గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి

| సాహిత్యం | వ్యాసాలు

గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి

- | 22.12.2018 03:06:42am

1969 డిసెంబర్ 22వ తేదీన పంచాది నిర్మల, రమేశ్ చంద్ర సాహు వంటి మరో ఐదుగురు విప్లవకారులతో పాటు పోలీసుల తూటాలకు బలైపోయిన అమరుడు కళాకారుడు, విప్లవకారుడు సుబ్బారావు పాణిగ్రాహి. ఒరిస్సా- ఆంధ్ర సరిహద్దుల్లో పోలీసులు చుట్టుముట్టిన సమయానికి సుబ్బారావు వ్యాధితో బాధపడుతున్నాడు.

పాణిగ్రాహి చాల అరుదైన కమ్యూనిస్టు. బహుశా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఆయనకు సాటి ఎవరూ లేరు. చైర్మన్ మావో యిలా అన్నాడు. "చైనా ప్రజల విముక్తి కోసం మనం సాగిస్తున్న పోరాటంలో చాల రంగాలున్నాయి. కలంతో పోరాడే సాంస్కృతికరంగం. తుపాకీతో పోరాడే మిలటరీ రంగం వాటిలో ప్రధానమైనవి. శత్రువును ఓడించడానికి మనం ప్రధానంగా తుపాకుల సైన్యం మీద ఆధారపడాలి. కానీ యీ సైన్యం మాత్రమే చాలదు. మనకు సాంస్కృతిక సైన్యం కూడా ఉండాలి. మన ప్రజలనందరిని సమైక్యం చేసి శత్రువును ఇది అనివార్యమైనా అవసరం"

కామ్రేడ్ పాణిగ్రాహి మిలటరీ రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ అసమానయోధుడు. ఆయన అమరుడయ్యేనాటికే ఆంధ్రలో సుప్రసిద్ధమైన విప్లవ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీకాకుళంలో సాయుధ రైతంగ పోరాటం ప్రారంభమైనప్పుడు ఆయన పాటలు, కవితలు, ఆంధ్రదేశమంతా మార్మోగినవి. ఈ విప్లవకవి, గాయకుడు తుపాకీ చేతబట్టి, గెరిల్లా దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించి, వర్గశత్రు నిర్మూలన చేసి, గ్రామ సీమల్లో భూస్వాముల, పెట్టుబడిదారుల, వాళ్ళ తొత్తుల పరిపాలనను అంతం చేయడానికి ఒక్క లిప్తకాలమైనా సందేహించలేదు.

సోంపేట తాలూకాలోని ఒరియా కుటుంబంలో పుట్టిన పాణిగ్రాహి బడిలో చదువుకున్న కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు. అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న కాలం. ఆంధ్రలో రివిజనిజానికి వ్యతిరేకంగా, రివిజనిజం ఎన్నో రూపాల్లో తలెత్తిన అన్ని వేళల్లోనూ పోరాటం సాగించిన వారిలో పాణిగ్రాహి ఒకడు. రివిజనిస్టులకు పాణిగ్రాహి ఒక సింహస్వప్నం. తెలుగుదేశమంతటా విరివిగా ప్రచారంలో ఉన్న ఆయన విప్లవ పాటలు, కవితలు రివిజనిజాన్ని నిర్దాక్షిణంగా దాని నిజరూపంలో బయటపెట్టినవి.

"డబ్బులకై ఆశయాలు అంగడిలో అమ్ముకోము

నిర్బంధాలకు భయపడి రివిజనిస్టులము కాము "

ఆయన పాటలు, కవితలు, విప్లవ కంఠం ఎత్తిన ఎర్ర జెండాలు. విప్లవ ఖడ్గం పాడిన రక్త గీతాలు.
ఆయనకు జానపద కళల్లో చాల అభిరుచి. "జముకల కథ" అనే ఒక విధమైన సంగీత రూపకాన్ని అయన ప్రజాదరణలోకి తెచ్చాడు. ఇందులో ముగ్గురు నటులుంటారు. పాణిగ్రాహి కట్టిన దళంలో ఉన్న కామ్రేడ్ తామాడ చిన్నారావు అనే 14 సంవత్సరాల బంగారుబాబు విప్లవం కొరకు కామ్రేడ్ పంచాది కృష్ణమూర్తితో పాటు తన ప్రాణాలర్పించాడు. జముకల కథకు దర్శకుడు, ప్రధాన నటుడు కూడా పాణిగ్రాహే. గిరిజన రైతాంగ పోరాటం యీ రూపకానికి వస్తువు. తెలుగుదేశమంతటా యీ జముకుల కథను ప్రదర్శించి యీ విప్లవకవి, నాటకకర్త, గాయకుడు ప్రజలలో ఒక విప్లవ వెల్లువలాంటి చైతన్యాన్ని సృష్టించగలిగాడు. కామ్రేడ్ పాణిగ్రాహి రచనల్లో రాజకీయాలకు కళకు ఐక్యత సిద్దించింది. విప్లవ రాజకీయ వస్తువుకు, కళానైపుణ్యానికి పాణిగ్రహణం చేసినవాడు పాణిగ్రాహి.

కామ్రేడ్ పాణిగ్రాహి కవి, విప్లవకారుడు. ఆయనకు కవికుండే ఆవేశం ఉండేది. అందుకే ఆయన మాటలెప్పుడు వెచ్చదనంతో కాంతివంతంగా ఉండేవి. ఆయనెప్పుడూ నిరుత్సాహంగా చల్లగా మాట్లాడి ఎరుగడు. అయన విప్లవ ఆవేశమంతా విప్లవ ఆవేశమే. సాయుధ పోరాటంలో చేరడానికి ముందు వృద్ధురాలైన తల్లితో ఇలా అన్నాడు " అమ్మా నన్ను, నిన్ను వదిలి వెళ్లనివ్వు. నీ పట్ల నాకు బాధ్యతలున్నవి. కాని దుర్భరమైన దారిద్ర్యంలో దుఃఖంలో భారతదేశమంతటా బతుకుతున్న కోట్లాది తల్లుల పట్ల కూడా నాకు బాధ్యత ఉన్నది". పార్టీని వదిలిపెట్టి అయన ప్రతిభను డబ్బు చేసుకోడానికి ఉపయోగించుకోమని సలహా ఇచ్చిన వారికీ ఇలా చెప్పేవాడు " ప్రపంచంలో గొప్పతనంగా భావించడమైనది ఏమైన ఉందంటే అది కమ్యూనిస్టుగా బతకడం, ప్రజల కొరకు పనిచేయడం". చివరి నాలుగు నెలలు ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడ్డాడు. కామ్రేడ్ భాస్కర రావు, కామ్రేడ్ గణపతులను పాశవికంగా పోలీసులు కాల్చివేసిన తరువాత సోంపేట ఏరియా కమిటీకి పాణిగ్రాహి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. ఈ సోంపేట కమిటీయే చాల తాలూకాలలో సాయుధ పోరాటం వ్యాపించడానికి తోడ్పడింది. ఆయన ఆనారోగ్యంగా ఉన్నా నాయకత్వ బాధ్యతను స్వీకరించాడు. "నా ఆరోగ్యం ఇక బాగుపడదు, రోగంతో చావడం కన్నా పోరాటంలో చావడం మేలు కదా !" అన్న కామ్రేడ్ కోరిక నెరవేరింది. ఆయన వీరోచితంగా మరణించాడు. ఒక అసమాన విప్లవకారుని మరణమది.

ఒరిస్సా - ఆంధ్ర ప్రజల ఉద్యమ సంస్కృతిని తనలో జీర్ణించుకున్న పాణిగ్రాహి వాళ్ళ ఐక్యతకు చిహ్నం. ఈ రెండు గొప్పజాతులు ఈనాడు ఐక్యంగా విముక్తి వైపు సాగే ప్రజాయుద్ధంలో కలిసి ముందుకు సాగుతున్నాయి.

కలాన్ని. కత్తిని ఒకేచేత పట్టిన విప్లవ కళాకారుడు, విప్లవకారుడూ అయిన సుబ్బారావు పాణిగ్రాహిని ఒరవడిగా పెట్టుకుని 1970 ఆక్టోబరులో పాణిగ్రాహి నగర్లో (ఖమ్మం) ఏర్పడిన విప్లవ రచయితల సంఘం ఆయన విప్లవ దీక్షనూ, కదన దీక్షనూ స్వీకరించడానికి యీ నాల్గవ సంస్మరణ దినం రోజు ప్రతిజ్ఞ తీసుకుంటుందని ఆశిద్దాం.

22 డిసెంబర్ 1973

(1974 జనవరి సృజన)
కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి 50వ వర్ధంతి సంధర్బంగా

No. of visitors : 280
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •