కాలా ఆజా

| సాహిత్యం | క‌విత్వం

కాలా ఆజా

- ఇండస్ మార్టిన్ | 06.12.2018 01:02:23am

బురకా తొడుక్కున్న ముసలి రేత్తిరి
బాద్రపదం ముసురులో
తడిసి మోపెడౌతున్న తెల్లారగట్ట
గంపెడు సంసారాన్ని మోసుకుంటా
పాచి మొహం బిగినేసుకి దిగబడుద్ది
కసుకూరు వాడలో బెల్లపు అట్ల బూబమ్మ
కుట్టుపోగుల సోకు అల్లాకు ఎరుక
చెడిపోయిన గుడ్డల మిసినిలా మూలన పడ్డా
సాయిబు సంపాదనకు కొబ్బిరి సమురు అవుదామని
జెమినీ పళ్ళపొడిలో హోలీ ఆడిన
మాలిపిల్లి కూలీ నాలికల మీద
ఎచ్చటి ఫజర్ పొద్దై పొడుస్తుంది అమీనాబీ

ఇంటూరు మాలిపిల్లి ఆడంగులు
కోకలు పైకి దోపి కోతల కమతాల్లో
కంకుల కొలువుకు పోయే దారిపక్కన
కమ్మరి కొట్టాంలో కొడవళ్ళు సరవడానికి
తోలు తిత్తుల నిండా
జీవవాయువు వూదే జిలానీ భాయ్
మలాటు పోటు సాక్షిగా
దుహార్ కొలిమి ముందు మోకరిస్తాడు

పసుమర్తిపాలెం జీతగాళ్ళంతా
అడ్డగుడ్డలు ఎగ్గట్టి
టైరుబండ్ల నిండా తోలుకెళుతున్న
సిరుల మొలకొలుకుల
మాసూళ్ళ మజ్జాన్నపు వేళ
సైఫను సపటా మీద
ఇంటిపేరే పంచర్లు అయిన ఖాశిం కాకా
బతుకు బొక్కల్ని పూడ్చడానికి
అసర్ సులోషన్ పొదుపుగా పూస్తాడు

పెయ్యల్నీ దున్నల్నీ మేపి
కాళీ కడుపుల్తో పొలిమేర్లు దాటి
పొగసూరిన వూరి దిక్కు
ఈడ్సుకుంటా వత్తన్న
బుడ్డోళ్ళ దావార్తి తీర్చడానికి
ఈదులెమ్మటి చెక్క బండై
సోడా బుడ్ల శబ్ధంలోనే
అద్దురూపాయికి ఒకటని
మగ్రిబ్ వేడుకోలు చేస్తాడు
సందోలు సత్తార్ సాయిబు

చెరుకుపల్లి బస్టాండింగ్ సెంటర్లో
ఆకరి ట్రిప్పు ఎక్కబోతన్నా
కాలవ కూలీల కడుపులకు
సందమావ బిస్కెట్టూ నాన్రొట్టే అందిస్తా
వాడల కడుపు చూసే తల్లిలా
ఇషా నమాజుతో దినాన్ని ఖతం చేస్తుంది
అల్లాబక్షు చాయ్ దుకాణం

అంటరాని బ్రతుకుల్లో అగమానాల చివర
బతుకుదెరువుకూ - కన్నీళ్ళ తుడుపుకూ
నీసు ముద్దకూ - పీర్ల గుండం డప్పుకూ
ఈ జత కలవటం యాదృచ్చికమంటే
ఎట్టా నమ్మటం?
మా గూడెపు గడ్డతో
మసిబారిన మా బతుకులతో
డొక్కలెండిన మాయమ్మల పేగులతో
బీడు పోయిన మా పిల్లల గొంతులతో
ఏ సంబంధం లేకోకుండానే
మమ్ముల్ని కనిపెట్టుకుని
మీరు వుండారంటే
ఏంది ఇవరం?
గోధుమ వర్ణుల ఆజా పాట వైపు
అచ్చం మాలెక్కనే అగపడే
మీ నల్లటి మనుషుల అడుగులు కదలటం
ఎట్టా మొదలయ్యిందోననే
మూలాల ఎతుకులాటకోసమైనా
చెరొక్క చెమట చుక్కను
ఈ దేశపు వివక్షా పరీక్ష నాళికలోకి వంపుదాం...
చుట్టూతా వున్నా కంపును కడిగేస్తా
అత్తరు ఏరై అవి పొంగి పొర్లవా
కత్తుల వానై ఈ కులనాగుల కుత్తుకలను
కాలే మస్తాన్ దర్గాముందు
బిస్మిల్లా హలాల్ చేయవా!

డిచ్చనేరు:
------------
ఫజర్: వేకువ ప్రార్ధన
దుహార్: ఉదయ ప్రార్ధన
అసర్: మధ్యాహ్న ప్రార్ధన
మగ్రిబ్: సాయంత్ర ప్రార్ధన
ఇషా: రాత్రి ప్రార్ధన
సైఫన్: నీటిని దారి మళ్ళించే విధానం. సైఫన్ థియరీ మీద ఆధారపడి తవ్విన కాలువ
సపటా: సిమెంట్/ బండ రాళ్ళ రేవు
ఆజా : ప్రార్ధన కోసం రమ్మని మసీదు నుండి వినబడే రాగం





No. of visitors : 273
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •