కిసాన్ ముక్తి మార్చ్

| సంపాద‌కీయం

కిసాన్ ముక్తి మార్చ్

- సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి. ప్రజాస్వామికవాదులు రైతుల వెంట నడిచారు. జె.ఎన్.యూ, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు తమ జీవితంలోంచి ఆ రెండు రోజులు రైతులకిచ్చారు. పాపడ్ అమ్మే ఒక వ్యాపారి ఎటువంటి లాభం లేకుండా రైతుల ఆకలి తీర్చాడు. ఎంత చేసినా తమ ఋణం తీరదని వాళ్లకు తెలుసు. కనీసం రైతు అడిగే రుణమాఫీ కోసం తమ గొంతుకలను నినాదాలుగా ఇవ్వడానికి వచ్చారు. ఎప్పటి నుండో అడుగుతున్న స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు చేయాలని, కనీస గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ మాయలో అప్పుకు చిక్కుబడ్డ జీవితాలను విడుదల చేయాలని, తాజాగా ఈ ఎన్నికల సమీప కాలాన మళ్ళీ అడుగుతున్నారు రైతులు. ఈసారి 200కు పైగా రైతు సంఘాలతో అఖిల భారత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తమ నిరసన వ్యక్తం చేసారు. లక్షలాది రైతులు నిరసన తెల్పడానికి ఢిల్లీ వస్తే మోదీ మాత్రం బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్ళికి వెళ్లి నవ్వులు చిందించాడు. వెనుకబడ్డ వర్గం వాడినని, టీ అమ్మి ఈ స్థాయికి వచ్చానని, ప్రజల కోసం పాటుపడుతున్నాని చెప్పుకుంటూ సంపన్న వర్గాలకు ఊడిగం చేసే మన ప్రధానమంత్రి 15 మంది కార్పొరేట్లకు సంబందించిన 3.5 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశాడు కానీ రైతుల గురించి పట్టించుకున్నది లేదు.

పెట్టుబడిదారులు చేస్తున్న కాలుష్యంతో వాతావరణ మార్పులు, అతివృష్టి, అనావృష్టి కలిగిస్తే, దానికి మార్కెట్ మాయాజాలం కలిసి ఋణభారంతో లక్షలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది సుమారు 12000కు పైగా రైతులు ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. తమ గోడు ప్రభుత్వాలకు పెట్టకపోవడంతో ఇటీవలి కాలంలో అనేక దఫాలుగా, వివిధ రూపాలలో రైతుల తమ అసమ్మతిని తెలియచేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో తమిళనాడు రైతులు 100 రోజులకు పైగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పుఱ్ఱెలు ప్రదర్శించి, ఎలుకలు నోట్లో పెట్టుకుని నిరసన తెలిపారు. ఆ వెంటనే మే, జూన్ నెలల్లో మహారాష్ట్ర రైతులు 50 రోజులు పాలు, పండ్లు, కూరగాయలు రోడ్డు మీద పారబోసి మార్కెట్లను దిగ్భంధించి పట్టణాలకు నిత్యావసరాలు అందకుండా ఉక్కిరి బిక్కిరి చేసారు. ఆ రైతులపై పోలీసులు కాల్పులు జరిపితే అయిదుగురు మరణించారు. ఈ సంవత్సరం మర్చి నెలలో మళ్ళీ మహారాష్ట్ర రైతులు ఐదు రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర కిసాన్ మార్చ్ నిర్వహించారు. 2018 అక్టోబర్ మొదటివారంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లకు చెందిన రైతులు పార్లమెంటుకు తమ నిరసన తెలపడానికి తరలివెళ్లారు. వీటన్నిటిలో వ్యక్తమైన ప్రధాన డిమాండ్లు కనీస గిట్టుబాటు ధర, రుణమాఫీ. ఇన్నిసార్లు రైతులు రోడెక్కి తమ నిరసనను తెలియచేసినప్పట్టికి ప్రభుత్వాలు పట్టించుకోపోగా తీవ్రంగా అణిచివేశారు. ఇలా అణచివేయడానికి ఈ నిరసనల వెనుక మావోయిస్టులున్నారన్నది ప్రభుత్వం. సమస్య మావోయిస్టులున్నారా, ఇంకొకరున్నారా కాదు, రైతులకు జీవన్మరణ సమస్యలుండడం నిజమా, కాదా? తనకు సమస్య ఎదురైన ప్రతిసారి మోదీ ప్రభుత్వం దేశభక్తిని, హిందుత్వను, మావోయిస్టు బూచిని ముందుకు తీసుకొచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. సర్దార్ పటేల్ విగ్రహాలు, రామజన్మభూమి అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేస్తూ తిరుగుతుంది. అందుకే ఈ సారి రైతులు చాలా స్పష్టంగా ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ అంటూ రోడ్లెక్కారు.

ఈ కిసాన్ ముక్తి మార్చ్ లో ఒక్క బిజెపి, ఆరెస్సెస్ తప్ప నిరసనలో సాధారణ ప్రజానీకం, విద్యార్థుల నుంచి ప్రతిపక్షాల దాకా అందరు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతుల అసెంబ్లీ ఒక మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఆదివాసీ, మహిళ, దళిత, చిన్న రైతులతో పాటు, పాడి రైతులు, రైతు కూలీలు, ప్లాంటేషన్ వర్కర్లు మాత్రమే కాక ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తులను అందించే సమస్త శ్రామికులు రైతుల సంక్షేమం అంటే మెజారిటీ ప్రజల జీవికక సంబంధించిందే కాదు, దేశ గౌరవానికి, నాగరికతా వారసత్వానికి సంబంధించినదని ప్రకటించింది. ఆత్మగౌరవంతో కూడిన జీవితం తమ రాజ్యాంగ హక్కు అని, సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాల నుండి తమ రక్షణ మాత్రమే కాదు, భూమీ, నీరూ, అడవి సమస్త ప్రకృతి సంపదల రక్షణ గురించి వారు మాట్లాడారు. వీటితో ప్రజాస్వామికవాడులతో పాటు దేశాప్రజలందరూ గొంతు కలపాలి. అట్లాగే కిసాన్ మార్చ్ లో రైతు సంఘాలు చేసిన డిమాండ్లకు సంఘీభావం ప్రకటించాలి. విరసం.ఆర్గ్ ఈ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నది.

ప్రధానంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశం జరగాలని రైతుల రుణ విముక్తి కోసం, కనీస మద్దతు ధర కోసం బిల్లులు ప్రవేశపెట్టాలని కిసాన్ ముక్తి మార్చ్ డిమాండ్ చేసింది. వీటితో పాటు ప్రధానమైన ఈ కింది డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది.


1. ప్రతి కుటుంబానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధీ పథకాన్ని 200 రోజులకు పొడిగించాలి. నిర్దిష్ట కాలపరిమితి లోపల కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలి.

2. పరిశ్రమల ధరలను నియంత్రించడం లేదా రైతులకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించాలి.

3. 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలి.

4. ఆధార్ లేదా బయోమెట్రిక్ గుర్తింపు అవసరం లేకుండా, నగదు బదిలీ ద్వారా కాకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషక విలువలు కలిగిన తృణధాన్యాలు, పప్పులు, చక్కెర మరియు నూనెలను పంపిణి చేయాలి.

5. రైతుల సమ్మతి లేకుండా భూ సేకరణ, భూ సమీకరణ చేయరాదు. వాణిజ్య అవసరాలకు లేదా భూమి బ్యాంకుల ఏర్పాటుకు 2013 నష్టపరిహార, పునరావాస చట్టాన్ని అతిక్రమించి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోకూడదు. భూమి వినియోగం కోసం, వ్యవసాయ భూముల పరిరక్షణకు ఒక విధానాన్ని రూపొందించాలి.

6. చెరకు రైతులకు సరకు పంపిణి చేసిన 14 రోజుల వ్యవధిలో డబ్బు చెల్లించకపోతే, చక్కెర మిల్లులు తప్పనిసరిగా సంవత్సరానికి 15% వడ్డీ చెల్లించేలా చేయాలి.
7. బైటి దేశాల్లో నిషేధించిన పురుగుమందులను ఇక్కడ కూడా ఉపసంహరించుకోవాలి. సరైన అవసరాలు, ప్రత్యామ్నాయాలు పట్టించుకోకుండా, మరియు ప్రభావ అంచనా లేకుండా జన్యుమార్పిడి విత్తనాలను ఆమోదించకూడదు.

8. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలోకి అనుమతించకూడదు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) తో సహా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలనన్నిటి నుండి వ్యవసాయ రంగం నుండి తొలగించాలి.

9. అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం కొరకు కౌలు రైతులు, మహిళా రైతులు, గ్రామీణ కార్మికులనందరిని గుర్తించి నమోదు చేయాలి.

10. అడవుల పెంపకం పేరులో ఆదివాసీ రైతులను నిర్వాసితులను చేయడం ఆపివేయాలి. పెసా మరియు అటవీ హక్కుల చట్టం 2006ను సక్రమంగా అమలు జరపాలి.


No. of visitors : 239
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •