కాపాడుకుందాం

| సాహిత్యం | క‌విత్వం

కాపాడుకుందాం

- భండారు విజయ | 21.12.2018 01:49:58am

ఇప్పుడిక
ఎన్ని ప్రశ్నలు సంధించితే మాత్రం ఏం లాభం?
నదులు కలబోసుకోవడం
సముద్రాలు ఉప్పొంగడం
మనల్ని తొవ్వుకోవడం తప్ప..
మనం చేయగల్గింది మాత్రం ఏముంటుంది?
గురికొట్టి వేసిన రామబాణం
తగలాల్సిన చోటే తగిలాక
ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా
లాభం వుండదని తెల్సుగా..!

అక్కడ చూడూ..
విలవిల లాడుతున్న
ఆ చిన్ని మెత్తని గుండెను
హత్తుకుందాం రాండి..!
జీవిత సహచరుడు
వదిలి వెళ్ళిన చేతుల స్పర్శను
ఆలింగనం చేసుకుందాం
గీతల మాటున చిక్కిన
వెలుగు దిశను వెలిగిద్దాం పదండి..!

ఎన్ని విస్పోటాలను చూస్తూ
గుండెను రాయి చేసుకుందో?
మరెన్ని కన్నీటి సంద్రంపు అలల తాకిడిని తట్టుకుందో?
ఒక్క రాత్రిలో మాత్రం
ఒరిగేది ఏముంటుంది?
ఎన్ని వేల రాత్రుల నిద్రను
ఆమె దిగమింగిందో కదా?
బాధాతప్త హృదయాల
బంధ విముక్తి చేయటానికి
ఆయన సంకెళ్లను తగిలించుకున్నాక
వరదలా ఆమె అతన్ని హత్తుకుoది

ఇప్పుడా కోటగోడల పాలకముఖాల
దొంగచాటు రహస్యాల ముచ్చట్ల
గుట్టువిప్పి గుండెనిండా పరిచేద్దాం
వాడి నార తోలును ఉతికేద్దాo
వాడుట్టి పిరికి గొడ్డు..
వాడికెప్పుడూ ఏడ్వటం తప్ప
ఆలింగనం చేసుకోవడం ఏం తెల్సు?

స్వరాలకు గురిపెట్టడం తప్ప
పరితపించడం తెల్వని వాడు
అధికారం సంధించటం తప్ప
సముద్రం లోతుని తెల్సుకోలేని వాడు
ఎన్ని ప్రశ్నలను మాత్రం
వాడు బంధించగలడు చెప్పు?
రెక్కలున్న మనుషుల మధ్య
ముతక బారిన వాడి ఆలోచనల రాకాసి వలను
ఛేదించటం మనకు రాకపోతే కదా?
నిర్ణయం వకరటింకరగా కాదు
సూటీగా గురిపెడ్తాం..పదండి..
ఇప్పుడిక కన్నీరుకు కాదూ...భయపడాల్సిoది!
కాలం కౌగిట్లో దాచుకోవల్సిoది
ఇంకిపోకుండ కాపాడుకోవల్సిoది..కనుదోయినే కదా!

No. of visitors : 189
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •