వెలిసిన రంగులు

| సాహిత్యం | క‌విత్వం

వెలిసిన రంగులు

- శేషు కొర్ల‌పాటి | 19.11.2018 04:05:19pm


ఎన్నికల వాసన గుప్పుమని కొట్టింది
ఇప్పుడే కొన్ని పార్టీలు పుడతాయి
పాత పార్టీల పక్కలో చేరడానికి కొత్త జండాలు కప్పుకుంటాయి

రోడ్డుకు అడ్డంగా జెండా దిమ్మలు వెలుస్తాయి
ఎలిసిపోయిన జెండాలు కొత్తజెండాల రంగులు పీల్చుకుంటాయి

ఎన్ని పార్టీలు పుట్టినా అన్నింటా వాళ్లే
గెలిచిన పార్టీలోకి మారిపోయే సౌకర్యాలు
జనాలే వారికి సాక్ష్యులు

పెద్దపార్టీల్లో కొత్త మొఖాలు
Reserved స్థానాల్లో కీలు బొమ్మలు
గెలిచినా ఓడినా ఒక్కటే
నాలుక అంచున నాయకుడి మాటే పలకాలి

ఆవుతోలు కప్పుకున్న ఎలుగుబంట్లు
కులబలంతో కొన్ని పులులు
అది లేని చోట నక్కలు నామినేషన్లు

70 ఏళ్ల కిందటి మేనిఫెస్టోలు
చిరిగిపోయిన బతుకులుపై చిరుతపులి గోటి గుర్తులు

నిరుద్యోగులకు ఈ నాలుగురోజులు
నాణ్యమైన మందు పోయబడును
పని గుర్తురాకుండా పసందైన విందు పెట్టబడును

మనిషి మెదడుపై రిగ్గింగ్ రంద్రాలు
అమాయకత్వం రూపుమార్చుకుని
EVM బీప్ సౌండ్ లో కలిసిపోతుంది
EVM తెరిస్తే కుళ్ళిపోయిన ఫ్లెక్సీల మరకలు
ఓటర్ నోటికి కరెన్సీ తాళం
మనిషి మళ్ళీ బాధ నటించడం నేర్చుకుంటాడు





No. of visitors : 223
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మౌనం తెగేదెప్పుడు?

శేషు | 21.07.2018 12:03:22pm

మతంలో మునుగుతున్న సమాజం మతంతో రమిస్తున్న సమాజం రమించి రమించి గో పుత్రులని కంటున్న సమాజం సమాజనికి జబ్బు చేసింది రక్తం రంగు మారింది శాంతి పేరుతో తెల్లబడింది ...
...ఇంకా చదవండి

ఎగరాల్సింది ఒకే రంగు

శేషు | 16.08.2018 12:57:24am

ఆకాశం ఏ రంగు లో ఉన్నా ఎగరాల్సింది మూడు రంగులు ఒకే రంగు నాకు స్వాతంత్య్రం రాలేదని చెప్పే రంగు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని చెప్పే రంగు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
    అరుణతార జూన్ 2019
    మహాభారతం - చారిత్రక వాస్తవాలు
    జల వనరుల సాధనకు స్ఫూర్తి
    వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
    నల్లని పద్యం
    పేకమేడలు
    Democratized Poetry
    ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
    ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
    Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
    ఆచ‌ర‌ణే గీటురాయి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •