలో కనీసం ఏడెనిమి దశలను దాటుకుంటూ ఎక్స్‌టెండ్‌ అవుతున్న కవి ఆయన.

ఈ దేశ ప్రధానిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ʹప్రమాదకర వ్యక్తిʹగా ఆయన జెయిలుకు వెళ్లిన సందర్భం ఇది. ఇప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఆయన కవిత్వ రహస్యంలో చూడటం వరకే పరిమితం కావడం బాగుంటుంది. పైగా వివి కవిత్వ విశ్లేషణకు అంతిమసారంలో ఇదొక్కటే మౌలిక ప్రాతిపదిక. ముపై ఏళ్ల కింద ʹముక్తకంఠంʹలో ʹనా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమేʹ అన్నారు. నక్సల్బరీతోపాటు కలిసి నడిచిన యాభై ఏళ్ల ప్రజా జీవిత సారానికి ఈ ఒక్క మాటే మకుటం.

కవులు మామూలుగా తమ కవిత్వం ఎలాంటిదో తామే చెప్పుకున్న సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. అందులోని కవిత్వంతో మనం అనుభూతి చెందవచ్చు. కానీ వివి తన వ్యక్తిత్వసారమంతా కవితా రహస్యంలో ఉందని చెప్పారు. చాలా పారదర్శకమైన ప్రజా ఆచరణ రహస్యం అది. అత్యున్నత మానవ జీవిత తలంలో నిలబడి తనను, తన కవిత్వాన్ని పునర్దర్శించకుంటూ చేసిన వ్యాఖ్య ఇది. విచిత్రమేమంటే ఆయన అభిమానులకూ, రాజ్యానికి తెలిసిన ఈ విషయం దాదాపుగా సాహిత్య విమర్శకులెవరూ పట్టుకోలేకపోయారు.

కవిత్వం ఎలా ఉండాలో విమర్శకులు చాలా ఎక్స్‌ర్‌సైజ్‌ చేసి ఉండవచ్చుగాని, ఎవరి కవిత్వానికైనా ప్రభావశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా అంచనా కట్టగలం? అనే అతి ముఖ్యమైన ప్రశ్నల వైపు విమర్శకులు దృష్టి సారించలేకపోయారు. వివి కవిత్వాన్ని ఇలా చూడకపోవడం వల్ల ఆయనకు ఏమోగాని తెలుగు కవిత్వానికి, విమర్శకు చాలా నష్టం జరిగింది. ఆయన వ్యక్తిత్వ, కవిత్వ ప్రభావం ఎలాంటిదంటే ఊహించని వైపుల్లో అభిమానులు ఉన్నట్లే వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల దృష్టి నుంచి చూస్తే .. బహుశా సాహిత్యరంగంలో సహేతుకంగానే అంతమంది వ్యతిరేకులు ఉన్న కవి కూడా మరొకరు ఉండకపోవచ్చు. కవిత్వమంటే ఆచరణ అనే తిరుగులేని ప్రాతిపదిక మీద ఆయన దృఢంగా నిలబడటమే దీనికి కారణం. సహేతుక వ్యతిరేకులని అన్నది ఈ అర్థంలోనే. అదే ఆయన ఆకర్షణ.

కవితా రచన ఆయనకు కంఫర్ట్‌ జోన్‌ కాదు. నిత్యం పులి నోట్లో తలపెట్టి బైటికి వస్తూ వస్తూ ఒక కవితను నిర్మిస్తారు. ఈ యాభై ఏళ్లలో అనేక సార్లు ప్రాణ హాని పొలిమేరల్లోకి వెళ్లి వస్తూ సృజనాత్మకతను సారభూతం చేసుకుంటారు. ఇల్లు, వీధి, జెయిలు.. అన్నీ వివికి మానవ ఆచరణ తలాలే. ఇంట్లోంచి వీధిలోకి వెళ్లి తిరిగి వచ్చినంత అలవోకగా జెయిలుకు పొయి రావడం ఆయనకు అలవాటైంది. అక్కడా, ఇక్కడా కవిత్వం రాస్తూనే ఉంటారు. ఈ సాహసంలోంచి ఆయన సృజనాత్మకత ఈ వయసులో కూడా వెల్లివిరుస్తోంది. ఆయన ఆకర్షణలోని అట్టడుగు తలం ఇక్కడ ఉంది.

ఆయన మావోయిస్టు ఉద్యమ వ్యాఖ్యాతగా రాటుదేలడం వెనుక చరిత్ర ఇచ్చిన స్థల కాలాల ప్రమేయం ఉన్నమాట నిజమే. కాని ఆ స్థలకాలాల అర్థాలు, అవసరాలు గుర్తెరగడంలో ఆయనలోని మేధావి కంటే కవే ఆయనను నడిపిస్తూ వచ్చాడు. ఆ కవికి కవిత్వపు గీటురాయి మానవ ఆచరణే . అందువల్ల హోరెత్తే కల్లోల ఉద్యమాల వెంట ఉద్వేగ వ్యక్తీకరణగా, చారిత్రక కవితా ధారగా యాభై ఏళ్ల నుంచి సాగిపోతున్నారు. ఇదంతా కఠినమైన ఆచరణ. దీన్ని ఆయన చైతన్యవంతంగా ఎంచుకున్నారు. ఎంతగానంటే మావోయిస్టు ఉద్యమంతో ఆయన అభేదమే ఆయనలోని కవికి నిత్య ప్రేరణ. ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమానికి వేర్వేరు సందర్భాల్లో ఎందరో ప్రతిభావంతమైన వ్యాఖ్యాతలుగా ముందుకు వచ్చారు. వాళ్లందరిలోనూ వివి ప్రత్యేకత ఈ అభేదానుబంధంలోనే ఉంది. పదే పదే ప్రమాదకర వ్యక్తిగా రాజ్యం వెంటాడటానికి ఇదే కారణం. ఆ రకంగా ఆయనలాంటి వ్యాఖ్యాత ప్రపంచ విప్లవోద్యమాలకు, నిర్మాణాలకు, ప్రజా పోరాటాలకు మరొకరు ఉండకపోవచ్చు.

కవిగా ప్రజా జీవితం, జెయిలు జీవితం రెండూ వివికి అవిభాజ్యం. అందుకే విశ్వాసాల కోసం ఇప్పటికే సుదీర్ఘకాలం జెయిలు జీవితం గడిపి, ఈ వృద్ధాప్యంలో కూడా మళ్లీ జెయిలుకు వెళ్లారు. ఆయన చిరునవ్వు రహస్యం కూడా ఆయన కవిత్వమే.





No. of visitors : 310
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •