వదిలి వెళ్లకు...!

| సాహిత్యం | క‌విత్వం

వదిలి వెళ్లకు...!

- గీతాంజలి | 21.12.2018 07:53:43pm

ఎలా వుండాలి నీవు లేక..
ఎలా చేరాలి నీ దాకా?
వదిలి వెళ్ళకు..

నన్ను చంద్రుడు లేని చీకట్లలోకి..
నిన్ను కన పడనీయని అంధత్వంలోకి.
వదిలి వెళ్ళకు..

నన్ను అంతులేని రాత్రులలోకి..
కలలు లేని ఖాళీ నిద్రలలోకి.
వదిలి వెళ్లకు..

నన్ను తెల్ల వారనీయని ఉదయాల్లోకి..
మోదుగలు పూయని అరణ్యాలలోకి.
వదిలి వెళ్ళకు ..

నన్ను దహించుకు పొమ్మని ఎడా రుల్లోకి..
తోడేళ్ళకి..త్రాచులకి..
ఉరికొయ్యలకి...శబరి నదులకి.
వదిలి వెళ్ళకు ..

నన్ను కాషాయం గుచ్ఛే ..
గర్భ గుడుల్లోకి.
వదిలి వెళ్ళకు ..

నన్ను నీ కవితలు లేని పుస్తకాల్లోకి..
నీ పదాలు లేని పాటల్లోకి.
వదిలి వెళ్ళకు..

నన్ను నీ మాటలు లేని మౌనంలోకి..
సడి చేయని సంగీతంలోకి.
వదిలి వెళ్ళకు..

నన్ను నీ పాద ముద్రలు లేని కర్కశ వీధుల్లోకి..
తాళం వేసిన ఇంటి ముంగిటిలోకి..
వదిలి వెళ్ళకు..

నన్ను నా కన్నీటిలోకి..
నీ చూపులు సోకని నా కన్నుల్లోకి..
నువ్వు లేని నా చూపుల్లోకి.
వదిలి వెళ్ళకు..

నన్ను నువ్వు కనిపించని కాలానికి..
నువ్వు లేని లోకానికి.
వదిలి వెళ్ళకు..

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి..
సముద్రం లేని భూమి మీదకి.
వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు..

ఎలా ఉండాలి నీవు లేక...
ఎలా చేరాలి నీ దాకా?
నిన్ను చేరాలంటే..
కామ్రేడ్..
బందీలమన్నా కావాలి...
సముద్రంగా అయినా..
మారి పోవాలి..!





No. of visitors : 513
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •