తెలంగాణా పౌరులకు విజ్ఞప్తి

| సాహిత్యం | వ్యాసాలు

తెలంగాణా పౌరులకు విజ్ఞప్తి

- సమీర | 06.12.2018 12:41:18am

ప్రియమైన ప్రజలకు వందనం.ఇది ఎన్నికల కలల కలవరింతల కల్లల కల్లోలకాలం.మనను,ఇంత ఆశనిరాశల నడుమ ఊగిస లాటలకు గురిచేస్తున్న ఉత్పాతం మీదపడ్డ;విధ్వంసమో పునర్వికాసమో దేన్ని మిగుస్తుందో తెలియక తికమక తిక్క లేపుతున్న సందర్భం.

తెలంగాణా విషయానికే పరిమితమై మాట్లాడుకుందాం అనుకున్నా,కొంత ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నపుడు గత శతాబ్ధి ఎనభైవ దశకంనుండే క్లుప్తంగా నైనా కొంత చెప్పుకోక తప్పని సరి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏక కుటుంబ ఆధిపత్య కొనసాగింపుగా,తత్ విధేయ తెలుగోడు ,యవ్వనంలోఆనాటి మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ వర్గపోరాట సానుభూతిపరుడు,అజ్ఞాత వీరులకు ఆయుధాలు మోసిన సాహితీవేత్త; తెలుగు వారి ఆత్మగౌరవ రక్షణ, నక్సలైట్లే దేశభక్తులనే అప్పటి సమకాలిక సెంటిమెంటల్ నినాదలను తలకెత్తుకొని ముందటి పరంపరానుగత రాజకీయాలకు ఝలక్ ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్నధిరోహించిన సినిమా తెర దేవుడు, అదే తెలుగోడన్న సెంటిమెంట్ తో రెకమండ్ చేసిన ప్రధానమంత్రి. ఇరువురూ కలిసి, వాళ్ళు ప్రేమించిన పోరాట వీరులను వేటాడి కాల్చి చంపినోల్లు.

అదిగో అదే దేవగురువర్యుని అధ్వర్యంలో,మార్గనిర్దేశనంలో రాజకీయ తీర్థం పుచ్చుకొని ఒదిగి ఎదిగిన ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ఉద్యమనేత,ఏకంగా ʹమావోయిస్టు ఎజెండా నాఎజెండాʹయని గురువును ʹమించినʹ శిశ్యుడై తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధి,ముఖ్యమంత్రి త్వ కుటుంబ నియంతృత్వ ,మాటల మాయల నాలుగున్నరేళ్ళ గురువును మించిన పాలనలో నలిగి,దిమ్మతిరిగి దిక్కుతోచని స్థితిలో, ఓటేయక తప్పని దిక్భ్రాంత ప్రత్యామ్నాయ రాజకీయ తడుములాటలున్న సంక్లిష్ట సమయాన నేనున్నానని,ఉద్యమ సమయంలో, మిలియన్ మార్చ్ విజయవంతంగా నిర్వహించిన,మాజీ పౌరహక్కుల ఉద్యమనేత,తెలంగాణ జనసమితి పేర, విజయమో వీర ఓటమో అన్ని స్థానాల్లో పోటీ చేద్దామని,లేత ఆశాకిరణమై వచ్చాడు. ఈ అంకం అలా కించిత్ సంధ్యా వెలుగుతో తెల్లారుతుండగ ,తెలంగాణా ప్రభుత్వ ప్రభుత్వ ప్రభువు అనుకోకుండా అగ్గనగల్ల ముందస్తు ఎన్నికల పరదా లేవట్టిండు.ఇగ జూస్కో.ఎవరి ప్రత్యేక తమదైన కష్టాల్లో వారున్న జాతీయ పార్టోల్లు, కొట్లాడి, పదేనువందలమంది, ప్రాణాలుబలిపెడితేగాని,అదాలై పోయినోల్లు,ఉద్యమ వారసత్వ మున్న తెలంగాణ మీన ఎవరి తమదైన ప్రత్యేక, ఉమ్మడి కసి,ప్రేమలతో ఏకమై ప్రొఫేసర్ సాబ్ ను కల్పుకొని కూటమిగా ఏర్పడి, మూన్నాల్గు సీట్లను TJSకు బిచ్చమేసి, మేమందరం మీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీరుస్తమని ఒచ్చిరి.సందట్లో సడేమియా వోలె,తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన ఒక ʹజాతిʹయ పార్టోల్లు,భ్రమల అల్ప సంతోశులను కల్పుకోని మరొగ ఫ్రంట్ గా ఏర్పడి, మేమే అసలు తెలంగాణా ఉద్ధారకులం అని ఒచ్చిరి.

దేవుడా ఎవర్ని నమ్మాలె,ఎవర్కి ఓటెయ్యాలె.ఇదివర్కటి లాగనే ఆందరు పైసలో,పసందైన హామీలో, రొండూనో ఇచ్చి, మాకంటే మాకని ఓటెయ్ మని అంటుంటే ఏం నెత్తి గొట్కోవాలె. సూస్త్తాంటె ఈల్లంత గల్సి అదే దొరకే పట్టం గట్టెటట్లుండరు నాయినో.

No. of visitors : 262
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •