182 మీట‌ర్ల ఎత్తైన అన్యాయం

| సాహిత్యం | వ్యాసాలు

182 మీట‌ర్ల ఎత్తైన అన్యాయం

- | 19.11.2018 03:36:47pm

గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దీ తీరంలో స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ స‌మీపంలోని ఒక దీవిలో అక్టోబ‌ర్ 31న ప్ర‌పంచంలోనే ఎత్తైన విగ్ర‌హాన్ని ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు. దాదాపు 182 మీట‌ర్ల ఎత్తైన ఆ విగ్ర‌హానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. భార‌త తొలి ఉప ప్ర‌ధానిగా, హోం మంత్రిగా ప‌నిచేసిన స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హం అది.

2013లో మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నకాలంలో ఈ విగ్ర‌హ నిర్మాణాన్నిప్రారంభించారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. దీని వెన‌క‌గ‌ల రాజ‌కీయకోణాన్ని వివ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు... అది చాలా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతున్న‌దే. దేశ‌ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ప‌టేల్‌కు రావాల్సిన గుర్తంపూ, గౌర‌వ‌మూ రాలేద‌ని వాదిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం మూడు వేల కోట్లు ఖ‌ర్చుచేసి, ఆయ‌న విగ్ర‌హాన్ని నిర్మించింది. అయితే ఇంత భారీ మొత్తాన్నీ వెచ్చించ‌డం ఇప్పుడు దేశ ప్ర‌జ‌లనీ, మీడియా దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. కానీ, నాణేనికి రెండోవైపు మాత్రం పెద్ద‌గా వెలుగులోకి రాలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల ధ్వంస‌మ‌వుతున్న జీవితాలు మాత్రం మీడియా కంటికి క‌నిపించ‌డంలేదు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 72 గ్రామాల‌కు చెందిన గిరిజ‌నులు నిర్వాసితులవుతున్నారు.

ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ‌మంతా చూసేలా మోదీ ఆర్భాటంగా విగ్రాహావిష్క‌ర‌ణ చేస్తున్న స‌మ‌యానికి.. కొన్ని వేల‌మంది గిరిజ‌నులూ, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు పోలీసు నిర్భందంలో మ‌గ్గుతున్నారు. ప్ర‌జ‌ల నిర‌స‌న‌ను అణ‌చివేసి... ప్ర‌పంచానికి ప‌టేల్ గొప్ప‌త‌నాన్ని ఇలా చాటుకుంది ప్ర‌భుత్వం.

ప్ర‌జ‌ల్లో నిర‌స‌న ఏ స్థాయిలో ఉందంటే... 72 గ్రామాల ప్ర‌జ‌లు విగ్ర‌హావిష్క‌ర‌ణ రోజును సంతాప‌దినంగా పాటిస్తూ, క‌నీసం ఇంట్లో పొయ్యి కూడా వెలిగించ‌లేదు. సాదార‌ణంగా ఎవ‌రైనా మ‌ర‌ణిస్తేనే, సంతాపంగా ఆ ఇంట్లో పొయ్యి వెలిగించ‌రు. కానీ ఇక్క‌డి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా, సామూహికంగా సంతాప‌దినం పాటించ‌డమే అక్క‌డి ప‌రిస్థితుల‌కు అద్దంప‌డుతోంది. మోదీ ప‌ర్య‌ట‌న‌కు ముందురోజు రాత్రి న‌ర్మ‌దా జిల్లాలోని దాదాపు 90 మంది సామాజిక, హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసు నిర్భందించారు. ద‌గాప‌డ్డ గిరిజ‌నుల‌కు సంఘీబావం తెల‌ప‌డమూ నేర‌మైందంటూ సామాజిక కార్య‌క‌ర్త ముదితా విరోదీ అంటున్నారు.

తూర్పుగ‌జ‌రాత్‌లోని న‌ర్మ‌దాజిల్లాతో పాటు, ఇత‌ర జిల్లాల్లో కూడా గిరిజ‌నులు ఈ విగ్ర‌హ నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఉత్త‌ర గుజ‌రాత్‌లోని డంగ‌, బ‌న‌స్కాంత జిల్లాల్లోనూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకోడానికి పోలీసులు ముంద‌స్థు అరెస్టులు చేశారు. ఈ ప్రాజెక్టును మొద‌టినుంచీ వ్య‌తిరేక‌స్తున్న వారిలో గిరిజ‌న నాయ‌కుడు ప్ర‌ఫుల్‌వాస‌వ ఒక‌రు. ఆయ‌న మాట్లాడుతూ... విగ్ర‌హ నిర్మాణానికి తాము వ్య‌తిరేకం కాద‌నీ, త‌మ ఉనికినే అది ప్ర‌శ్నార్థ‌కం చేసే స్థితిని మాత్రం స‌హించేదే లేద‌న్నారు.

ఈ విగ్ర‌హ నిర్మాణం వ‌ల్ల 72 గ్రామాల ప్ర‌జ‌లు నిర్వాసితుల‌వుతున్నారు. వారిలో 37 గ్రామాలకు ఎలాంటి పున‌రావాస స‌హాయమూ అందించ‌లేదు. గ‌రుడేశ్వ‌ర జిల్లాలోని ఏడు గ్రామాల్లో భూసేక‌ర‌ణ‌కు డ‌బ్బులు చెల్లించిన‌ప్ప‌టికీ... భూమికి బ‌దులుగా భూమీ, అంద‌రికీ ఉపాదీ... అనే అంశాలు అమ‌ల‌కు నోచుకోలేదు. ఈ విగ్ర‌హ నిర్మాణం వ‌ల్ల‌ 13 గ్రామాల‌కు చెందిన‌, 20 వేల‌మంది ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావిత‌మ‌వుతున్నారు. విగ్ర‌హాన్ని చేరుకోవ‌డానికి రోడ్లు, ప‌ర్యాట‌క అవ‌స‌రాలు, సిబ్బంది నివాసం కోసం ఆరుగ్రామాల నుంచి భూసేక‌ర‌ణ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ గ్రామాల‌ను ఎఫెక్టెడ్ గ్రామాలుగా గుర్తించ‌లేదు. ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప‌రిహారం అందించ‌లేదు.

ప్రాజెక్టు ప్ర‌భావిత ప్రాంతాలుగా గుర్తించ‌బ‌డిన 19 గ్రామాల ప్ర‌జ‌లూ పోరాడేది వారి హ‌క్కుల‌ను సాధించుకోవ‌డానికే, వారికి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుకోవ‌డానికే అని హ‌క్కుల కార్య‌క‌ర్త ఆనంద్ ముజుగాంక‌ర్ అంటున్నారు. మ‌రోవైపు న‌ర్మ‌దా డ్యాం కుడివైపున ఉన్న 28 గ్రామాల ప్ర‌జ‌లూ ఎంత క‌రువు ప‌రిస్థితుల్లోనూ చుక్క‌నీటిని వాడుకోరాద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై కూడా పోరాడ‌డానికి ఆ గ్రామాల ప్ర‌జ‌లు నిశ్చ‌యించుకున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మూడువేల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చుపెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టులో క‌నీసం న‌ష్ట‌పోయిన వారికి ప‌రిహారం ఇవ్వ‌ని ప్ర‌భుత్వాలు స‌బ‌క్ సాత్ -స‌బ్‌కా వికాస్ అంటే న‌మ్మేదెలా?

source : www.downtoearth.org

No. of visitors : 360
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మ‌నంద‌రి క‌ల‌లు వాళ్లు...

స్వేచ్ఛ‌ | 03.11.2016 01:56:41pm

అవును... మ‌న అంద‌రి కోసం. ఈ దేశ సంప‌ద‌ను కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసీలు, వాళ్లకు అండ‌గా నిలిచిన విప్ల‌వ‌కారులు.. ఈ దేశ భ‌విష్య‌త్తును క‌ల‌గంటున్నారు. ......
...ఇంకా చదవండి

త‌ప్పిపోయిన క‌ల‌ల కోసం...

స్వేచ్ఛ‌ | 06.08.2016 10:30:14am

నిదుర నటిస్తున్న వేల రెప్పలకింద పారుతున్న నెత్తుటి వ‌ర‌ద‌ మంచు పొర‌ల‌పై రాలుతున్న పూల గాయం... నా క‌నుపాప‌ల్లోకి గుచ్చుకుంటున్న పెల్లెట్లు.....
...ఇంకా చదవండి

ఊయ‌ల‌లో కంటిపాప‌

స్వేచ్ఛ | 01.06.2016 11:36:35am

స్వప్నాల వెంట సాగే ప్రవాహమ‌యి ఆదివాసీ అడుగుల్లో ఆన‌వాల‌యి అడ‌విని ఆశ్వాదించే శ్వాస‌యి...
...ఇంకా చదవండి

క‌థువా - ఉన్నావో నుంచి చింత‌గుఫ వ‌ర‌కు అధికారులు ఎలా స్పందించారు?

నందిని సుంద‌ర్‌ | 17.04.2018 03:58:37pm

ఐనా.. స‌ల్వాజుడుం మొద‌లైన 2005 నుంచి ఏ ఒక్క హ‌త్య‌, అత్యాచారం కేసులో భాదితులు న్యాయానికి నోచుకోలేదు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్, మ‌హిళా క‌మీష‌న్, సుప్రీంకోర్టు...
...ఇంకా చదవండి

ఆకు రాలు కాలం

స్వేచ్ఛ‌ | 06.07.2017 12:32:21am

దుఃఖమొక వర్షం జల్లులో రెక్కలు తడిచి చెట్టు కౌగిలి కోసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •