నేను నగర మావోయిస్ట్

| సాహిత్యం | క‌విత్వం

నేను నగర మావోయిస్ట్

- సమీర | 21.12.2018 01:45:36am

నేను నగర మావోయిస్ట్
ఆ, అదీ నేనంటే
సూస్తలేవా
ఆ రాజ్యంకు
నామీదే కాదు నీమీదా
మనిద్దరి మీదా ప్రేమ లేదు
ఎందుకంటే
నేనొక అర్బన్ నక్సల్‌

ఎంత ఆనందం!
నేను వైవిధ్యపు బిడ్డను
అడివి జంతువులా
మొరటుగా అనాగరికంగా
పెరిగుతున్న
మెదడును తొలిచే
బర్మా
ఘనీభవించి
ఒకేచోట అతుక్కునే
నైజాన్ని
ఎప్పుడో శానా వెనక
విదిల్చి వొదిలేసిన
అర్బన్ నక్సల్ నేను
అడవినీ నగరాన్నీ
సమంగా ప్రేమించే నాకే
కాదు నీకూ ఈయనీకె
స్మార్ట్ సిటీలో
కాసింత చోటు లేదంట
నిండా ద్వేశం నింపుకొన్న
జాతి వ్యతిరేకిననీ
అంటాండ్రు వాళ్లు నన్ను
ఎందుకంటే
వాల్లనుకుంటాండ్రు
నేను రాజద్రోహినని
గడువు లోపు
నేనొప్పుకొని తీరాలె
ఇంతకూ నేనడిగిందేమీ?
శాంతియుత ఒక నేల తునక
కానీ
సర్కార్ ఎప్పుడూ విశ్రమించదు
నన్ను వేటాడనీకె
ఎందుకు?
నేనొక సురేన్ ఒక సుధా
ఒక రామ్ (గుహ) ఒక క్రిష్ణ(టి. ఎమ్.)
ఒక నౌలఖా ఒక ఫెరెరా
ఒక వరవర అంతేనా
ఒక నెహ్రు ఒక గాంధీనీ
ఐన
నేను ఒక అర్బన్ నక్సల్

స్వాగతం
స్వేచ్ఛాయుత నేలకు
సుస్వాగతం

(డిశంబర్ 3న ʹద హిందూʹ పత్రికలో శివ్ విశ్వనాథన్ రాసిన ఆర్టికల్ లోఉటంకించిన గీతనికి స్వేచ్ఛానువాదం)





No. of visitors : 327
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


క‌వితా వ‌చ‌నం

సమీరన్ | 18.02.2019 09:39:57pm

స‌దువుకొన్న మనుషులు సాఫ్ట్‌ వేర్ కంపెనీ కేబిన్ లనో కార్పొరేట్ ఆస్పత్రులు షాపింగ్ మాల్స్ పెంపుడు పెట్ లుగనో కాపలా కుక్కలూ రిసీవింగ్ రిసెప్ష‌నిస్ట్ లో ......
...ఇంకా చదవండి

సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం

సమీర | 02.07.2019 11:10:42pm

సాహిత్యం అంటే మనకళ్ళముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయంవల్ల, కొన్ని అభద్రత వల్ల చూడం. కొన్ని ఒక బలమైన భావజాల ప్రభావం వల్ల మన .......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
    మేఘాలొస్తాయి
    న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
    Justice in deep slumber
    ఎర్ర పిడికిలి
    వేకువ గానం
    అతడేమన్నాడు
    వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
    ఎరవాడ జెయిలులో ఈ వేకువ
    రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •