సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు

| సంభాషణ

సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు

- డేవిడ్‌ | 19.11.2018 03:54:04pm


మొన్న‌ (నవంబర్ 17) విప్లవాభిమానులు ʹసురాʹ అని ఆప్యాయంగా పిలుచుకునే సి.వి.సుబ్బారావు పుట్టినరోజు. 1970లో విశాఖ లో జరిగిన శ్రీశ్రీ షష్ఠి పూర్తి సభల్లో ʹరచయితలారా మీరెటు వైపుʹ అంటూ ప్ర‌శ్నించి, విరసం అవిర్భావానికి దోహదం చేసిన విశాఖ విద్యార్థుల్లో ముఖ్యమైన వ్యక్తి సి.వి సుబ్బారావు.

రాడికల్ విద్యార్థి మొదలు రచయితగా, సాహిత్యకారుడిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా తన అపారమైన మేధస్సును ప్రజలకోసం వెచ్చించి తుది ప్రాణం ఉన్నంత వరకు విప్లవోద్యమం కోసం పని చేసి ʹఒక తరంʹపై చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఆయన.

వరవరరావు - హేమలత దంపతులను అమితంగా ఇష్టపడే సివి, వాళ్ళ గురించి, అప్పుడు వాళ్ళు నివసించే వరంగల్ గురించి అద్భుతమైన కవిత రాశాడు..!

ఇవాళ ఎంత యాదృచ్చికం అంటే సి.వి పుట్టిన రోజు నాడే వరవరరావు ను పుణే పోలీసులు అరెస్టు చేశారు. వరవరరావు ని పుణే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతునప్పుడు ఆయన సహచరి హేమలత.. దుఃఖాన్ని ఆపుకోలేక ఆలింగన చేసుకున్న దృశ్యం వివిధ పత్రికలు ప్ర‌చురించాయి!

నాకెందుకో ఈ ఫోటో చూస్తుంటే సి.వి వాళ్ళిద్దరి గురించి రాసిన కవిత్వం గుర్తుకు వచ్చింది.

ఈ సందర్భంగా సి.వి బ్రతికుంటే ఎలా స్పందించేవాడో తెలియదు కానీ... వివి అరెస్టు సందర్భంగా, సివి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన కవిత‌.ʹసందిగ్ధ సందర్భంʹలోంచి.

.....
ప్రేమ నగర్ కి మరో గీతం
---
నీ గుడిలో
మేం ఎప్పటికీ లెక్కపెట్టని వేయి స్తంభాలు
నీ ఒడిలో
రోదించే డాక్టర్ లేని పేషేంట్స్ పిల్లలు
మా విరామం లేని ప్రయాణంలో
కార్వాన్ మిగిల్చిన పాద చిహ్నాలు
సాహాసమైన ఎదురు దాడులకి
దీప స్తంభాన వేలాడే అర్ధనగ్న శరీరాలకి మధ్య
ఈ ఐదేళ్ళు నువ్వు మిగిల్చిన శూన్యమే
మా చైతన్య సంపద
నువ్వు మా ధైర్యానివి
నువ్వు మా భయానివి కూడా
అవును కవి చెప్పునట్లు నువ్వు మేం సమిష్టిగా పోగొట్టుకున్న స్వర్గానివి
నువ్వు మేం వ్యక్తులుగా
అనుభవించిన నరకానివి కూడా
ఒక్కసారి, మాకోసం
గర్వంగా, నిటారుగా నిలబడి తలతెత్తి చూడు
మా వుళ్ళోలాగా
ఇక్కడ నీ వినిలాకాశాన్ని బంధించేందుకు
సరిహద్దున సముద్రమైన లేదు.

(హేమలత, వరవరరావు కి - వాళ్ళ వరంగల్ కి)





No. of visitors : 289
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

డేవిడ్‌ | 07.06.2017 12:07:59pm

ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - మే 2019
    ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
    ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
    వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
    159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
    ఒక వికృతి
    ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
    స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
    స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
    విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •