వెల్తుర్ధ్వని

| సాహిత్యం | క‌విత్వం

వెల్తుర్ధ్వని

- మహమూద్ | 21.12.2018 07:42:29pm

గుర్తుందా నీకు

నా ఖాళీ సమయాలకి

రంగవల్లులల్లడానికి

చూపును కుంచె చేసుకొని

మన మధ్య నెమళ్ళలా

పురివిప్పిన అనుభవాల వర్ణాలను ఉపయోగించేదానివి

అవి నాతో ముమ్ముర్తులా

నీలాగే ముచ్చట్లాడేవి

అలా నిశ్శబ్దం దూరమయేది

గుర్తుందా నీకు

విప్లవరచనలను చదువుకోడానికి

చెట్టుకింది చీకట్లో కాసింత వెలుతురు కోసం

తడుముకున్న రాత్రులలో

వెన్నెలను వెట్టబెట్టుకొచ్చేదానివి

అలా నా చుట్టూ పిల్లదీపాల తోటొకటి వికసించేది

అలా మనసు భారం కొల్పోయేది

ఇద్దరి గమ్యంలోని అవగాహన అర్థవంతం అయ్యేది

గురుతుందా నీకూ

సాయంత్రపు వెలితికి గోధూళిని అద్దేదానివి

అరణ్యం ఆ కాసేపు ఆలీవ్ గ్రీన్ దుస్తులోదిలి ఎర్రదనాన్ని ఆఛ్ఛాదన చేసుకునేది

రాత్రికీ పగటికీ మధ్య తేడాలను తుడిచేసే

అనుభవాల పంట ఒకటి పండేది

గుర్తుందా నీకు

నీ భుజమ్మీది తుపాకి కొనకు సూర్యుడు

మెత్తటి సాయంత్రం ఎండని వేలాడదీసి

అల్విదా చెప్పేవాడు

కనుల మీది కలవరింతల జాడ

శత్రువు బూటుచప్పుడులా

నిద్దురను కలవరపాటుకు గురిచేసినపుడు

పీడకలలను కంటిపై వాలనీయకుండా

తన కలలను కప్పిన అమ్మలా

కలల వసంతానివై వచ్చేదానివి

అలా వెచ్చటి షుషిప్తి దగ్గరయ్యేది

భయం దూరంగా పారిపోయేది

నా రాత్రిని కంటికి రెప్పలా కాపాడిన నీ సెంట్రీ డ్యూటికి

నా ఉదయం రెడ్ సెల్యూట్ చేసేది

ఇపుడంతా

నా చుట్టూ నీ సహచర్యం పరిచిన వెలుతుపుంజాలే సుమా

కొండలూ గుట్టలూ కలిసి దాటినపుడు

నువ్వొదిలి వెళ్ళిన నిట్టూర్పూల్లోని పరిమళం

కొన్ని రోజులుగా ఇక్కడే ఎగురుతూన్నదిలే ప్రేమా

ఈ ఎడబాటు

కర్తవ్యదీక్షలో భాగమనే అన్నావు వెళుతూ వెళుతూ

చివరి చిర్నవ్వు చిరకాల జ్ఞాపకమై ఇక్కడి సీతాకోక రెక్కల్లో రెపరెపలాడుతూ ఉన్నది

నీ తుపాకీ మీద అరణ్యం చేసుకున్న

వాగ్ధానం కూడా నాకు తోడుగా ఉంది

కఠిన దారుల్లో శత్రువుతో తలపడినపుడు

నీ పెదవిపై చెదరని ఆత్మవిశ్వాసపు వెల్తుర్ధ్వని

అలా నా ఆత్మ నిండాపేరుకుపోయింది

నీవెపుడూ నాకు దూరం కావు

నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు

నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు….

No. of visitors : 234
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •