భిన్నకోణంలో "పదేళ్ల ముంబై* *మారణ కాండ

| సంభాషణ

భిన్నకోణంలో "పదేళ్ల ముంబై* *మారణ కాండ

- పి. ప్రసాద్ (పిపి) ఇఫ్టూ | 06.12.2018 12:55:27am

*భిన్నకోణంలో "పదేళ్ల ముంబై* *మారణ కాండ"* *విశ్లేషణకై "* WHO KILLED KARKARE" పుస్తకం చదువుదాం!

ప్రియమైన మిత్రులారా, పాకిస్తాన్ "ఉగ్రవాదుల"చే ముంబై మారణ కాండకి నేటికి పదేళ్లు! దానిపై ఈరోజు మీడియా కవరేజ్ తెలిసిందే. నాటి మారణ కాండకి ప్రధాన ముద్దాయి ఎవరు? దీనిపై రెండు భిన్న వాదనలున్నాయి. భారత్ ని అస్థిరపరిచే దుష్టలక్ష్యం గల పాకిస్తాన్ దేశమే ప్రధాన ముద్దాయి అన్నది ఒక వాదన! పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి నుండి ముంబైని రక్షించలేని భారత్ ప్రభుత్వమే ప్రధాన ముద్దాయి అనేది రెండో వాదన! ఇవి గత పదేళ్లుగా భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ఉన్న రెండు విభిన్న వాదనలు! ఇవి ఏదో రూపంలో నేటి వరకు వివాదాంశాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండింటికి పూర్తి భిన్నమైన మూడో ప్రత్యామ్నాయ వాదన కూడా ఒకటుంది. ఐతే ప్రధాన మీడియా స్రవంతి(main stream media) లో దానికి చోటు లేదు. ఉండదు కూడా! పై దుర్ఘటనకు పదేళ్లు నిండిన సందర్బంగా ఈ మూడో ప్రత్యామ్నాయ అవగాహన ని కూడా అవలోకనం చేసుకోవడం సముచిత మైనది.

ఆయన విప్లవవాది కాదు. కమ్యూనిస్ట్ కాదు. విప్లవ ప్రజాతంత్ర వాది కూడా కాదు. ప్రజాతంత్ర లౌకిక వాది కూడా కాదు. ఆయనొక రాజ్యాంగ బద్ధ లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థ పరిరక్షకుడు మాత్రమే. సామ్యవాద రాజకీయ పరిభాష లో చెప్పాలంటే గరిష్టంగా ఆయనొక బూర్జువా ప్రజాస్వామ్య, లౌకికవాది మాత్రమే! పైగా బూర్జువా రాజ్య ప్రతినిధి కూడా! ఆయన పేరే SM MUSHRIF. మహారాష్ట్ర రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్! సంక్షిప్తంగా రాష్ట్ర ఐ.జి.పి. అంటారు. రాష్ట్రస్థాయిలో అత్యున్నత పోలీస్ అధికారి. ఆయన రచించిన "WHO KILLED KARKARE?" పుస్తకం చదివితే మనకి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నమ్మలేని నగ్న సత్యాలు తెలుస్తాయి. అవి సాక్ష్యాధారాలతో వినే నిప్పు లాంటి నిజాలు! ఈ పుస్తకం చదవాలంటే చాలా "చేవ" ఉండాలి. శ్రీశ్రీ రచించిన "మహా ప్రస్థానం" కి ముందు మాటలో పాఠకులకి చలం చేసిన హెచ్చరిక మనకి గుర్తుకొస్తుంది. ఎందుకని? ఇంతవరకూ మన మెదళ్ళ ల్లో పాతుకుపోయిన అనేక నమ్మకాలని అది వదల గొడుతుంది. మన తలలలో వేళ్లూనుకున్న విశ్వాసాలని పలుగులూ పారలతో తవ్వి తీస్తుంది. ఏది ఉగ్రవాదమో ఏది జాతీయ వాదమో ఇంతవరకు ఏర్పరుచుకున్న రాతిశిలల వంటి భావాలని ఒక్కసారిగా మంచుముక్క ల వలే కరిగిస్తుంది. వాటి నేపధ్యం గూర్చి దిగువన తెలుసుకుందాం

"ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పు" గూర్చి దేశప్రజలని నిరంతరం "అప్రమత్తం" చేసే కుహనా దేశరక్షణ ఏజెన్సీ లే వాస్తవ ఉగ్రవాద ఏజెన్సీ లుగా ఆయన సాక్ష్యాధారాలతో తన పుస్తకంలో వెల్లడి చేస్తాడు. Socalled ఇస్లామిక్ ఉగ్ర వాద చర్యల వెనక స్వయంగా ఇంటలిజెన్స్ బ్యూరో (IB) పాత్ర ఉందని ఆరోపించిన పుస్తకమది. ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులని దేశప్రజల మెదళ్ళల్లో బూచిగా చిత్రించి, తద్వారా సామాన్య హిందువులని హిందుత్వ రాజకీయ శక్తుల వెనక్కి సమీకరించుకునే లక్ష్యంతో జరిగిన బాంబు పేలుళ్ళుగా ఆరోపించారు. IB అధికారుల వత్తాసుతో దేశంలో హిందుత్వ సంస్థలే పై బాంబు పేలుళ్ళని చేపట్టిన నేపద్యాన్ని నిర్ధారించిన పుస్తకమిది. IB శాఖ అలాంటి వ్యవస్తీకృత హిందుత్వ ఉగ్రవాద ఏజెన్సీ గా తయారైనదని పుస్తకం వెల్లడించింది. వ్యూహాత్మకం గా దేశ ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ వంటి పోస్టుల్లో ఉన్న పాలకులని సైతం IB శాఖ పక్కదారి పట్టిస్తున్న నగ్నసత్యాన్ని వెల్లడిస్తుంది. అట్టి ఐ.బి. నేతృత్వంలోనే హిందుత్వ ఉగ్రవాద చర్యలు ఇటీవల దేశంలో ఉధృతంగా జరుగుతున్న వాస్తవాన్ని పై పుస్తకం బహిర్గత పరిచింది. నాందేడ్ బాంబ్ బ్లాస్ట్ (5-4-2006); ముంబై ట్రైన్ బ్లాస్ట్(11-7-2006); మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ (8-9-2006); అహ్మదాబాద్ బాంబ్ బ్లాస్ట్(26-72008); ఢిల్లీ బ్లాస్ట్ (13-9-2008); సంఝాతా ట్రైన్ బాంబ్ బ్లాస్ట్ (19-2-2007); హైద్రాబాద్ మక్కా మసీదు బాంబ్ బ్లాస్ట్(18-5-2007); అజ్మీర్ దర్గా బాంబ్ బ్లాస్ట్ (11-10-2007); యూపీ సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ (23-11-2007); జైపూర్ బాంబ్ బ్లాస్ట్(13-5-2008) దుర్ఘటనలు 2006, 2007, 2008లలో వరసగా ఓకే బాణీలో జరిగాయి. అవన్నీ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లోని బ్రాహ్మణీయ కోర్ గ్రూప్ (Brahmanical core team) నేతృత్వంలో పథకం ప్రకారం జరిగాయని పై పుస్తక రచయిత చాలా విశ్వసనీయ సమాచారంతో ఆరోపించాడు. (ఆయన బ్రాహ్మణికల్ కోర్ గ్రూప్ గా భావిస్తున్న వ్యవస్థాపరమైన యంత్రాంగాన్ని నిజానికి బడా కార్పొరేట్ వర్గంగా భావించాల్సి వస్తుంది) నేటి లౌకిక రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, దాని స్థానంలో హిందూ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా పై కోర్ టీం IB శాఖలో తిష్ట వేసుకొని పని చేస్తోందని ఆయన తన పుస్తకంలో ఆరోపించాడు. ఈ ప్రక్రియ దేశంలో కొత్తగా ప్రారంభం కాలేదని, దశాబ్దాల తరబడి కొనసాగుతున్నదేననీ స్పష్టం చేశాడు. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి ఉన్నత స్థాయి పాలకుల ప్రమేయం లేకుండా IBశాఖ స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వాల సైతం పక్కదారి పట్టించే లక్ష్యం & సామర్ధ్యం పై ఐ. బి. కి ఉందన్నారు. అలాంటి వ్యూహాత్మక కుట్రకి దేశ చరిత్రలో పాలనా పరంగా మొదటిసారి హేమంత్ కర్కారే ద్వారా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన స్పష్టం చేశాడు. ఇది మాలేగావ్ తదితర బాంబ్ పేలుళ్ళ పై హేమంత్ కర్కారే నేతృత్వంలోని టెర్రరిస్ట్ వ్యతిరేక బృందం విచారణని చేపట్టిన సందర్బంగా వెల్లడైనది. ఆయన బృందం విచారణ లో RSS అనుబంధ సంస్థలే పై బాంబు పేలుళ్ళకు కారణమని తిరుగులేని ఆధారాలతో రుజువైనది. అంతకు ముందు ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులు పై పేలుళ్లు సాగించినట్లు ప్రచారం జరిగింది. పై దుర్ఘటనలకి ముందే IB అధికారులు "త్వరలోనే పలానా రాష్ట్రంలో, పలానా నగరాలలో ఇస్లామిక్ ఉగ్ర వాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడే ప్రమాదం ఉంది" అంటూ వ్యూహాత్మకంగా ముందస్తు హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఆ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సందర్భాలలో ఇస్లామీక్ ఉగ్రవాదుల ప్రమాదం నుండి రక్షణ పేరిట వేలాదిమంది ముస్లిం యువకులని ముందస్తు నిర్బంధంలోకి తీసుకొని హింసించాయి. పై వివిధ దుర్ఘటనలు జరిగాక ఈ నిర్బంధకాండ మరింత కొనసాగింది. ఇస్లామిక్ ఉగ్రవాదం దేశాన్ని అస్థిర పరుస్తున్నదంటూ ఆనాడు బడా కార్పొరేట్ మీడియా సంచలన ప్రచారం చేసింది. సుమారు రెండేళ్ల ఆలస్యం గా మాలేగావ్ దుర్ఘటనపై విచారణ సమయంలో కర్కారే బృందం నిప్పు లాంటి నిజాలని వెలుగు లోకి తెచ్చింది. ఈ తిరుగు లేని ఆధారాలతో రుజువైన నిప్పులాంటి నిజాల పట్ల కార్పొరేట్ మీడియా "వ్యూహాత్మక మౌనం" పాటించింది. దేశ చరిత్ర లో మొదటిసారి రాజ్యాంగ బద్ధ IB సంస్థని ముద్దాయిని చేస్తూ అదే రాజ్యాంగ బద్దత గల మరో సంస్థ (ATS) ఆరోపణలు చేయడం ఒక సంచలనం! RSS సర్కార్ని మున్ముందు అధికారంలోకి తెచ్చుకునే లక్ష్యంతో బడా కార్పొరేట్ వర్గాలకి నానాటికి ఒక వ్యూహం ఉంది. అందులో భాగంగానే IB తన పాత్రని పోషించింది. పై నేపథ్యంలో కర్కారే టీమ్ ని అంతం చేయడానికి IB కంకణం కట్టుకున్నది. అట్టి హత్యా పధక వ్యూహంలో భాగమే ముంబై దాడుల రోజు (26-11-2008) హేమంత్ కర్కారే తో పాటు ఆయన టీమ్ సభ్యులైన అశోక్ కమాటే, సలాస్కర్ ల హత్యలు! ఇదీ పై పుస్తక రచయిత వాస్తవ నిర్ధారణ చేసిన నేపధ్యం.ఈ పుస్తకం తో పాటు "TO THE LAST BULLET" పుస్తకం కూడా చడవదగింది. ఆ పుస్తక రచయిత్రి వినీతా కమాటే! ఆమె అశోక్ కమాటే జీవిత సహచరి. ఆయన హేమంత్ కర్కారే ATS టీమ్ మెంబెర్. అదే రాత్రి కర్కారేతో పాటు తూటాలకు బలయ్యాడు.

కర్కారే& ఆయన టీమ్ సభ్యులని 26-11-2008 రాత్రి ఎందుకు అసహజం గా అక్కడకి పిలిచారు? వాళ్ళు అప్పుడు విచారణ విధిలో ఉన్నారు. ముంబై దాడుల నియంత్రణ విధి వేరొక శాఖది. ఐనా ఆ రాత్రి కర్కారే టీమ్ ని ఎవరు పిలిచారు? మిగిలిన combat forces ఒకవైపు పంపించబడితే, కీలకస్థలం రంగభవన్ గల్లీ వైపు కర్కారే టీం నే ఎందుకు పంపారు? కర్కారే జీవిత సహచరి కవితా కర్కారే ఈ వివరాల సేకరణ కి చేసిన ప్రయత్నాలకి ఆనాటి ప్రభుత్వాధికారులు ఎందుకు సహకరించ లేదు? ఆమె నాటి యూ.పి.ఏ ప్రభుత్వ అదినేత్రి సోనియా తో సహా ఎందరో నేతలని కలిసినా పలితం ఎందుకు లేదు? ఇవన్నీ నేటికీ అంతు పట్టని రహాస్యాలే! అందుకే పై దాడులకు పదేళ్లు నిండిన సందర్బంగా who killed karkare అండ్ To the last bullet పుస్తకాలు చదువుదాం.

1920వ దశాబ్దంలో నాజీ పార్టీ జర్మనీ లో ప్రతిపక్షంగా అంచెలంచెలుగా ఎదిగింది. నాడు సోషల్ డెమోక్రాటిక్ ప్రభుత్వం నాజీ పార్టీ పట్ల ఉదార వైఖరి చేపట్టింది. అదే ప్రభుత్వంలో కొందరు అధికారులు నాటి సోషల్ డెమోక్రాటిక్ రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిజాయితీగా నాజీ పార్టీని ఎదిరించి నిలబడ్డారు. ఆ క్రమంలో నాటి రాజ్యాంగ విధుల నిర్వాహణ కోసం అసువులు కోల్పోయారు. మరో రూపంలో నేడు పునరావృతం అవుతున్న విధ్వంసకర చరిత్రక్రమం తెలిసిందే! దానికి ఇది అద్దం పడుతోంది. ప్రకటిత లౌకిక, ప్రజాతంత్ర రాజ్యాంగ విలువల పరికిరక్షణ కోసం కొందరు పోలీసు ఉన్నతాధికారులు నియో నాజీయిజం పట్ల నిష్కర్షగా వాస్తవాల సేకరణ కోసం నిర్భీతిగా, నిజాయితీగా నిలబడి, తమ వృత్తి ధర్మ నిర్వాహణ కోసం ప్రాణాలు వదిలారు. కానీ ప్రజలు ఎన్నుకున్న కుహనా ప్రజా ప్రభుత్వాలు తామే ఒకవైపు పేలుళ్ల దుర్ఘటనల పై ప్రత్యేక విచారణకోసం ATS బృందం నియమించి, మరోవైపు దాని అధికార్లని రక్షించుకోలేక పోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఫాసిస్టు శక్తులకి వాళ్ళని బలిపశువులుగా అప్పగించాయి.రేపటి భయంకర విశ్వ రూపం పట్ల ఒక స్పష్టత కోసం పై పుస్తకాల అధ్యయనం అవసరం. అందుకే వాటిని కొనుక్కొని చదువుదాం. అందుకు ఇదో సముచిత సందర్భం.

No. of visitors : 421
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !

ఇఫ్టూ ప్రసాద్ (పిపి) | 18.02.2019 09:45:37pm

ఈ "యుద్ధోన్మాదం" కొనసాగితే రెండు వైపులా ప్రధానంగా మన రైతు, కూలీల బిడ్డలే సమిధలుగా మారతారు. అదే సమయంలో అటు పాకిస్తాన్, ఇటు భారత్ లూటీ సర్కార్లు మాత్రం......
...ఇంకా చదవండి

నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం

పొలారి, ఇప్టు | 20.01.2019 11:43:27am

నెల్లిమర్ల కార్మికోద్యమం ఆనాడు "మినీ చికాగో"గా అభివర్ణించబడింది. అది నాడు ప్రారంభమవుతున్న నూతన పారిశ్రామిక, ఆర్థిక విధానాలపై భారతదేశంలో తలెత్తిన తొలి సమర.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •