అక్షర చెప్పిన చిన్న కథ

| సంభాషణ

అక్షర చెప్పిన చిన్న కథ

- అశోక్ కుంబము | 21.12.2018 01:41:33am

ఈ రోజు మా ఆరేళ్ళ అమ్మాయి అక్షర చెప్పిన చిన్న కథ

[ఈ రోజు పడుకోబెడుతుంటె ఎందుకు గుర్తుకొచ్చిందో తనకు తెలియదు కాని, ఎప్పుడో తనకి చదివిన గాంధీ పుస్తకంలో అంతా మరిచిపోయింది కాని ఒక "అంటారినితనం" అనే పదాన్ని మాత్రం గుర్తుంచుకుంది. "అంటరానితనం అంటే ఏంటి డాడీ" అని అడిగింది. నేను చెప్పింది అంతా విని "అలా మనుషుల చూడడం ఎంత తప్పు కదా! నాకు చాలా బాధగా వుంది" అంటే కాసేపు మాట్లాడించి (ఓదార్చి!) పడుకోపెట్టే ప్రయత్నం చేసిన. మనసు చెదిరిన బిడ్డ కదా, ఎంతకు పడుకోట్లేదు. ʹతాను పొద్దున్నే బడికి పోవాలి కదా, ఎలాʹ అని నేను అనుకుంటుండగానే వున్నట్లుండి సడన్ గా కూర్చొని "డాడి, నీకో కథ చెప్పాలి. అది అంటరానితనం మీద" అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది ʹచిటికెలో కథ తయారు కావడం ఏంటాʹ అని. బడి సంగతి ఎట్లనో పొద్దున్నే చూద్దాం అనుకోని "సరే చెప్పు" అని నేను రెఢీ అయిపోయిన…తాను చెప్పడం మొదలు పెట్టింది.]

అనగనగా ఒక అమ్మాయి వుండేది. వాళ్ళకు బాగనే డబ్బు వుంది. ఏ బాధలు లేవు.

కాని ఒక రోజు ఆడుకోవడానికి బయటకు పోయి దారి తప్పి అంటరాని మనుషులు వుండె ఒక వాడకు పోతుంది.

మొదటిసారి బాధల్లో వున్న మనుషుల చూస్తుంది. వాళ్ళు బాగా చిక్కిపోయి వున్నారు. బట్టలు కూడా సరిగ్గా లేవు. బయటనే పడుకోని వున్నారు.

ఆ అమ్మాయి ఆ వాడలోకి పోతుంటె, ఎవరో వెనకనుండి ʹవాళ్ళు అంటరానివాళ్ళు, ముట్టుకోకు" అని గట్టిగా చెప్పినట్లు వినపడుతుంది.

ఆ అమ్మయికి ఒక్కసారిగా ఎంతో బాధ అనిపిస్తుంది. "వీళ్ళు పేదోళ్ళే కాదు, అంటరానివాళ్ళు కూడానా!" అని బాధ పడి, ఆ వాడకు మరో వైపున వున్న గుడికి పోతుంది.

అక్కడికి పోయిన వెంటనే దేవుడిని ఒక కోరిక కోరుతుంది "దేవుడా ఎలాగైనా ఆ అంటరానితనాన్ని పోగొట్టు" అని.

ఆ అమ్మాయి మాట వున్న దేవుడు వెంటనే ప్రత్యక్ష్యమై "సరే నేను నీలో చేరిపోయి వాళ్ళతో మాట్లాడుత, పోదాం పదా" అని అంటడు.

ఇక దేవుడితో పాటుగా ఆ అంటరాని వాడకు పోతుంది ఆ అమ్మాయి.

అక్కడికి వెళ్లగానే వాళ్ళతో ఏదో చెప్తూ గట్టిగా మాట్లాతుంటుంది, ఎందుకంటె తనలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి.

ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే, ఆ దేశం రాజుకు వినపడేంత గట్టిగ.

ఆ రాజుకు గట్టిగా మాట్లాడేవాళ్ళంటే నచ్చదు.

వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించి జైళ్ళో పెట్టిస్తాడు.

అప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి అడుగుతుంది "ఇప్పుడేం చేద్దాం" అని.

అప్పుడు దేవుడంటాడు "నేనుగా ఏమి చేయలేను. ఆ రాజును ఓడించాలంటె మళ్ళీ ప్రజల దగ్గరికి పోవాల్సిందేʹ అని.

అది విన్నాక ఆ అమ్మాయికి అప్పుడు అర్థమయ్యింది "దేవునికన్నా ప్రజలే బలవంతులని. వాళ్ళే ఎలాగైనా అంతరానితనాన్ని ధ్వంసం చేస్తరని."

[కథ చెప్పాక కాని బిడ్డ కంటి నిండా నిద్దుర పోలేదు.]





No. of visitors : 344
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మొద్దుబారుతున్న సమాజం

అశోక్ కుంబము | 02.05.2018 10:50:42am

దేశం మొత్తంలోనె అత్యంత చైతన్యవంతమైన పౌరసమాజం ఉన్న తెలంగాణ కొత్త రాస్ట్రం గా ఏర్పడ్డాక ఎందుకు తన గొంతును తానే నొక్కేసుకొని మూగగా మారిపోయిందే ప్రశ్నించుకో.....
...ఇంకా చదవండి

ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందే

అశోక్ కుంబము | 20.01.2018 01:08:15am

అంటరానోళ్లంతా మా అగ్రహార విద్యాలయాలలో పిడికిళ్ళ వనమై విస్తరిస్తుంటే మా అగ్రవర్ణ ఆదిపత్య పిలకలెట్ల మొలుస్తయ్? మీ నీడనే మహా పాతకమనుకుంటే నీలి ఆకాశమై ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
    బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య
    పంచాది నిర్మల
    గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి
    అరుణతార డిసెంబర్ - 2018
    ఎవరి గురించి మాట్లాడుకుందాం?
    వదిలి వెళ్లకు...!
    వెల్తుర్ధ్వని
    దిశంబర్ 6
    ఆ...ఏడురోజులు
    కాపాడుకుందాం
    నేను నగర మావోయిస్ట్

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •